Brahmamudi Serial Today September 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంటికి కావ్య గుడ్ బై – స్వప్నను గెంటేస్తానన్న రుద్రాణి
Brahmamudi Today Episode: తన తల్లికి ఏమైనా జరగరానిది జరిగితే నీ అంతు చూస్తానని కావ్యకు , రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ కు వచ్చిన కళ్యాణ్ ను చూసిన రాజ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. దీంతో సుభాష్‌ను పక్కకు తీసుకెళ్లిన కల్యాణ్.. అన్నయ్యను చూస్తే భయంగా ఉంది పెద్దనాన్న. కంట్రోల్‌లో లేడు. ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్లనమండి అని అంటాడు. వాడు నా మాట ఎక్కడ వింటాడురా అని సుభాష్ అంటాడు. దీంతో కళ్యాణ్ వెళ్లి అన్నయ్య పెద్దనాన్నను చూస్తే భయంగా ఉంది. ఆయన ఇక్కడే ఉంటే బాగుండదు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లు అన్నయ్య అని కళ్యాణ్ రివర్స్ లో చెప్పగానే రాజ్, సుభాష్‌కు ధైర్యం చెప్తుంటే.. నాకు చాలా భయంగా ఉందిరా. నన్ను తీసుకెళ్లురా. ఇంట్లో అందరితో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని సుభాష్ అంటాడు.
రాజ్: అమ్మను విడిచి నేను రాలేను. మీరు కల్యాణ్‌తో వెళ్లండి డాడ్
సుభాష్: అమ్మకు ఏం కాదని చెబుతున్నావ్ కదా. కల్యాణ్ ఉంటాడు. నువ్ రారా
అంటూ రాజ్‌ను తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు సుభాష్. మరోవైపు ఇంట్లో అంతా దిగాలుగా కూర్చుంటారు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తుంటారు. ఇప్పుడు రాజ్ వచ్చాకా కావ్యను గెట్ అవుట్ అనేలా చేస్తాను అంటుంది రుద్రాణి. ఇంతలో సుభాష్, రాజ్ ఇంటికి వస్తారు.
ఇందిరాదేవి: నాన్నా రాజ్ అమ్మకు ఎలా ఉందిరా..?
రాజ్: అక్కడ అందరు చూశారుగా.. ఎలా ఉంటుంది. అలాగే ఉంది.
సుభాష్: రాజ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు.
రాజ్: చావు బతుకుల్లో ఉంది మా అమ్మ. అసలు తప్పు నాది. ఎవరినో నమ్మి అనారోగ్యంగా ఉన్న మమ్మీని వదిలివెళ్లడం నాది తప్పు.
రుద్రాణి: తప్పు నీది కాదురా. ఈ మహాతల్లి కావ్యది. వదినను బాగా చూసుకోమ్మని రాజ్ చెప్పి వెళ్లాడుగా. తనకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత.
స్వప్న: అత్త రాజ్ అసలే బాధలో ఉన్నాడు. సమస్య ఎందుకు పెద్దది చేస్తున్నావు.
రుద్రాణి: ఇవాళ నువ్వు ఏదైనా అంటే కడుపుతో ఉన్నావని కూడా చూడను. కట్టుబట్టలతో గెంటేస్తాను.
ధాన్యలక్ష్మీ : రుద్రాణి అడిగినదాంట్లో తప్పేముంది. అక్కకంటే ముఖ్యమైన పని ఆవిడగారికి ఏం వచ్చిందో..?
కావ్య: కారణం చెబుతాను. కానీ, అత్తయ్యకు ఇలా అవుతుందని ఊహించలేదు. అంత బాధ్యత లేకుండా నేను ఉండను. అదొక్కటి అంతా నమ్మితే చాలు.
Also Read : బిగ్‌బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.. ఇన్‌స్టాలో వైరల్ అవుతోన్న శ్రీజ సీమంత ఫోటోలు
అని తనకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి తాను అపర్ణకు చెప్పి ఆఫీసుకు వెళ్లింది మొత్తం చెప్తుంది కావ్య. అత్తయ్యే నన్ను ఆఫీసుకు పంపించింది. అయితే ఎవరు ఫోన్ చేశారు. అక్కడ ఏం జరిగింది. అన్నయ్యకు, రాజ్‌కు ఎందుకు కాల్ చేయలేదని రుద్రాణి అంటే.. ఆయనకు కాల్ కలవట్లేదని చెప్పాడు కానీ నేను అక్కడికి వెళ్లాక అది ఫేక్ కాల్ అని తెలిసింది అంటూ జరిగింది చెప్తుంది కావ్య.
రుద్రాణి: ఇప్పటికిప్పుడు భలే కథ అల్లేశావు కావ్య. రాహుల్ ను ఇంట్లోంచి గెంటేయాలని ప్లాన్ చేశావా..
కావ్య: నేను జరిగిందే చెబుతున్నాను.
రుద్రాణి: ముందు కల్యాణ్ వెళ్లేలా చేశావు. ఇప్పుడు రాహుల్‌ను కంపెనీకి వెళ్లకుండా చేశావు. మా వదిన ఆరోగ్యం బాలేదని తెలుసు. మా వదిన ప్రాణాల కన్నా నీకు కంపెనీ ముఖ్యమా?
కావ్య: అవును.. ముఖ్యమే. అందుకే ఉంటాను అన్నాను. కానీ, అత్తయ్యే వెళ్లమన్నారు. అది నా బాధ్యత అనుకుని వెళ్లాను. ఇప్పుడు మీకు అవకాశం దొరికిందని ఎక్కువ చేస్తున్నారు ఆపండి.
అని కావ్య అరవడంతో రాజ్ కోపంగా షటప్ అంటూ కావ్యను తిడుతూ ఏం జరిగినా కంపెనీ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. మా అమ్మను నిర్లక్ష్యం చేశావ్. మా అమ్మ ప్రాణాలతో ఉంటుందో లేదో తెలియదు. నీ నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ నిండు ప్రాణాలు. అది తెలుసా నీకు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగిదే నిన్ను జీవితంలో క్షమించను అంటూ రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి