Brahmamudi Serial Today May 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రుద్రాణికి షాక్ ఇచ్చిన సుభాష్ - ప్లాన్ మొత్తం వినేసిన స్వప్న
Brahmamudi Today Episode: కావ్యకు పెళ్లి అయిందని రాజ్‌కు చెప్పాలనుకున్న రుద్రాణి ప్లాన్ తెలుసుకుంటుంది స్వప్న దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ధాన్యలక్ష్మీ కోపంగా వచ్చి ఆఫీసుకు వెళ్తున్న అప్పు ఆగవే అంటూ పిలుస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇందిరాదేవి మాత్రం ఆఫీసుకు వెళ్తుంటే ఆపుతున్నావేంటి ధాన్యలక్ష్మీ అని అడుగుతుంది. అప్పు షాకింగ్ గా అలాగే నిలబడుతుంది.
ధాన్యం: నేను కూడా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదనే తనను ఆగమన్నాను అత్తయ్యా
అపర్ణ: ఇప్పుడు ఏం జరిగిందని అలా కోపంగా ఉన్నావు
ధాన్యలక్ష్మీ: మీ అందరికీ పైకి కనిపించే నవ్వులే కనిపిస్తున్నాయి. కానీ నా కొడుకు అనుభవిస్తున్న బాధ ఎవ్వరికీ తెలియడం లేదు
కళ్యాణ్: నేను ఎక్కడ బాధపడుతున్నాను అమ్మా సంతోషంగానే ఉన్నాను కదా..?
ధాన్యలక్ష్మీ: చాల్లే నోరు మూయ్.. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో రాత్రి నేను కళ్లారా చూశాను
కళ్యాణ్: ఇప్పుడు దానికి గొడవ చేయాలనుకుంటున్నావా..?
ధాన్యం: నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను
ఇందిరాదేవి: ఆఫీసుకు వెళ్తున్న అమ్మాయిన ఆపి గొడవ చేయాలనుకోవడం ఏంటి.? అసలు నీకేం కావాలి
ధాన్యం: నా కొడుక్కు న్యాయం కావాలి. వాడు సక్రమంగా కాపురం చేయాలి. పిల్లలను కనాలి అదే నాకు కావాలి. అదేమో ఉద్యోగం పేరుతో పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతుంది. వీడేమో దాని కోసం పస్తులు పడుకుంటున్నాడు. ఇలా అయితే వీళ్లు ఎప్పుడు కాపురం చేస్తారు ఎప్పుడు పిల్లలను కంటారు.
సుభాష్: అయితే ఇప్పుడు వాళ్లు ఏం చేయాలని కోరుకుంటున్నావు
ధాన్యం: అప్పు పోలీస్ జాబ్ మానేయాలి.. ఈ ఇంటి కోడలుగా బుద్దిగా ఇంట్లో ఉండి నా కొడుకు ఆలనా పాలనా చూసుకోవాలి.
దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. కళ్యాణ్ మాత్రం అప్పును వెనకేసుకొస్తాడు. జాబ్ మానే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ బాధపడుతూ లోపలికి వెల్లిపోతుంది. అపర్ణ, కళ్యాణ్‌ను మెచ్చుకుంటుంది. అప్పు ఆఫీసుకు వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి ఆఫీసులో ఉన్న సతీష్‌కు ఫోన్ చేసి ఇవాళ ఎలాగైనా కావ్య శంషాబాద్ బ్రాంచ్‌కు వచ్చేలా చేయమని చెప్తుంది. నిజం తెలిస్తే బాగుండదేమోనని సతీష్ బయపడుతుంటే లక్ష తీసుకున్నావు ఈ మాత్రం చేయలేవా అంటూ రుద్రాణి తిడుతుంది. సతీష్ సరే మేడం అని కాల్ కట్ చేస్తాడు. కావ్య రెడీ అవుతుంటే సతీష్ ఫోన్ చేస్తాడు.
కావ్య: ఆ చెప్పండి సతీష్ గారు..
సతీష్: మేడం మీరు అర్జెంట్‌గా ఆఫీసుకు రావాలి
కావ్య: ఇప్పుడా..? ఎందుకు..?
సతీష్: నిన్న రావాల్సిన రా మెటిరీయల్ రాలేదు మేడం. ప్రొడక్షన్ ఆగిపోయింది.
కావ్య: అదేంటి రా మెటీరియల్ డెలివరీ చేసినట్టుగా నాకు మెసేజ్ వచ్చింది.
సతీష్: సెక్యూరిటీ క్లియరెన్స్ లో ఏదో ప్రాబ్లమ్ వచ్చి బయటే ఆగిపోయింది మేడం
కావ్య: సెక్యూరిటీ క్లియరెన్సా..? వాళ్లెందుకు ఆపుతారు.. నేను సెక్యూరిటీ ఇంచార్జ్ కిషోర్‌తో మాట్లాడతాను
సతీష్: మేడం ఆయన లీవ్‌లో ఉన్నారు.
కావ్య: అయితే ఏంటి..? ఫోన్ చేసి మాట్లాడతాను.
సతీష్: ఆయన ఫోన్ స్విచ్చాప్ లో ఉంది మేడం
కావ్య: ఆయన ఎలాగూ ఇంటికి వస్తున్నారు. తాతయ్యేమో నన్ను ఇంట్లోనే ఉండమన్నారు. ఈ సాకు చూపించి బయటకు వెళ్లిపోవచ్చు ( అని మనసులో అనుకుంటుంది) సరే వస్తున్నాను.
అంటూ కావ్య ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంది. అంతా చాటు నుంచి విన్న రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక కావ్య ఆఫీసుకు వెళ్లడానికి కిందకు వెళ్లగానే సుభాష్, ప్రకాష్ కలిసి ఆఫీసుకు వెళ్లకుండా చేస్తారు. దీంతో రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. రూంలోకి వెళ్లి ప్రకాష్, సుభాష్‌లను తిట్టుకుంటుంది. ఇంతలో యామిని ఫోన్ చేస్తుంది.
యామిని: కావ్యను ఇంట్లోంచి పంపించేశారా..?
రుద్రాణి: పంపించడం కుదరలేదు.. నేను ప్లాన్ చేశాను మా అన్నయ్యలు ఫెయిల్ చేశారు.
యామిని: మిమ్మల్ని నమ్ముకుంటే నట్టేట ముంచేలా ఉన్నారు..?
రుద్రాణి: ఆ ప్లాన్ ఫెయిల్ అయితేనేం మరో ప్లాన్ ఉంది. రాజ్ ఇక్కడికి రాగానే కావ్య పెళ్లి ఫోటో చూపిస్తాను.
అని తన ప్లాన్ చెప్పగానే యామిని హ్యపీగా ఫీలవుతుంది. చాటు నుంచి మొత్త విన్న స్వప్న అత్తా నీ తిక్క నేను కుదుర్చుతాను అనుకుంటుంది. ఇంతలో కింద రాజ్ వస్తాడు. రాజ్‌ను చూసి కావ్య మళ్లీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది. ఇది నా ఇల్లు అందుకే వచ్చానని రాజ్ చెప్తాడు. ఇంతలో రుద్రాణి వచ్చి గతం మర్చిపోయిన ఇల్లు మర్చిపోలేదు అంటుంది. దీంతో రాజ్ పాత సినిమాల్లో ఉండే సూర్యకాంతం ఈవిడేనా అని అడుగుతాడు. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















