Brahmamudi Serial Today May 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్ కోసం రిసార్ట్స్ కు వెళ్లిన యామిని – శృతికి వార్నింగ్ ఇచ్చిన కావ్య
Brahmamudi Today Episode: రాజ్ ను కావ్య రిసార్ట్స్ తీసుకెళ్లిందన్న కోపంతో యామిని కూడా రిసార్ట్స్ కు వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రిసార్ట్స్ కు వచ్చిన శ్వేత.. రాజ్ గురించి ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావేంటి కళ్యాణ్ అంటూ అడుగుతుంది. నీకన్నా ఇప్పుడే తెలిసింది. మేమైతే నెల రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నాము అని చెప్తాడు కళ్యాణ్.. ఇంతలో రాజ్ రావడం అప్పు చూస్తుంది. కూచి బావ వచ్చాడు అని చెప్తుంది. కళ్యాణ్ అప్పు కారు దగ్గరకు వెళ్తారు. శ్వేత లోపలికి వెళ్తుంది.
కళ్యాణ్: అన్నయ్యా..
అప్పు: కూచి.. ఆగు..
కావ్య: హయ్ కళ్యాణ్, హాయ్ అప్పు.. రామ్ గారు తను అప్పు
రాజ్: ఎంత…? అప్పు అన్నారు కదా ఎంతని అడుగుతున్నాను
కావ్య: మిమ్మల్ని నేను హీరోలా పరిచయం చేయాలనుకుంటున్నాను మీరు జోకర్ లా ప్రవర్తించకండి. తన పేరు అప్పు.. నా చెల్లి
రాజ్: ఈను మీ బ్రదర్ కదా..! పప్పులో కాలేశానా..?
కావ్య: తను మా అప్పు హస్బెండ్
రాజ్: మీకు ఇంకా పెళ్లి కాలేదు. మీ చెల్లికి భర్తేంటి
కళ్యాణ్: ఒక కోయిల ముందే కూసింది.
ఇంతలో అక్కడకు శ్వేత వస్తుంది.
రాజ్: తను ఎవరండి ఆమెను చూడగానే మీ అప్పు సీరియస్ అవుతుంది.
కావ్య: అది మా కళ్యాణ్ సెకండ్ సెటప్
అంటూ రాజ్, శ్వేతల మధ్య ఇంతకు ముందు జరిగిన స్టోరీని కళ్యాణ్, శ్వేతల మధ్య జరిగినట్టు చెప్తారు. దీంతో మీరంతా చెప్పేది వింటుంటే నాకు ఏదో గుర్తుకు వస్తుంది అంటాడు. అవునా ఏంటో చెప్పండి అని అందరూ ఆత్రుతగా అడుగుతారు. బాగా ఆలోచించి రాజ్ ఏమీ గుర్తు రావడం లేదని వెల్లిపోతాడు. అందరూ లోపలికి వెళ్లిపోతారు.
కళ్యాణ్: అప్పు మనం ఉండేది ఇక్కడే. ఈ రూమ్‌లో మనిద్దరం ఉంటాము..అన్నయ్యా వదిన ఆ రూంలో ఉంటారు
రాజ్ ఆశగా మెలికలు తిరిగుతూ అదో రకంగా చూస్తుంటాడు.
కళ్యాణ్: ఏంటలా చూస్తున్నారు..?
రాజ్: అదే కళావతి గారితో రూమ్ షేరింగ్ అంటే
అప్పు: కళ్యాణ్ నువ్వు అసలు విషయం మర్చిపోయినట్టు ఉన్నావు.. నీకు నాకు పెళ్లి అయింది. కానీ వాళ్లిద్దరు ఫ్రెండ్స్ కదా..
రాజ్: అంటే నేను.. కళావతి గారు..
అప్పు: మీరు ఇద్దరు కలిసి ఉండకూడదు బావగారు
రాజ్: అయితే నా సింగిల్ రూం ఎక్కడో చెప్పండి వెళ్లిపోతాను
కళ్యాణ్: ఏం అవసరం లేదు అన్నయ్య మనం ఇద్దరం ఒక రూంలో వాళ్లిద్దరు ఒక రూంలో ఉంటారు
అంటూ కళ్యాణ్ చెప్పగానే రాజ్ సరే అంటూ రూంలోకి వెల్లిపోతాడు. తర్వాత రిసార్ట్స్ దగ్గరకు యామిని వస్తుంది.
యామిని: కావ్య నీ రాజ్ ఒకప్పుడు నా రాజ్. ఇక ఎప్పటికీ నా రాజ్ లాగే ఉంటాడనుకున్నాను. కానీ రాజ్ నా కళ్లు కప్పి నీ దగ్గరకు తోక ఊపుకుంటూ వచ్చేలా చేసుకున్నావు. పర్మినెంట్‌గా నీతోనే ఉంటాడనుకోకు. నేనేంటో పూర్తిగా తెలియక నాతోనే చాలెంజ్ చేశావు. ఈ యామినితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు నీకు రుచి చూపిస్తాను.
అనుకుంటూ లోపలికి వెళ్తుంది యామిని. మరోవైపు అప్పు, శృతి కలసి కావ్య దగ్గరకు వెళ్తారు.
అప్పు: అక్కా నువ్వు చెప్పినట్టు డిజైన్స్ తీసుకొచ్చాము
కావ్య: ఏంటి శ్రుతి ఫేస్ అంతా డల్లుగా ఉంది
శృతి: మీరు ఈ డిజైన్స్ ఎందుకు తెప్పించారో నాకు తెలుసు మేడం. ఈ డిజైన్స్ చూపించి సార్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేయాలనే కదా..?
కావ్య: అది మంచి పనే కదా నువ్వెందుకు బాధపడుతున్నావు.
శృతి: సార్ గతం గుర్తు చేసుకుని ఆఫీసుకు తిరిగ వస్తే మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే ఏడుపు వస్తుంది మేడం.
అప్పు: అంటే మా బావకు గతం గుర్తుకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నావా..?
కావ్య కోపంగా చూస్తుంది.
శృతి: ఏంటి మేడం అలా చూస్తున్నారు
కావ్య: నీ ముఖం పగులగొడితే ఎలా ఉంటుందోనని చూస్తున్నాను
అంటూ శృతిని తిడుతుంది కావ్య. అప్పు కూడా శృతిని తిడుతుంది. తర్వాత రాజ్ స్నానానికి కావ్య రూంలోకి వెళ్లినట్టు.. కావ్యతో రొమాంటిక్ గా మాట్లాడినట్టు కల కంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















