Brahmamudi Serial Today September 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు ఇద్దరు పిల్లలు అన్న పంతులు – అయోమయంలో పడిపోయిన అప్పు
Brahmamudi serial today episode September 6th: పూజ చేయడానికి దుగ్గిరాల ఇంటికి వచ్చిన పంతులు అందరి చేతులు చూసి జాతకాలు చెప్తుంటాడు. కావ్య చేయి కూడా ఇద్దరు పిల్లలు పుడతారని చెప్తాడు.

Brahmamudi Serial Today Episode: రాజ్ తెచ్చిన పాలను చూసిన కావ్య పాలేంటి..? ఇలా ఎర్రగా ఉన్నాయని అడుగుతుంది అందులో మీ అమ్మ తీసుకొచ్చిన కుంకుమ పువ్వు కలిపానని చెప్తాడు రాజ్.
కావ్య: సరే కానీ మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అనుకున్నారా ఏంటి..? ఇద్దరూ ఆడపిల్లలే పుట్టాలని కోరుకుంటున్నారు.. అయినా మీకు ఆడపిల్లలు అంటే ఎందుకండి అంత ఇష్టం..
రాజ్: అమ్మాయిలు అనుకుంటే పుట్టరు.. ఎంతో అదృష్టం ఉంటే పుడతారు.. అయినా అబ్బాయిలు ఆస్తులే అమ్మా నాన్న అనుకుంటారు.. కానీ అమ్మాయిలు మాత్రం అమ్మా నాన్నలే ఆస్తులు అనుకుంటారు. అందుకే నాకు ఆడపిల్ల కావాలనుకుంటున్నాను
కావ్య: అవును మీ అక్క గురించి ఏమనుకుంటున్నారు
రాజ్: ఏమనుకోవడం ఏంటి..? రేపు వెళ్లి ఇంటికి తీసుకురావడమే.. అయినా నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచించి ట్రెస్ తీసుకోవద్దని చెప్పాను కదా. అన్ని నేను చూసుకుంటాను నువ్వు పడుకో
అంటూ రాజ్, కావ్యను పడుకోబెడాతడు. మరోవైపు రూంలో రాహులో ఏవేవో ఆలోచిస్తుంటాడు అప్పుడే రుద్రాణి వెళ్తుంది.
రుద్రాణి: ఏంట్రా ఏదో పంచాంగం చెప్పే పండితుడిలా అలా లెక్కలు వేస్తున్నావేంటి…?
రాహుల్: ఏం లేదు మమ్మీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనులన్నీ ప్రొఫెషన్ లాగా చేస్తే ఎంతొస్తుందా అని లెక్కలు వేస్తున్నాను
రుద్రాణి: అరేయ్ ఇడియట్ ఎవరైనా ఆకాశానికి ఎగరాలనుకుంటారు. నువ్వేంట్రా పని వాడిలా ఆలోచిస్తూ కల్లాపి చల్లాలి అనుకుంటున్నావు నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా..?
రాహుల్: పిచ్చి ఏం కాదు మమ్మీ పరిస్థితులు చూస్తుంటే.. అలాగే ఉన్నాయి. నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అన్నావు తప్పా చేసింది ఏమీ లేదు.. అందరూ కలిసిపోయి ప్రేమ జంటల్లా హ్యాపీగా ముచ్చట్లాడుతున్నారు. వీళ్లను ఇలాగే వదిలేశామంటే వాళ్లకు పిల్లలు పుడతారు.. ఆ రాజ్ కు పుట్టినోడు ఇంటికి వారసుడైపోతాడు. అప్పుడు అందరూ పిలిచి నీకు అలవాటైన పనే కదరా అంటూ ఆ పిల్లల ముక్కులు మూతులు కడిగిస్తారు
రుద్రాణి: అలాంటి కర్మ నీకెందుకు పట్టనిస్తానురా..? నువ్వెప్పటికీ రాజే.. నీ కూతురే నీ తర్వాతి వారసురాలు అవుతుంది.
రాహుల్: ఎలా అవుతారు మమ్మీ వాళ్లకు కూడా పిల్లలు పుడతారు కదా..?
రుద్రాణి: వాళ్లకు పుట్టకుండా చేస్తాను.. నువ్వెప్పుడైనా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత విన్నావా రాహుల్..
రాహుల్: విన్నాను మమ్మీ కానీ అలా జరిగినట్టు ఒక్కసారి కూడా చూడలేదు.
రుద్రాణి: అయితే రేపు చూస్తావు..
అని రుద్రాణి చెప్పగానే.. ఏం చేస్తావు మమ్మీ అని అడుగుతాడు రాహుల్.. చెప్పను చేసి చూపిస్తాను అంటుంది రుద్రాణి. తర్వాత రాహుల్ పాట పాడుతూ కిందకు వస్తుంటే.. ప్రకాష్, సుభాష్ పిలిచి వినాయక చవితికి ఇంట్లో పనులు చేయమని చెప్తారు. రాహుల్ చేయనని చెప్తాడు. ఇంతలో స్వప్న పిలవగానే పరుగెత్తుకుంటూ వెళ్తాడు. రాహుల్‌ను చూసి అందరూ నవ్వుకుంటారు. తర్వాత కావ్యను రూంలోకి పిలుస్తుంది అపర్ణ.
కావ్య: ఏంటత్తయ్యా పిలిచారు
అపర్ణ: నీకు గిఫ్ట్ ఇద్దామని పిలిచాను. దుబాయ్ నుంచి స్పెషల్‌గా నీకోసమే తెపించాను చూడు ఎలా ఉంది నచ్చిందా..?
కావ్య: అమ్మ కోపాన్ని అత్త ప్రేమని నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయక తప్పదు కదా అత్తయ్య గారు..
అపర్ణ: అంటే ఇప్పుడు నచ్చింది అంటున్నావా..? నచ్చలేదు అంటున్నావా..?
రుద్రాణి: అంత ప్రేమగా ఇస్తుంటే నచ్చకుండా ఎలా ఉంటుంది వదిన కచ్చితంగా నచ్చే ఉంటుంది.. డిజైన్ బాగుంది.
అపర్ణ: అందుకే చేయించాను
రుద్రాణి: ఎంత అయిందేంటి ఖర్చు
అపర్ణ: పది లక్షలు
రుద్రాణి: ఏంటి పది లక్షలా.? ఇంత అర్జెంట్‌గా అంత ఖర్చు చేసి గిఫ్ట్ ఇవ్వడానికి కొత్త కోడలా ఏంటి..? ఓ అర్థమైంది కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా కోడలు వారసుణ్ని ఇవ్వబోతుందని ఈ నెక్లెస్ ఇవ్వబొతున్నావా..? వదిన
అపర్ణ: అలాంటి స్వార్థపు ప్రేమలు నీకుంటాయి రుద్రాణి… నాకు కాదు.. నా కోడలికి ఏదైనా బహుమతి ఇవ్వాలని నా మనసుకు అనిపించింది ఇచ్చాను. నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీకు కోడలు ఉంది కదా..? ఇచ్చుకో
రుద్రాణి: మేం మీ అంత అదృష్ట వంతులం కాదులే వదిన
అంటూ వెటకారంగా మాట్లాతుంటే కావ్య కోపంగా రుద్రాణిని తిడుతుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి పూజ చేయడానికి పంతులు వస్తాడు. ఇంట్లో వాళ్ల చేతులు చూసి జాతకాలు చెప్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















