Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతి మీద దొంగతనం మోపాలనుకున్న రుద్రాణి – కావ్య రూంలోకి వెళ్లిన రుద్రాణి
Brahmamudi serial today episode September 11th: కావ్య నెక్లెస్ కొట్టేసి ఆ దొంగతనం రేవతి మీద మోపాలనుకుంటుంది రుద్రాణి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కిచెన్‌లో ఉన్న రాజ్‌ను బయటకు వెళ్లగొడుతుంది ఇందిరాదేవి. కావ్యను పని చేసుకోనివ్వు అంటూ చెప్తుంది. దీంతో రాజ్ బయటకు వెళ్లిపోయాక కావ్య వంట చేస్తుంది. తర్వాత ఫోన్ చూస్తూ నవ్వుకుంటుంది కావ్య.
అప్పు: ఎంటక్కా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు.
ఇందిరాదేవి: మాకు ఆ జోకేంటో చెబితే మేము కూడా నవ్వుకుంటాము కదా మనవరాలా..?
కావ్య: ఇవి జోక్స్ కాదు అమ్మమ్మ చిన్న పిల్లల వీడియోలు.. ఒక్కొక్కరు చేసే అల్లరి పనులు చూస్తుంటే భలే నవ్వొస్తుంది తెలుసా..?
ఇందిరాదేవి: ఆ నవ్వుకో నవ్వుకో.. ఇంకో తొమ్మిది నెలలు అయితే నీ కడుపులోని పిల్లాడు బయటకు వస్తాడు కదా..? అప్పుడు ఏడిపిస్తాడు నిన్ను వాడి అల్లరి పనులతో
కావ్య: నాకు చాలా ఆశగా ఉంది అమ్మమ్మ వీడు నా కడుపులోంచి బయటకు వచ్చి నన్ను అమ్మా అని పిలిస్తే నాకు వినాలని ఉంది అమ్మమ్మ.
అప్పు: ( మనసులో) కానీ ఆ దేవుడు నీకు ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేడోనని భయంగా ఉంది అక్కా
కావ్య: అమ్మమ్మ నిజంగా అమ్మ తనంలో ఇంత ఆనందం ఉంటుందా..?
ఇందిరాదేవి: ఇప్పుడు నువ్వేం చూస్తావే మనవరాలా..? ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి. మీ అదృష్టం అక్కా చెల్లెలు ఇద్దరూ ఒకేసారి తల్లి కాబోతున్నారు.
అంటుండగానే కావ్యకు డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చార్జింగ్ ఉండటంతో అప్పు వెళ్లి లిఫ్ట్ చేస్తుంది. కావ్యకు అబార్షన్ చేయాల్సిందేనని డాక్టర్ చెప్తుంది. దీంతో అప్పు షాక్ అవుతుంది. తర్వాత రేవతి బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే అపర్ణ బయటకు వస్తుంది.
రుద్రాణి: ఆగు వదిన ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్తున్నావు..
అపర్ణ: భోజనాలు చేయాలి కదా..? అరటి ఆకులు కట్ చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను
రాహుల్: ఆ మాత్రం దానికి నువ్వు వెళ్లడం ఏంటి అత్తయ్యా.. నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదా.. మీరెళ్లండి అత్తయ్యా నేను తీసుకొస్తాను.
అపర్ణ: సరే త్వరగా తీసుకునిరా
రుద్రాణి: నీకెందుకురా ఈ పనులు
రాహుల్: చేయాలి అమ్మా అప్పుడే కదా మంచి పేరు వస్తుంది. నీకు తెలియదులే నువ్వు వెళ్లు
అంటూ రాహుల్ వెళ్లిపోతాడు. అప్పుడే రేవతి ఫోన్ మాట్లాడటం కిటకీలోంచి చూస్తుంది రుద్రాణి.
రుద్రాణి: అమ్మా నా రేవతి డైరెక్టుగా వస్తే మీ అమ్మ నిన్ను గెంటేస్తుందని ఇలా ముసుగులో వచ్చి మీ అమ్మను బురిడీ కొట్టిస్తున్నావా..? చెప్తా నీ పని
రాహుల్: మమ్మీ ఏమైంది అలా తొంగి చూస్తున్నావేంటి..?
రుద్రాణి: ఆ ముసుగులో వచ్చింది ఎవరో కాదురా.. అపర్ణ వదిన పెద్ద కూతురు రేవతి
రాహుల్: ఏంటి మమ్మీ రేవతి అక్కనా..?
రుద్రాణి: అవును నాకు ఇందాకే ఫోన్ మాట్లాడుతుంటే తెలిసింది పద దాని బండారం బయటపెట్టేద్దాం..
రాహుల్: మమ్మీ ఆగు ఇప్పుడు నువ్వు తొందర పడి నిజం బయట పెట్టేశావు అనుకో రాజ్‌కు నీ మీద కోపం వస్తుంది.
రుద్రాణి: అందుకే తను రేవతి అన్న విషయం ఆ రాజ్‌తోనే చెప్పించబోతున్నాను.
రాహుల్: అది ఎలాగ మమ్మీ
రుద్రాణి: దొంతగనంగా ముసుగు వేసుకుని వచ్చిన దాని మీద దొంగతనం నెంప మోపితే వాళ్లే ఆటోమాటిక్ గా బయటపడతారు.
రాహుల్: నువ్వు సూపర్ మమ్మీ పద
అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తారు. రుద్రాణి దొంగచాటుగా కావ్య రూంలోకి వెళ్లి కావ్య నెక్లెస్ కొట్టేసి తీసుకెళ్లి ఎవ్వరూ చూడకుండా రేవతి బ్యాగ్‌లో పెట్టేసి కిందకు వెళ్తుంది. కిందకు వెళ్లి కావ్యను నెక్లెస్ ఎందుకు వేసుకోలేదని అడుగుతుంది. దీంతో కావ్య నెక్లెస్ కోసం రూంలోకి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















