అన్వేషించండి

Meghasandesham Serial Today September 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి

Meghasandesham Today Episode: భూమిని చిన్నప్నుడు కాపాడింది గగన్ అని చెర్రి చెప్పడంతో భూమి హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  ఇంటికి వచ్చిన భూమికి శరత్‌ చంద్ర ప్రేమగా అన్నం తినిపిస్తాడు. అది చూసిన అపూర్వ, నక్షత్ర ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటారు. నాన్న దానికి అన్నం తినిపించడం ఏంటమ్మా అని బాధపడుతుంది. దాని టైం అలా నడుస్తుంది నక్షత్ర అంటుంది. ఇంతలో భూమికి పొలమారడంతో శరత్‌ చంద్ర, అపూర్వను వాటర్‌ ఇవ్వమని చెప్తాడు. అపూర్వ బలవంతంగా నీళ్లు తాగిస్తుంది. ఎవరూ లేకున్నా నేనున్నాను తల్లీ నీకు అంటూ శరత్‌చంద్ర అనడంతో భూమి ఏడుస్తుంది. నీ చేతి గోరు ముద్దలు తినకపోయినా.. నాన్న తినిపించడం సంతోషంగా ఉంది అమ్మా అని శోభా ఫోటో చూస్తూ మనసులో అనుకుంటుంది.

భూమి: ఇప్పుడు నాకు చాలా హ్యపీగా ఉంది.

శరత్‌: అవునా.. నేనున్నాను తల్లీ నీకు.

భూమి: అంకుల్‌ నేను ఆ ఫోటో తీసుకువెళ్ళొచ్చా?

శరత్‌: మా ఫోటో ఎందుకమ్మా..

 భూమి: మా అమ్మా కదా.. అంటే ఆమె నాకు గురువులాంటిది. గురువు అంటే తల్లి లాంటిదే కదా.  ఆమె భర్త అంటే మీరు నాకు తండ్రితో సమానం. అందుకే మా అమ్మా నాన్నల స్థానంలో మీ ఫోటో పెట్టుకుంటాను.

అపూర్వ: బావా ఆ ఇంట్లో వాళ్లకు మనకు అసలు పడదు. ఆ గగన్‌ గాడు మీతో గొడవ కూడా పడ్డాడు. అలాంటి ఇంటికి మీ ఫోటో తీసుకెళ్తే వద్దని వాళ్లు బయటకు విసిరేస్తే.. మనల్ని అవమానించినట్టే కదా?

భూమి: మా అమ్మానాన్నల స్థానంలో మిమ్మల్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు అవమానం జరగనిస్తానా? నా ప్రాణంలా చూసుకుంటాను.

అపూర్వ: వద్దని చెప్తున్నాను కదా?

శరత్‌: అపూర్వ ఆశగా అడుగుతుంది కదా? నువ్వు తీసుకెళ్లు అమ్మా..

 అని శరత్‌చంద్ర చెప్పగానే భూమి హ్యాపీగా వెళ్లి శరత్‌, శోభల ఫోటో తీసుకుని వెళ్తుంది. అక్కడే ఉన్న చెర్రీ ఫోటో చూస్తుంది భూమి. చెర్రీ ఎవరని అడుగుతుంది. దీంతో శరత్‌చంద్ర తన చెల్లెలు కొడుకు అని చెప్తాడు.  బయటకు వెళ్లిన భూమికి గుమ్మం దగ్గర చెర్రి కలుస్తాడు. నీ గురించి నిజం తెలిసిందని నీతో మాట్లాడాలి అని చిన్న పార్క్‌ దగ్గరకు వెళ్లిపోతుంది.

భూమి: నిజంగా చిన్నప్పుడు నేను మీకే దొరికానా?

చెర్రి: సిరిమువ్వ సంబంధం లేని క్వచ్చన్‌ అడుతుందేంటి?  (అని మనసులో అనుకుని) చెప్పాను కదా కష్టపడి నేనే కాపాడానని.

భూమి: వద్దండి ఇంకా నా ఫీలింగ్స్‌ తో ఆడుకోవద్దు. మీరు కాదని నాకు తెలుసు.

చెర్రి: ఎవరో నీకు కావాలని అలా చెప్పారు. చెప్పు ఎవరు చెప్పారు.

భూమి: ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగులబడిపోయినప్పుడు నేను పుట్టాను. ఆ ఫ్యాక్టరీ కాలిపోయాక మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకున్నారు.

   అంటూ భూమి చెప్పగానే చెర్రీ నిజం చెప్తాడు. నిన్ను కాపాడింది ఎవరో కాదు భూమి మా అన్నయ్య. ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నిన్ను కాపాడి. తర్వాత నువ్వు తప్పిపోయినా నీ గుర్తుగా ఆ మువ్వ దాచుకుంది మా అన్నయ్యే  అని చెప్తాడు చెర్రీ. దీంతో భూమి ఎమోషనల్‌ అవుతుంది. సంతోషంగా ఏడుస్తూ.. ఆ తలతిక్కగారా నన్ను కాపాడింది అని అడుగుతుంది. అవునని చెర్రీ చెప్పగానే నన్ను కాపాడిన ఆయన ఇప్పటికీ మువ్వ దాచుకున్నారా? అంటే నన్ను ఇంకా నా మనసులో దాచుకున్నారా? అనుకుని వెళ్లిపోతుంది.

    చెర్రి కూడా నేను ఎన్ని అబద్దాలు చెప్పినా నీ సంతోసం కోసమే అంటాడు. దీంతో భూమి థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంది.  తర్వాత ఏడుస్తూ వెళ్లి గగన్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఏమైందని గగన్‌ అడగ్గానే నేనెవరో తెలుసా? నీ మనసులో ఉన్న నీ మువ్వని అని భూమి జరిగిన విషయం మొత్తం గగన్‌ కు గుర్తు చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అకి వాళ్ల ఇంట్లో ఆర్య, అనుల ఫోటోలు చూసిన గౌరి, శంకర్ – భోజనం చేస్తూ

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget