Brahmamudi Serial Today May 22nd : ‘బ్రహ్మముడి’ సీరియల్ : దుగ్గిరాల ఇంట్లోకి వచ్చిన మాయ – రుద్రాణి ప్లాన్ సక్సెస్ – కావ్య పరిస్థితి అగమ్యగోచరం
Brahmamudi Today Episode: దుగ్గిరాల ఇంట్లోకి వచ్చిన మాయ తన బిడ్డకు తండ్రి రాజ్ అని చెప్పడంతో కావ్య, సుభాష్, రాజ్ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode : డబ్బుల కోసమే బిడ్డను అడ్డంపెట్టుకొని సుభాష్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్లు కావ్య ముందు మాయ ఒప్పుకుంటుంది. మాయ ఆడుతోన్న నాటకానికి పుల్‌స్టాప్ పెట్టాలని కావ్య అనుకుంటుంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అపర్ణ ముందు నిలబెడుతుంది. తన వల్ల దుగ్గిరాల ఇంట్లో కలతలు వచ్చాయని, తనను క్షమించమని అందరిని అడుగుతుంది మాయ. ఆ బిడ్డకు తల్లిని నేనే అని మాయ చెప్పడంతో.. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరని రుద్రాణి అడుగుతుంది. దీంతో బిడ్డ తండ్రి రాజ్ అని మాయ సమాధానమిస్తుంది.
మాయ: రాజ్ నీకు మాటిచ్చినట్లే అజ్ఞాతంలో ఉండాలని కడుపుతీపిని చంపుకున్నాను. నా బిడ్డకు ఇంటి వారసత్వం వస్తే చాలని ఆశపడ్డాను. అందుకే నీకు, నా బిడ్డకు దూరంగా ఉన్నాను.
రుద్రాణి: ఇన్నాళ్లు కావ్య అంచనా నిజమవుతుందని అనుకున్నాను కానీ రాజ్ నిరపరాధిగా పొరపడ్డాను. నువ్వు ఎంతో త్యాగమూర్తివి.. బిడ్డకు తల్లిని తెచ్చావో...రాజ్‌కు భార్యను తెచ్చావో...నీకు సవతిని తెచ్చావో నాకైతే అర్థం కావడం లేదు.
ధాన్యలక్ష్మీ: ఇన్నాళ్లు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నిజం ఏమిటో తెలిసింది. మాయ బిడ్డకు తల్లి అని తేలింది. ఇప్పుడు ఆ తల్లిబిడ్డలకు న్యాయం చేస్తారా? కావ్యకు అన్యాయం చేస్తారా?
రుద్రాణి: కావ్యకు ఎవరు అన్యాయం చేయాల్సిన పనిలేదు. తన గోయ్యి తానే తవ్వుకుంది. సౌభాగ్యాన్ని ఇంట్లో వదిలేసి దౌర్భగ్యాన్ని వెతికిపట్టుకొచ్చింది
అంటూ ఇంటి కోడలిగా మాయకు మాత్రమే అర్హత ఉందని అనడంతో స్వప్న, రుద్రాణిని తిడుతుంది. ఇందిరాదేవి కూడా కావ్య మెడలో రాజ్ అగ్నిసాక్షిగా తాళి కట్టాడు కనుక కావ్యనే ఈ ఇంటి కోడలు అంటుంది. అపర్ణ మనసులో బాధపడుతుంది. ఇద్దరు అమ్మాయిల బతుకుతో పాటు పసిబిడ్డ భవిష్యత్తు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరికే వరకు మాయను ఇంట్లోనే ఉండనిద్దామని సీతారామయ్య చెప్తాడు. మరోవైపు రాజ్ కావ్యపై కోప్పడతాడు.
రాజ్: ఏదో సాదిద్ధామని వెళ్లి ఇంకో సమస్యను మా నెత్తిన పెట్టావు. ఆ మాయ ఎక్కడుందో తెలియదు. కానీ ఈ మాయ లేడీ ఎక్కడ తగిలింది నీకు. బిడ్డకు తండ్రిని నేనే అనడం ఏమిటి?
సుభాష్: అమ్మా కావ్య అసలు మాయ ఇంటి అడ్రెస్ నీకు ఇచ్చాను. ఆమెను కలవలేదా?
కావ్య: మీరు ఇచ్చిన ఇంటి అడ్రెస్ కే వెళ్లాను మామయ్యగారు. తనే మాయ అని నన్ను నమ్మించింది. అదే నిజమని నమ్మి ఇంటికి తీసుకొచ్చాను.
నీలాగే నేను మోసపోయానని, ఆమె మాయ కాదని నాకు తెలియదు మీకు తెలుసు కదా మీరైనా నిజం చెప్పొచ్చు కదా అంటూ రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. అక్కడ బిడ్డకు , సుభాష్‌కు ఏం సంబంధం లేదని తనకు చెప్పిందని ఇక్కడకు వచ్చి మాట మార్చేసిందని కావ్య బాధపడుతుంది. అయినా కావ్యపై రాజ్ కోపం చల్లారదు. ఎంత చెప్పిన ఆమె మాటలకు కన్వీన్స్ కాడు. మాయ నిజస్వరూపం బయటపెట్టి తానే ఇంట్లో నుంచి ఆమెను బయటకు పంపిస్తానని కావ్య అంటుంది. ఆ అవసరం లేదని రాజ్ అంటాడు. తర్వాత నకిలీ మాయ ఇంట్లోకి రావడం వెనక రుద్రాణి హస్తం ఉండొచ్చని కావ్య అనుమానిస్తుంది. నకిలీ మాయ చేత రుద్రాణినే ఈ నాటకం ఆడిస్తుందని అనుకుంటుండగానే రుద్రాణి, మాయ మాట్లాడుకోవడం కావ్య చూస్తుంది. వారి మాటలు విటుంది. అలాగే కావ్య తమ మాటలు విన్నదని చూసి రుద్రాణి, మాయ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పెళ్ళాం ఫర్నీచర్, ఫిగర్ పెర్ఫ్యూమ్ - రష్మీతో భాస్కర్ కామెడీ, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో అరాచకం