Brahmamudi Serial Today September 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం చెప్పలేక బాధపడుతున్న అప్పు, కళ్యాణ్ - స్వీట్లు పంచిన రేవతి
Brahmamudi serial today episode September 17th: కావ్యకు నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయపడుతుంది అప్పు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్యకు అబార్షన్ చేయాలన్న డాక్టర్ అప్పుకు కాల్ చేస్తుంది. అప్పు కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పడేస్తుంది. అంతా చూస్తున్న కళ్యాణ్ కాల్ ఎవరు చేస్తున్నారని అడుగుతాడు. డాక్టర్ చేస్తుంది అని అప్పు చెప్తుంది.
కళ్యాణ్: మరి లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలా పక్కన పెట్టేశావేంటి..?
అప్పు: పక్కన పెట్టకుండా మరేం చేయమంటావు లిఫ్ట్ చేస్తే అక్కకు ఈ విషయం చెప్పారా లేదా అని అడుగుతారు. అప్పుడేం సమాధానం చెప్పాలి.. లేదా ఇంకెప్పటికి చెప్పలేను అని చెప్పాలా..? ఏం చెప్పను కూచి నువ్వే చెప్పు..
కళ్యాణ్: ఏదో ఒకటి చెప్పు పొట్టి లేదంటే ఈ సారి నీకు వచ్చిన ఫోన్ కాల్ వదినకు వెళ్తుంది. మనం చెప్పకపోతే ఆవిడ చెప్తుంది. అప్పుడు ఇంకా ప్రమాదం పొట్టి.. అందుకే చెప్తున్నాను. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడు
అప్పు: ఆ డాక్టర్ చెప్పండి
డాక్టర్: కావ్యకు విషయం చెప్పావా
అప్పు: చెప్పలేదు డాక్టర్.. అంటే ఇవాళ పండుగ కదా..
డాక్టర్: ఎందుకు చెప్పలేదు.. లేటు అయ్యేకొద్ది మీకే ప్రమాదం.. మీ మంచి కోరి చెప్పాను.. అయినా మీరు ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం
అప్పు, కళ్యాణ్ ఇద్దరూ బాధపడుతుంటారు. మరోవైపు హాల్లో అందరూ హ్యపీగా మాట్లాడకుంటూ ఉంటారు. రేవతి స్వీట్లు పంచుతుంది.
ఇందిరాదేవి: చూశారా..? రేవతి ఇంటికి రాగానే ఇల్లంతా ఎంత సందడిగా మారిపోయిందో.. అందుకే అంటారు.. ఆడపిల్లంటే లక్ష్మీదేవి అని ఎవరేమన్నా కూడా ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఆ కలే వేరు ఆడపిల్ల ఆడపిల్లే
రేవతి: అత్తయ్యా తీసుకో
రుద్రాణి: థాంక్యూ రేవతి..
ఇందిరాదేవి: ఏంటి రుద్రాణి థాంక్సా..? మనఃస్పూర్తిగా చెప్తున్నావా..? లేక చెప్పాలి కాబట్టి మొహమాటానికి చెప్తున్నావా..?
రుద్రాణి: ఏంటమ్మా మొహమాటానికి ఎందుకు చెప్తాను
స్వప్న: ఎందుకంటే తమరికి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నచ్చదు కద అత్త. అందులోనూ రేవతి ఇంటికి రావడం అసలు ఇష్టం ఉండదు కదా..?
రుద్రాణి: ఏయ్ ఏం మాట్లాడుతున్నావే రేవతి రావడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే మీ అందరికంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది.
ప్రకాష్: రుద్రాణి నీ నోటి నుంచి ఎప్పుడైనా నిజం చెప్పావా..?
రుద్రాణి: ఎట్టి పరిస్థితుల్లోనూ నా నోటి నుంచి అబద్దం మాత్రమే వస్తుంది. చీ కాదు కాదు నిజం మాత్రమే వస్తుంది.
ప్రకాష్: చూశావా ఆవేశంలో నిజం నువ్వే ఒప్పుకున్నావు..
అంటూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్ వస్తారు. వాళ్లందరూ హ్యపీగా ఉండటం చూసి ఆగిపోతారు.
అప్పు: ఏంటి కూచి అక్కకు నిజం చెప్తానని వచ్చి ఇక్కడే ఆగిపోయావేంటి..?
కళ్యాణ్: అక్కడికి వెళ్లలేక ఆగిపోయాను పొట్టి.. పుట్టబోయే బిడ్డ గురించి అన్నయ్య కూడా చాలా ఆశలు పెంచుకుంటున్నాడు. అంత సంతోషంగా ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లి ఈ చేదు నిజాన్ని చెప్పలేకే ఆగిపోయాను. నా వల్ల కాదు కావడం లేదు పొట్టి.. ఏదో విధంగా నువ్వే చెప్పు పొట్టి.. లేదంటే అన్నయ్య వాళ్లు ఆ బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకుంటారు
అప్పు: లేదు కూచి నేను ఒక్కదాన్నే వెళ్లి చెప్పలేను.. నాకు తోడుగా నువ్వు కూడా రా
అనగానే సరే వెళ్దాం పద అంటూ ఇద్దరూ వెళ్తారు. అప్పుకు కావ్యకు నిజం చెప్పినట్టు కలగంటుంది. నిజం తెలిసి కావ్య స్పృహ తప్పి పడిపోయినట్టు భయపడుతుంది. దీంతో ఎవరు ఎంత అడిగినా నిజం చెప్పకుండా లోపలికి వెళ్లిపోతుంది అప్పు. లోపల ఇద్దరూ కూర్చుని బాధపడుతుంటారు. ఇంతలో కళ్యాణ్ తన అన్న రాజ్ కు నిజం చెప్పాలనుకుంటాడు. తర్వాత రాజ్ కు నిజం చెప్పడానికి వెళ్తే అప్పుడే బయటి నుంచి వచ్చిన రాజ్ తమకు పుట్టబోయే పిల్లలకు డెస్సులు కొన్నానని చూపిస్తాడు. దీంతో కళ్యాణ్ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















