Brahmamudi Serial Today May 25th : ‘బ్రహ్మముడి’ సీరియల్ : అందరి ముందు మాయను ఇరికించిన కావ్య – కంపెనీని ముంచేయడానికి రాహుల్ ప్లాన్
Brahmamudi Today Episode: మాయను ఇంట్లోంచి పంపించేందుకు అప్పు తో కలిసి కావ్య ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య, మాయ ఇద్దరూ ఒకేసారి కాఫీ ఇస్తే మాయ తీసుకొచ్చిన కాఫీ తీసుకుని అందరికీ షాక్ ఇస్తుంది అపర్ణ. తర్వాత మాయ నేను నీలాగే అందరికీ అన్ని ఇచ్చానా అని కావ్యను అడుగుతుంది. దీంతో కావ్య కోపంతో నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు కానీ అసలు చేయాల్సింది చేయకుండా ఉన్నావు అని బాబును తీసుకొచ్చి మాయకు ఇచ్చి వీడు లండన్ వెళ్లాడు తీసుకెళ్లి కడుక్కుని రా అని చెప్తుంది. దీంతో మాయ రుద్రాణిని సాయం అడుగుతుంది. దీంతో మాయ, రుద్రాణి ఇద్దరూ కలిసి బాబును తీసుకుని బయటకు వెళ్తారు. వాడిని కడిగి తీసుకురావడానికి నానా తంటాలు పడుతుంటారు. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది.
స్వప్న: వావ్ చాలా బాగుంది.
రుద్రాణి: ఏంటి?
స్వప్న: మీరు చంటి పిల్లాడి ముడ్డి కడగడం..
రుద్రాణి: అలా చూస్తూ నిలబడకపోతే వచ్చి సాయం చేయొచ్చు కదా?
స్వప్న: అలాంటివన్నీ నాకు చేతకావు. పైగా ప్యూచర్‌లో మీరు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడే అవన్నీ నేర్చుకోండి.
రుద్రాణి: నాకెందుకు అవసరం ఉంటుంది.
స్వప్న: నాకు బిడ్డ పుట్టాక వాళ్లకు ఈ సేవలన్నీ మీరే చేయాలి కదా..
రుద్రాణి: నేను చచ్చినా ఆ పనులు చేయను.
అనగానే స్వప్న మీరు ముందు అలాగే అంటారు. కానీ నేను చేయించాల్సిన పద్దతిలో చేయిస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత కావ్య వచ్చి వెటకారంగా చూస్తుంది. దీంతో రుద్రాణి కోపంగా కావ్యను చూస్తుంది. తర్వాత రాహుల్ ఎవరికో ఫోన్ చేసి ఈసారి మనం పక్కాగా డీల్ చేస్తున్నాం అని చెప్తాడు. ఇప్పుడు రాజ్, కావ్య కంపెనీ బాధ్యతల్లో లేరని.. ఇప్పుడు నేనే ఎండీ అని చెప్తాడు. ఈసారి పది కిలోల గోల్డ్ కాదు యాభై కిలోల గోల్డ్ అని రాహుల్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడానికి కూర్చుని ఉంటారు. ఇంతలో మాయ టిఫిన్ రెడీ అంటూ వస్తుంది.
ఇందిరాదేవి: అమ్మా కావ్య టిఫిన్ నువ్వు చేయలేదా?
కావ్య: ఇవి నేనే చేశాను అమ్మమ్మగారు.
రుద్రాణి: రెండో కుంపటి మొదలైంది అన్నమాట
స్వప్న: నీకు ఎంత ఆనందమో కద అత్తా..
రాహుల్: ఇంతకీ రాజ్ ఎక్కడ అత్తా..
మాయ: రాజ్‌కు నా చేత్తో చేసిన టిఫిన్ అంటే ఇష్టం కదా అందుకే నేను వచ్చేదాకా ఎదురుచూస్తున్నాడేమో..?
రుద్రాణి: ఇంటికి రాకముందే ఇష్టాలు తెలుసుకున్నావన్నమాట. ఈ లెక్కన ఒకరినొకరు భలే అర్థం చేసుకున్నారు.
అని రుద్రాణి అంటుండగానే రాజ్ వస్తాడు. దీంతో నీకు ఇష్టమైన టిఫిన్స్ మాయ చేసిందని చెప్పగానే రాజ్ నా ఇష్టాలు మారిపోయాయని కావ్యను అడిగి శాండ్‌విచ్ తెప్పించుకుని పైకి వెళ్లిపోతాడు. దీంతో డైనింగ్ టేబుల్ నుంచి అందరూ లేచి వెళ్లిపోతారు. తర్వాత కావ్య, అప్పును కలిసి మాట్లాడుతుంది.
అప్పు: అసలు ఆ మాయ అలా ఎలా మాట మార్చింది అక్క. మన ముందు అంత భయపడింది. అంతా నిజం చెప్పేస్తానని చెప్పింది.
కావ్య: అంతా నటన నన్ను నమ్మిచి నాచేతే ఈ ఇంట్లోకి రావాలని ప్లాన్ చేసి అలా భయపడినట్లు నటించింది.
అంటూ కావ్య, అప్పు ఇద్దరూ మాయ గురించి మాట్లాడుకుంటూ మాయను ఎలాగైనా ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టాలని ఆలోచిస్తారు. తర్వాత రాజ్ బెడ్ రూంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అక్కడకు వస్తుంది. ఎక్కడికెళ్లావని కావ్యను తిడతాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అమ్మ మళ్లీ తిరిగి వస్తుంది అనిపిస్తుంది- ఆ మాటలు కంటతడి పెట్టించాయన్న జాన్వీ కపూర్