Brahmamudi Serial Today May 23rd : ‘బ్రహ్మముడి’ సీరియల్ : మాయతో నాటకం ఆడిస్తుంది తానేనని కావ్యకు చెప్పిన రుద్రాణి – రాజ్‌తో సరసాలు మొదలుపెట్టిన మాయ
Brahmamudi Today Episode : చిత్రను తీసుకొచ్చి మాయగా మార్చి ఈ నాటకం ఆడిస్తుంది తానేనని రుద్రాణి, కావ్యకు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode : మాయ నిజ స్వరూపం బయటపెట్టి ఇంట్లోంచి గెంటేస్తా అని కావ్య అంటుంది. దాంతో దండం పెట్టి అమ్మా తల్లి ఇప్పటిదాకా చేసింది చాలు. ఇంకా కొడైకెనాల్‌లో పడేయకు అని రాజ్ అంటాడు. ప్రపంచంలో ఏ బిత్తిరిది అయినా సవతిని తెచ్చుకుంటుందా. అప్పుడే మా అత్త, హక్కులు, అధికారాలు, కోడలి స్థానం గురించి గెలకడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా తట్టుకుంటావో ఎలా వదిలించుకుంటావో నీ కర్మ అని రాజ్ వెళ్లిపోతాడు. నువ్ మంచి కోసం చేశావమ్మా. కానీ, ప్రపంచంలో నీ అంత స్వచ్ఛంగా ఉండరమ్మా. చూద్దాం ఏం జరుగుతుందో అని సుభాష్ వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటి బయట రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. మాయ వచ్చి తన యాక్టింగ్ ఎలా ఉందని అడుగుతుంది. చాలా బాగా చేశావని రుద్రాణి మెచ్చుకుంటుంది. ఎక్కడ దొరికిపోతావోనని భయపడ్డాను. ఇంట్లో మా అన్నయ్యా, రాజ్, కావ్య నిన్ను భయపెట్టి నిజం చెప్పించాలని చూస్తారు జాగ్రత్త అని చెప్తుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం రాహుల్ చూస్తాడు.
రాహుల్: ఏంటి మమ్మీ ఇదంతా నీ ప్లానా..? అంటే ఈ అమ్మాయి మాయ కాదా?
రుద్రాణి: కాదు..
మాయ: రుద్రాణి ఆంటీ సపోర్టు లేకుండా ఇంత పెద్ద కుటుంబంలోకి నాలాంటి మామూలు అమ్మాయిఎలా రాగలుగుతుంది రాహుల్.
అంటూ ముగ్గురూ మాట్లాడుకుంటుంటే అక్కడకు కావ్య వస్తుంది. ముగ్గురి మాటలు వింటుంది. కోపంగా దగ్గరకు వచ్చి నేను ఎంత తెలివిగా వెళ్లానో అంత తెలివితక్కువగా ఉన్నాను. మిమ్మల్ని అంచనా వేయడంలో మోసపోయాను. అంటూ మాయ రావడంలో తమరి హస్తం ఉందన్నమాట అనగానే మాయ ఏదో చెప్పబోతుంటే నేను అంతా విన్నానని చెప్తుంది కావ్య. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత తేరుకుని రుద్రాణి ఇదంతా నేనే చేశానని.. నువ్వు మా అన్నయ్యతో నిజం చెప్పడం చాటుగా విన్నాను. నువ్వు మాయ కోసం వెళ్లే లోపే అక్కడ ఈ చిత్రను మాయగా సెట్ చేశానని చెప్తుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది.
రుద్రాణి: ఇదంతా నేనే చేశానని ఇంట్లో చెప్తావా? వెళ్లి చెప్పు
కావ్య: చెప్పను. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను. ఇప్పటిదాకా నాకన్నా ముందు మీరున్నారు. ఇకపై నేనుంటాను. ఈ మాయను చేధిస్తాను.
రాహుల్: అదేంటి మామ్ కావ్యను రెచ్చగొడితే ఏం జరుగుతుందో నీకు తెలియదా?
రుద్రాణి: కావ్య ఒక సెంటిమెంట్ పూల్. ఈ ఇంటి కోసం ఏమైనా చేస్తుంది. ఆ బలహీనతే నాకు అస్త్రం. ఈ మాయను ఉపయోగించి ఇంట్లో ఒక ఉప్పెన సృష్టిస్తాను..
అంటూ రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. మరోవైపు రాజ్, మాయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మాయ రాజ్ రూంలోకి వస్తుంది.
రాజ్: అసలు ఎవరు నువ్వు?
మాయ: నీ భార్యని..
రాజ్: కాదని నీకు తెలుసు..
మాయ: మీ ఇంట్లో వాళ్లకు అదే మాట చెప్పు.. నేను ఏమీ కానని.. అప్పుడు ఆ బిడ్డ ఎవరు అని అడుగుతారు. ఆ బిడ్డ తండ్రి ఎవరని అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్తావా? నేను చెప్పాలా?
అని మాయ బ్లాక్ మెయిల్ చేస్తుంటే.. రాజ్ కోపంగా కొట్టబోయి ఆగిపోతాడు. ఎందుకు ఆగిపోయావని మాయ అడిగితే మా ఇంటి సంస్కారం ఆపింది అంటాడు. అదే సంస్కారంతో సంసారం చేద్దాం అంటుంది మాయ. రాజ్ కోపంగా చూస్తుంటాడు. వెంటనే మాయ, రాజ్‌ను బెడ్ మీద తోస్తుంది. దీంతో మాయను తోసేసి రాజ్ పక్కకు వెళ్లిపోతాడు. తర్వాత మళ్లీ వస్తానని మాయ వెళ్లిపోతుంది. బెడ్ రూంలో చిరాకుగా ఉన్న రాజ్ దగ్గరకు కావ్య వచ్చి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏం జరిగిందో చూశానని వ్యగ్యంగా మాట్లాడుతుంది. దీంతో ఏదో ఒకటి చేసి దాన్ని పంపించేయ్ అని చెప్తాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: గ్రాండ్‌గా 'కల్కి 2898 AD' ఈవెంట్ - బుజ్జి లుక్ రివీల్, భైరవ లుక్‌లో ఆకట్టుకున్న 'డార్లింగ్'