Brahmamudi Serial Today May 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి షాక్ ఇచ్చిన రాజ్ - సుభాష్ కొడుకు గురించి చెప్పిన రాజ్
Brahmamudi Today Episode: జనాభా లెక్కల వ్యక్తిగా వచ్చిన యామిని మనిషికి తన గురించి తానే రాజ్ చెప్పుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ ఇచ్చిన లవ్ లెటర్ చదివి కావ్య నవ్వుతుంది. రాజ్ కూడా నవ్వుతూ ఎలా ఉంది అని అడుగుతాడు. మనసు పులకరించిందా..? నాతో ఏడడుగులు వేయాలనిపిస్తుందా..? నా చేతి వేలు పట్టుకుని ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూడాలని ఉందా అని అడుగుతాడు.
కావ్య: అనిపిస్తుంది.. తప్పకుండా అనిపిస్తుంది. కాకపోతే వెళ్లి అప్పుకు ఈ లెటర్ ఇచ్చారంటే తప్పకుండా అనిపిస్తుంది.
రాజ్: అప్పుకా..? చీ నేనెందుకు ఇస్తానండి
కావ్య: ఎందుకంటే ఇది రాసింది కవి గారు కాబట్టి
రాజ్: ఆ మాటలన్నీ నావి
కావ్య: కానీ రాసింది మాత్రం కవిగారు
రాజ్: ఆ విషయం మీకెలా తెలుసు
కావ్య: ఇందులో ఇట్లు మీ కళ్యాణ్ అని రాసి ఉంది. మీ మాటలను కూడా పక్క వాళ్ల దగ్గర కాపీ కొట్టారంటేనే అర్థం అవుతుంది మీది ఎంత గొప్ప మనసో
అనుకుంటూ కావ్య వెళ్లిపోతుంది. రాజ్ కోపంతో కళ్యాణ్ తిట్టుకుని బయటకు వెళ్లి కళ్యాణ్‌ను కొట్టబోతుంటే.. కళ్యాణ్ సారీ అన్నయ్యా అంటూ దొరకకుండా పరుగెడుతుంటాడు. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి వస్తారు.
రాజ్: ఏంటి నవ్వుతున్నారు
ఇందిరాదేవి: మా ఐడియాలన్నీ ముసలి ఐడియాలు.. ఔట్ డేటేడ్ అయిపోయాయి. యూత్‌ఫుల్‌గా ఆలోచించి ఇంప్రెస్ చేస్తా అన్నావుగా ఇలానేనా ఇంప్రెస్ చేసేది.
అపర్ణ: ఇప్పటికైనా అర్థం అయిందా మాది ఓల్డే అయినా గోల్డేరా..?
ఇందిరాదేవి: ఊరికే అన్నారా..? పెద్దల మాట చద్ది మూట
రాజ్: కరెక్టుగా చెప్పారు నాన్నమ్మ. మిమ్మల్ని పక్కన పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఇప్పుడు మీరే నాకు సాయం చేయాలి.
అంటూ వాళ్లను మళ్లీ బతిమాలుతుంటాడు రాజ్. కిటికీలోంచి అంతా చూస్తున్న కావ్య నా కోసం మీరు ఇంత తపన పడుతుంటే చాలా సంతోషంగా ఉందండి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో యామిని ఫోన్ చేస్తుంది.
యామిని: ఏంటి నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడని తెగ సంబరపడిపోతున్నావా..?
కావ్య: చూశావా నువ్వే నా మొగుడు అని ఒప్పుకున్నావు. చివరికి అదే నిజం అవుతుంది
యామిని: దాన్ని గతంగా మార్చి భవిష్యత్తులో రాజ్‌ను నా మొగుణ్ని చేసుకోవడానికే కదా నేను ప్రయత్నిస్తున్నాను
కావ్య: అది అవదు
యామిని: అవుతుందమ్మా… ఏదో ఒక్కరోజు నీకోసం వచ్చాడని అంత కాన్ఫిడెంట్ పనికిరాదమ్మా..?
కావ్య: ఒక్కరోజా ఆయన నాకు వేసిన మూడు ముళ్ల సాక్షిగా ఇవాళ మూడో రోజు. పైగా నాకు మూడు బహుమతులు కూడా ఇచ్చాడు. రాక్షసుడు ఎంత బలవంతుడు అయినా చివరికి ఆ దేవుడి చేత అంతం అవ్వాల్సిందే.. నీ పరిస్థితి కూడా అంతే
అంటూ వార్నింగ్ ఇస్తుంది కావ్య. యామిని కోపంగా వెంటనే రుద్రాణికి కాల్ చేసి నా మనిషి ఒకడు జనాభా లెక్కల కోసం అంటూ ఇంట్లోకి వస్తాడు. నువ్వు పక్కన ఉండి సపోర్టు చేయి అని చెప్తుంది. సరే అంటుంది రుద్రాణి. తర్వాత యామిని మనిషి వస్తాడు. జనాభా లెక్కల కోసం వచ్చానని చెప్పి అందరి డీటెయిల్స్ అడుగుతూ సుభాష్‌ను పిల్లల గురించి అడుగుతాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. రాజ్ వచ్చి వాళ్లకు ఒక అబ్బాయి ఉండే వాడు ఇప్పుడు లేడు అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయాడు అని చెప్తాడు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతలో తేరుకుని కావ్య గురించి కూడా చెప్పండి అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















