Brahmamudi Serial Today May 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన కళ్యాణ్ – వెడ్డింగ్ కార్డ్స్ రెడీ చేయించిన యామిని
Brahmamudi Today Episode: రోడ్డు మీద రాజ్ చూస్తాడు కళ్యాణ్. అదే విషయం ఇంట్లో వాళ్లకు చెబితే నమ్మరు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ కోసం కావ్య, యామిని గొడవ పడతారు. యామిని రాజ్‌ను ఇకపై రాకుండా కట్టడి చేస్తానంటుంది. నువ్వేం చేసినా రాజ్ వస్తాడని తను చెప్పకుండానే అడ్రస్ తెలుసుకని మరీ ఇంటికి వచ్చి శారీ గిఫ్టుగా ఇచ్చాడని చెప్తుంది. నువ్వెన్ని కట్టుకథలు అల్లినా అవి కథలుగానే మిగిలిపోతాయని అంటుంది కావ్య.
యామిని: అలా ఎప్పటికీ జరగదు రాజ్ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు
కావ్య: ఇంత జరుగుతున్నా..? నీకు ఇంకా అర్థం కాలేదా..? యామిని ఆయన మనసు ఎప్పుడో మారిపోయింది. ఇక మిగిలింది ఆయనకు గతం గుర్తుకు రావడమే..
యామిని: అది ఎప్పటికీ జరగనివ్వను
కావ్య: జరిగేలా నేను చేస్తాను
యామిని: మా పెళ్లికి రాజ్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్లికి అన్ని రెడీ అవుతున్నాయి. ముహూర్తం గురించి అడిగితే నా ఇష్టమే తన ఇష్టం అన్నాడు. నువ్వేమో రాజ్ ఇంకా నీ భర్త అని అనుకుంటున్నావు. నీ మెడలో ఉన్న తాళి త్వరలోనే తెగిపోతుంది.
కావ్య: సరే నువ్వనుకున్నదే నిజం అనుకుందాం. ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకుందాం. మరి నీతో ఉండాల్సిన మనిషి నాతో ఇలా రెస్టారెంట్ లో కలిసి కాఫీ తాగడానికి ఎందుకు వచ్చారు. నీతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన మనిషి నాకోసం చీర కొనుక్కుని నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వస్తాడు
యామిని: అంటే నువ్వు అడిగితే నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు అంటావా
కావ్య: అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని.. కానీ అలా చేయను ఆయన మనసులో నేను ఉన్నాను. అదే ఆయనకు గతం గుర్తు చేస్తుంది
అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. కళ్యాణ్ బైక్ మీద వెళ్తూ రాజ్ వెళ్తున్న కారుకే డాష్ ఇస్తాడు. రాజ్ కారు ఆపి ఏంటి బ్రో చూసుకోవాలి కదా అంటాడు. సారీ బ్రో నాదే తప్పు అంటూ కళ్యాణ్ రాజ్‌ను చూసి షాక్ అవుతాడు. వెంటనే అన్నయ్యా అని పిలుస్తుండగానే రాజ్ వెళ్లిపోతాడు. కళ్యాణ్ బైక్ మీద ఫాలో అవుతుంటే మధ్యలో ట్రాఫిక్ ఫోలీస్ వచ్చి కళ్యాణ్‌ను అపేస్తాడు. తర్వాత సంతోషంగా కళ్యాణ్ ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంటాడు.
అప్పు: ఏమైంది కూచి
కళ్యాణ్: చెప్తా పొట్టి ఇలాంటి విషయాలు ఒకరిద్దరికి చెప్పేవి కావు. అందరూ వినాలి. నాన్నమ్మ తాతయ్య అందరూ రండి
ప్రకాష్: ఏంట్రా ఏదైనా మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చిందా ఏంటి..?
కళ్యాణ్: అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ నాన్న
సుభాష్: నీకు అంతకన్నా పెద్ద గుడ్‌న్యూస్ ఏంట్రా
కళ్యాణ్: చెప్తా పెద్దనాన్న.. నాన్నమ్మ, తాతయ్య త్వరగా రండి
అపర్ణ: ఓరేయ్ కళ్యాణ్ నువ్వు ఇప్పుడు ఎందుకు పిలిచావో త్వరగా చెప్పరా..?
కళ్యాణ్: చెప్తాను పెద్దమ్మ ఇన్ని రోజులు కావ్య వదిన చెప్తే మనం నమ్మలేదు కానీ అన్నయ్యా బతికే ఉన్నాడు. నేను నా కళ్లతో చూశాను.
అందరూ షాక్ అవుతారు.
ధాన్యలక్ష్మీ: అనుకున్నాను కావ్య తర్వాత ఎవరా అనుకున్నాను. ఇప్పుడు నువ్వా..?
కళ్యాణ్: లేదు అమ్మా నేను చూశాను
ధాన్యం: చూస్తే ఇంటికి తీసుకురాలేదేం.. అదిగో వస్తుందిగా వెళ్లి తనతో చెప్పు తను నమ్ముతుంది
కళ్యాణ్: వదిన ఇన్నాళ్లు మీరు చెప్తుంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను వదిన ఎందుకంటే అన్నయ్యను నేను చూశాను
ఇందిరాదేవి: నా మీద ఒట్టేసి చెప్పరా..?
కళ్యాణ్: నిజంగా నేను అన్నయ్యను చూశాను ఆ దేవుడి మీద ఒట్టు నాన్నమ్మ.
సీతారామయ్య: ఓరేయ్ కళ్యాణ్ నువ్వు ఆ మాట చెప్తుంటే.. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. మళ్లీ అబద్దం అని చెప్పవు కదా..?
కళ్యాణ్: తాతయ్యా నేను నిజంగానే చూశాను.
ధాన్యం: చూస్తే మరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదు
కళ్యాణ్: తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కానీ ఎందుకో అన్నయ్య నన్ను గుర్తు పట్టనట్టుగా వెళ్లిపోయాడు
అంటూ కళ్యాణ్ చెప్తుండగానే ధాన్యలక్ష్మీ నిష్టూరంగా ఈ భాధ్యతల నుంచి తప్పించుకోవడానికి అలా తిరుగుతున్నాడేమో అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ధాన్యలక్ష్మీని తిట్టి నిజం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. మీకు నిజం తెలిసినా ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదని ఎమోషనల్ అవుతారు. వెంటనే వెళ్లి రాజ్ ను తీసుకొద్దాం పదండి అంటాడు సీతారామయ్య. కావ్య అడ్డుపడి వద్దని చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్‌ను ఇంటికి తీసుకురావడం సేఫ్ కాదని వివరిస్తుంది. దీంతో అందరూ సరే అంటారు. అలాగే ఈ విషయం రుద్రాణికి తెలియకూడదని అనుకుంటారు. ఇంతలో రుద్రాణి వచ్చి ఏ విషయం నాకు తెలియకూడదు అంటుంది. ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతారు. ఇక్కడేదో గూడుపుఠాణి జరిగింది అంటూ రుద్రాణి రాహుల్ చెప్తుంది. మరోవైపు రాజ్, కావ్య గురించి ఆలోచిస్తుంటే యామిని వచ్చి వెడ్డింగ్ కార్డ్స్ చూపిస్తుంది. రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















