Brahmamudi Serial Today May 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యను కన్వీన్స్ చేసిన బామ్మ – పెళ్లికి రెడీ అయిన రాజ్
Brahmamudi Today Episode: రాజ్ ఇంటికి వచ్చినా తనతో కావ్యను మాట్లాడొద్దని అపర్ణ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌లో ఎందుకు క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని కావ్య ఇంట్లో వాళ్ల మీద అరుస్తుంది. ఇంకోసారి రాజ్‌ను ఇంటికి పిలవొద్దని చెప్తుంది. అయితే ఇందిరాదేవి కోపంగా కావ్యను తిడుతుంది.
ఇందిర: వాడు నా మనవడే కాదు ఈ ఇంటికి వారసుడు కూడా ఆ విషయం గుర్తు పెట్టుకో నువ్వు
కావ్య: ఆ విషయం ఆయనకే గుర్తు లేదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి
స్వప్న: అది గుర్తు చేయడానికే మా ప్రయత్నం.. అయినా మేము చేసిన దానికి మెచ్చుకోవడం పోయి తిడతావేంటి
కావ్య: రిసార్ట్స్ లో ఏం జరిగిందో మర్చిపోయారా..?
అపర్ణ: గుర్తుంది కాబట్టే అటువంటి తప్పు ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడుతున్నాము. వాడికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా నీకు దగ్గర చేస్తున్నాము.
కావ్య: అయ్యో అత్తయ్యా మీకు ఎలా చెప్పాలో అర్తం కావడం లేదు. ఆయనకు గుర్తు రావడమే సమస్య
ఇందిర: నువ్వు దగ్గర అవడం కాదే.. వాడు అటూ ఇటూ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు
కావ్య: కానీ నాకసలు ఇష్టం లేదు దీనికి నేను అసలు ఒప్పుకోను
అంటూ బాధగా వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు ఇంటికి హుషారుగా వెళ్లిన రాజ్‌ను చూసి యామిని పలకరిస్తుంది.
యామిని: ఏంటి బావ ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు
రాజ్: వెడ్డింగ్ కార్డ్స్ నా ఫ్రెండ్ సర్కిల్ లో పంచడానికి వెళ్లాను
యామిని: చెప్తే నేను వచ్చేదాన్ని కదా
రాజ్: నువ్వు నిద్ర పోతున్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదు
యామిని: థాంక్యూ సో మచ్ బావ పెళ్లి విషయంలో ఇన్ని రోజులు నేను తొందరపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా తొందర పడుతున్నావు అంటే హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని వెంటనే మమ్మీ డాడీలతో షేర్ చేసుకోవాలి ( లోపలికి వెల్లి ) ఇడ్లీ టేస్ట్ అదిరిపోయింది.
వైదేహి: ఈ టేస్ట్ ఇడ్లీలది కాదు కానీ ఏంటి విషయం
యామిని: ఈ రోజు బావ ఏం చేశాడో తెలుసా..? మా పెళ్లి పత్రికలు తన ఫ్రెండ్ సర్కిల్ లో పంచాడట
వైదేహి: ఇది నిజంగా గుడ్ న్యూస్ బేబీ..
యామిని: గుడ్ న్యూస్ అని సింపుల్ గా అంటావేంటి మమ్మీ నేను అడక్కుండానే తనే స్వయంగా పెళ్లి పత్రికలు పంచాడట. వెంటనే నా ప్రెండ్స్‌కు కూడా పంచమన్నాడు తెలుసా..
వైదేహి: ఇంకా నీ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ ఏంటి బేబీ.. వెంటనే మన చుట్టాలకు కూడా మీరిద్దరు కలిసే పంచండి
యామిని: అవును సంతోషంలో అసలు విషయం మర్చిపోయాను వెంటనే ఈ విషయం నా శత్రువుకు చెప్పాలి
అనుకుంటూ రూంలోకి వెళ్లి కావ్యకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. కావ్య నవ్వి ఉదయం రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీతో గడిపింది మొత్తం చెప్తుంది దీంతో యామిని షాక్ అవుతుంది. సీతారామయ్య, ఇందిరాదేవి.. కావ్యను పిలిచి రోజూ రాజ్ ఇంటికి వస్తాడు కానీ నువ్వు రాజ్‌తో మాట్లాడకుండా ఉండాలని నీ ప్రేమ కోసం ఇంట్లో వాళ్లకు దగ్గర అవుతాడని అప్పుడైనా గతం గుర్తుకు వస్తుందేమో అని చెప్తాడు. బాధతో కావ్య సరే అంటుంది. కళ్యాణ్ అప్పు కోసం ఎదురుచూస్తుంటే..ధాన్యలక్ష్మీ వచ్చి ఎక్కడైనా మొగుడి కోసం పెళ్లాం ఎదురుచూస్తుంది కానీ ఇక్కడంతా రివర్స్‌గా ఉందని తిడుతుంది. తర్వాత కావ్య దేవుడి ముందు నిలబడి ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటుంది. మరోవైపు రాజ్ దుగ్గిరాల ఇంటికి రావడానికి రెడీ అవుతుంటాడు ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















