Brahmamudi Serial Today May 24th : ‘బ్రహ్మముడి’ సీరియల్ : మాయకు సపోర్టుగా నిలిచిన అపర్ణ - సుభాష్‌కు వార్నింగ్
Brahmamudi Today Episode: మాయ గురించి నిజం తెలుసుకున్న సుభాష్ మాయను ఇంట్లోంచి వెళ్లిపోమనడంతో మాయ , సుభాష్ కు వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: బెడ్ రూమ్‌లో అనామిక ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కల్యాణ్ వస్తే.. మీ వదిన గురించి నువ్వు చెబితే ఏమో అనుకున్నా కానీ, మాములు తెలివైంది కాదు. అమ్మో ఆమె తెలివి తేటలను అంచనా వేయలేం అని అనామిక అంటుంది. కల్యాణ్ చూస్తూ ఉంటాడు. బిడ్డ తల్లిని తీసుకొచ్చింది. అసలు అలా ఎవరు ధైర్యం చేయలేరు. దాన్ని బట్టే తెలుస్తుంది కావ్య ఎంత తెలివైందో కానీ ఇక ఎట్టి పరిస్థితుల్లో కావ్య ఈ ఇంట్లో ఉండదు అని చెప్పి అనామిక వెళ్లిపోతుంది. మరోవైపు సుభాష్ మాయ గురించి ఆలోచిస్తుంటాడు. నేను చేసిన తప్పుకు కావ్య శిక్ష అనుభవిస్తుంది అని ఇంట్లో దారుణాలు జరగక ముందే మాయను ఇంట్లోంచి పంపించేయాలని డిసైడ్ అవుతాడు సుభాష్. మరోవైపు స్వప్న, కావ్యకు క్లాస్ తీసుకుంటుంది. ప్రపంచంలో ఏ ఆడదైనా సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా అంటూ నిలదీస్తుంది. అత్తయ్యను ఆపడానికి ఇదంతా చేశానని చెప్తుంది కావ్య. దీంతో తర్వాత ఏం చేస్తావని స్వప్న అడగ్గానే తెలియదని చెప్తుంది. మరోవైపు సుభాష్, మాయ దగ్గరకు వెళ్లి నిలదీస్తాడు.
మాయ: ఏంటి మామయ్యగారు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఇలా సైలెంట్‌గా ఉన్నారు.
సుభాష్: చూడు నాకు నీలా వంకరటింకరగా మాట్లాడటం రాదు. నీవు ఆ బిడ్డకు తల్లివి కాదని నాకు తెలుసు. నువ్వు ఈ ఇంటికి వచ్చింది డబ్బు కోసమే కదా?
మాయ: ఏమో అనుకున్నాను కానీ మీ గురించి విన్నదంతా నిజమే మామయ్య గారు. డైరెక్టుగా పాయింట్‌లోకి వచ్చేశారు.
సుభాష్: ఎంత కావాలి?
మాయ: ఎంతిస్తారు?
సుభాష్: నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. వచ్చిన దారినే తిరిగి వెళ్లిపో..
మాయ: మరి మీ ఆవిడ అడుగుతే ఏం సమాధానం చెప్పమంటారు?
సుభాష్: నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు. నీ దారిన నవ్వు వెళ్లిపో.. ఏం చేయాలో నేను చూసుకుంటాను.
అంటూ సుభాష్, మాయను కన్వీన్స్ చేయాలని చూస్తాడు. కానీ మాయ కన్వీన్స్ కాదు. దీంతో సుభాష్ షాక్ అవుతాడు. అంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? అని అడుగుతే అవునని మాయ చెప్తుంది. త్వరలోనే అత్తయ్యగారు మీ అబ్బాయికి, నాకు పెళ్లి చేసి నన్ను ఇక్కడే పర్మినెంట్‌గా ఉండిపోయేలా చేస్తుందని చెప్తుంది. పైగా సుభాష్‌కు వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. మాయ కాఫీ తీసుకుని వస్తుంది.
రుద్రాణి: పండుగ రోజు పానకం తెచ్చినట్టు అన్ని కప్పులతో ఇస్తున్నావ్.. ఎవరెవరికి ఏమేం కావాలో నీకేం తెలుసు? ఈ ఇంట్లో టంగుకో టేస్ట్ ఉంది.
మాయ: గ్రీన్ టీ ఎవరికో.. అల్లం టీ ఎవరికో.. బ్లాక్ కాఫీ ఎవరికో.. ఫిల్టర్ కాఫీ ఎవరికో అన్ని నాకు తెలుసులేండి.
ధాన్యలక్ష్మీ: నీకు అవన్నీ ఎలా తెలుసు?
రుద్రాణి: ఎలా తెలుస్తుంది. రాజ్ చెబితే తెలుస్తుంది.
అనగానే మాయ అందరికీ టీ ఇస్తుంది. స్వప్న దగ్గరకు వెళ్లి ఇవ్వబోతే స్వప్న తీసుకోదు. తర్వాత ప్రకాశ్, ఇందిరాదేవి కూడా కాఫీ తీసుకోరు. ఇంతలో కావ్య కాఫీ తీసుకొచ్చి అపర్ణకు ఇవ్వబోతుంటే మాయ కూడా కాఫీ అపర్ణకు ఇస్తుంది. దీంతో అపర్ణ, మాయ తీసుకొచ్చిన కాఫీ తీసుకుంటుంది. దీంతో కావ్యతో పాటు అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: హేమ మూవీల్లోనే ట్రెడిషనల్, బయట బాగా మోడ్రన్... జీన్స్ వేసి లండన్‌లో షికారు చేసిన ఫోటోలు