అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today September 9th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అకి వాళ్ల ఇంట్లో ఆర్య, అనుల ఫోటోలు చూసిన గౌరి, శంకర్ – భోజనం చేస్తూ అమ్మను గుర్తు చేసుకున్న అభయ్

Prema Entha Madhuram Today Episode: అకి వాళ్ల ఇంట్లో ఆర్య, అనుల ఫోటోలు చూసి గౌరి, శంకర్ షాక్ అవుతారు. గౌరి చేసిన భోజనం తిన్న అభయ్ అమ్మను గుర్తు చేసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  అకి వాళ్ల ఇంటికి వచ్చిన గౌరి, శంకర్‌లు ఇంట్లో ఉన్న ఆర్య, అనుల ఫోటో చూసి షాక్‌ అవుతారు. మా ఫోటోస్‌ ఇక్కడెందుకున్నాయని అడుగుతారు. దీంతో జెండే, అకి ఏదో చెప్పి మేనేజ్‌ చేస్తారు. తర్వాత శంకర్‌, గౌరిని తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పైనుంచి వచ్చిన అభయ్‌ ఏమైందని అడుగుతాడు. నీకోసం గౌరి, శంకర్‌ వెయిట్‌ చేసి ఇప్పుడే వెళ్లిపోయారు అని చెప్పగానే సరేలే భోం చేద్దామని అభయ్‌ అంటాడు. అందరూ కలిసి భోం చేయడానికి వెళ్తారు. మరోవైపు ఇంటికి వచ్చిన గౌరి, శంకర్‌ డ్రైవింగ్‌ ను తిడుతుంది.

శ్రావణి: అబ్బా ఏంటక్కా మీరు. వెళ్లేటప్పుడు ఫ్రెండ్లీగానే వెళ్లారు. ఇప్పుడేంటి గొడవ పడుతూ వస్తున్నారు.

పెద్దొడు: మీరెప్పుడు గొడవ పడతారో.. ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారో ఎవ్వరికీ తెలియదు అన్నయ్య.

యాదగిరి: నిజమైన స్నేహితులంటే ఇలాగే ఉంటారు. ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నారు.

గౌరి: వినాయక చవితికి అకిని, జెండే సార్‌ ను ఇన్వైట్‌ చేద్దామని వాళ్ల ఇంటికి వెళ్లొచ్చాము అంకుల్‌.

యాదగిరి: అవునా.. అభయ్‌ బాబును కూడా పిలిచారా?

శంకర్‌: పిలిచాం. కాకపోతే తను మీటింగ్‌ లో చాలా బిజీగా ఉన్నాడట. మమ్మల్ని కలవటం కుదరదు. పండగకి వస్తాం అని చెప్పమన్నాడట.

గౌరి: ఏంటో అకి, జెండే సార్‌ లాగా అభయ్‌ ఎవరితో కలవడేమో..?

యాదగిరి: అలాంటిదేం లేదు మేడం. అభయ్‌ కూడా చాలా మంచివాడు. అందరితో చాలా త్వరగా కలిసిపోతాడు. 

శంకర్‌: నాకేంటో అలా అనిపించలేదు బాబాయ్‌. సరే అది పక్కన పెడితే వాళ్లేంటే విచిత్రంగా మా ఇద్దరి ఫోటోలు తీసుకెళ్లి వాళ్లింట్లో పెట్టుకున్నారు.

చిన్నొడు: వాళ్లింట్లో మీ ఫోటోస్‌ ఉండటమేంటి అన్నయ్య.

శంకర్‌: అదే కదరా నాకు షాకు.. కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలిరా? ఆ ఫోటో చూసి నాకు నేను మరిసిపోయాను.

 అని శంకర్‌ చెప్తుంటే అయినా వాళ్లు మీ ఫోటోస్‌ ఎందుకు పెట్టుకుంటారు వాళ్లు అని శ్రావణి అడగ్గానే శంకర్‌ కాంటెస్ట్‌ అని చెప్పబోతుంటే గౌరి, శంకర్‌ ను ఆపుతుంది. వెంటనే అందరూ పండుగ పనులు ఉన్నాయని వెళ్లిపోతారు. మరోవైపు భోజనం చేస్తున్న అభయ్‌ వాళ్ల అమ్మ అను తినిపించిన జ్ఞాపకం గుర్తు చేసుకుంటాడు. వంట బాగుందని అతిథులు అకిని మెచ్చుకుంటారు.

అకి: ఇది నేను వండలేదు.

అభయ్‌: అకి ఇది నువ్వు చేయలేదా?

రాకేష్‌: సర్వెంట్స్‌ ఎవరైనా చేసి ఉంటారులే అభయ్‌.

జెండే: కాదు.

అభయ్: మరి ఎవరు చేశారు. అచ్చం అమ్మ చేతి వంటలాగే ఉంది. టేస్ట్‌ చూడగానే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది.

జెండే: ఇందాకా గౌరి, శంకర్‌ వాళ్లు వచ్చారు కదా? ఆ గౌరినే చేసింది.

అభయ్‌: ఆవిడ చేసిందా?

అకి: అవును అన్నయ్యా..

జెండే: ఇంత మందికి వంట చేయడం అకి వల్ల అవుతుందో లేదోనని నేనే గౌరి గారిని హెల్ఫ్‌ చేయమని అడిగాను.

అకి: తను వంట చేస్తుంటే నేనే షాక్‌ అయ్యాను అన్నయ్య. సేమ్‌ అమ్మ చేసినట్లే చేసింది.

 అని అకి చెప్పగానే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది. ఆవిడకు ఒకసారి థాంక్స్‌ చెప్పాలి. అనగానే నువ్వు వాళ్లకు థాంక్స్‌ చెప్పాలి అనుకుంటే రేపు వినాయక చవితికి వాళ్ల ఇంటికి రావాలి అని చెప్తుంది. అభయ్‌ సరే అంటాడు. మరోవైపు సంధ్య, శ్రావణి పూజకు ఏర్పాట్లు చేస్తుంటే.. పెద్దొడు, చిన్నొడు వెళ్లి హెల్ప్‌ చేస్తుంటారు. శంకర్‌ పత్రి తీసుకుని వస్తాడు. ఇద్దరు తమ్ముళ్లను చూసి ఇక్కడేం చేస్తున్నారని అడగ్గానే గౌరి గారికి హెల్ప్‌ చేద్దామని వచ్చాం అంటారు. తర్వాత అందరూ కలిసి వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తుంటారు. పనులు చేస్తూనే శంకర్‌ తన ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్తుండటంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు హగ్ చేసుకోవడంతో ఎమోషన్ అయిన మను – అంజు అమ్మానాన్నలు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget