Brahmamudi Serial Today October 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్ ను నిజం చెప్పమని నిలదీసిన కావ్య – స్పృహ కోల్పోయిన అప్పు
Brahmamudi serial today episode October 22nd: క్రాకర్స్ కాలుస్తూ కళ్లు తిరిగి పడిపోతుంది అప్పు. రాజ్ కావాలనే అలా చేశాడని రుద్రాణి ఆరోపిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య తప్ప దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం క్రాకర్స్ కాలుస్తుంది. చివరకు అప్పు కూడా క్రాకర్స్ కాల్చడానికి వస్తుంది. అది చూసిన రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు.
రాహుల్: ఇందేంటి మమ్మీ అందరూ వస్తున్నారు కానీ కావ్య రావడం లేదేంటి..?
రుద్రాణి: అవును రాహుల్.. వెంటనే ఏదో ఒకటి చేసి కావ్య కూడా క్రాకర్స్ కాల్చేలా చేయాలి
అనుకుంటూ రుద్రాణి, రాజ్ దగ్గరకు వెళ్తుంది.
రాజ్: అత్త రా నువ్వు కాల్చు క్రాకర్స్..
రుద్రాణి: రాజ్ నువ్వు వచ్చిన పనేంటి.. చేస్తున్న పనేంటి..?
రాజ్: ఏం పని అత్తా..?
రుద్రాణి: అయ్యో రాజ్ నువ్వు కావ్య మనసు మార్చి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చావు.. నువ్వు ఇక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఉంటే.. కావ్య అక్కడ లోపల పని చేస్తుంది. ఇక ఎప్పుడు కావ్య మనసు మారుస్తావు.. వెళ్లి కావ్యను తీసుకొచ్చి కావ్య చేత కూడా క్రాకర్స్ కాల్పించు
రాజ్: అవును అత్తా భలే గుర్తు చేశావు.. ఇప్పుడే వెళ్లి కళావతిని తీసుకొస్తాను
అంటూ లోపలికి వెళ్తాడు.
కళ్యాణ్: రా అత్తా నువ్వు కూడా కాల్చుదువు
రుద్రాణి: అమ్మో నేను ఇక్కడే ఉంటే ఈ పొగ పీల్చి నేను చస్తాను.. వెంటనే ఎస్కేప్ అవ్వాలి.( అని మనసులో అనుకుంటుంది) లేదులే కళ్యాణ్ నాకు క్రాకర్స్ కాల్చడం అంతగా రాదు.. మీరు కాల్చండి
ఇందిరాదేవి: అవును అవునులే కొంపలు కాల్చడంలో వచ్చే ఆనందం వీటిని కాల్చడంలో ఎలా వస్తుంది దీనికి.. మనమే కాల్చుకుందాం పదండి
రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్ కిచెన్‌లోకి వెళ్తాడు. కావ్య వంట చేస్తూ ఉంటుంది.
రాజ్: పండగ మొత్తం బయట చేసుకుంటుంటే మేడం గారు ఇక్కడేం చేస్తున్నారో…?
కావ్య: పని చేస్తున్న విషయం సార్ గారికి కనిపించడం లేదేమో..?
రాజ్: పని ప్రతి రోజూ ఉంటుంది. పండగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది
కావ్య: ప్రతి ఇంట్లోనూ..పండగ పూట అందరూ సంతోషంగా ఉండాలంటే.. మాలా కొంత మంది ఆడవాళ్లు ఇలా పని చేయక తప్పదు.
రాజ్: అంత బాధపడుతూ ఎందుకు చేయడం
కావ్య: ఇంటి పని చేయడం ఆడవాళ్లకు సంతోషంగానే ఉటుంది తప్పా బాధేం ఉండదు.. వాళ్లు వండిన ఫుడ్డు ఇంట్లో అందరికీ పెట్టి అందరూ తింటుంటే సంతోష పడతారు. అదే వాళ్లకు పండగతో సమానం
అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో క్రాకర్స్ కాలుస్తున్న అప్పు స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కంగారు పడుతుంటారు. లోపలి నుంచి రాజ్, కావ్య పరుగెత్తుకుని వస్తారు. అప్పు అందరూ లోపలికి తీసుకెళ్తారు. డాక్టర్ వస్తుంది. అప్పున చెక్ చేస్తుంది.
డాక్టర్: మీరు కాల్చిన క్రాకర్స్ వల్లే ఇలా జరిగింది. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఇప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండండి
అంటూ డాక్టర్ వెళ్లిపోతుంది. ఇక రుద్రాణి తన నాటకం మొదలు పెడుతుంది.
రుద్రాణి: ఏంటి రాజ్ ఇలా చేశావు.. అలాంటి డేంజరస్ క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చావు.
రాజ్: నేనెందుక కావాలని చేస్తాను అత్తా..
రుద్రాణి: నీ పెళ్లాంకు అబార్షన్ అయ్యేందకు ఇలా నాటకం ఆడావేమో.. టైంకి కావ్య లోపలి ఉండిపోయింది కాబట్టి సరిపోయింది.
ధాన్యం: ఏంటి రాజ్ నువ్వు మరీ ఇలా దిగిజారిపోతున్నావు
కావ్య: మీరు ఇది నా కోసం చేసిన ప్లానే కదా..? అడవిలో మృగం కూడా కనిపిస్తేనే వేటాడుతుంది. ఇలా వెతుక్కుంటూ వచ్చి చంపదు.. మీరు అంత కంటే ఎక్కువే తయారయ్యారు.. అసలు నా బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? మీరు ఈరోజు నిజం చెప్పాల్సిందే..
అంటూ రాజ్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది కావ్య. దీంతో రాజ్ ఆవేశంలో నిజం చెప్పేస్తాడు. అందరూ షాక్ అవుతారు. కావ్య మాత్రం మరో నాటకం ఆడుతున్నావా..? అంటూ తిడుతుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన అప్పు బావ నిజమే చెప్తున్నాడని చెప్తుంది. నువ్వు బిడ్డను కంటే చనిపోతావని డాక్టర్ చెప్పారు అని కళ్యాణ్ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















