Brahmamudi Serial Today May 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అనామిక ఎవరో తనకు తెలియదన్న కళ్యాణ్ – రాజ్‌ను ముద్దులతో ముంచెత్తిన కావ్య
Brahmamudi Today Episode : అనామికను ఎవరో తనకు తెలియదని కళ్యాణ్ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode : అనామిక ప్రేమగా కళ్యాణ్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటే కళ్యాణ్, అనామికను దూరం పెడతాడు. నీకు అరెస్ట్ చేయించడమే తెలుసు అనుకున్నాను కానీ ఇలా ప్రేమగా నటించడం కూడా తెలుసని ఇప్పుడే తెలిసింది అంటాడు. దీంతో అనామిక ఫీల్ అవుతుంది. నీతో ప్రేమగా ఉండాలని మనిద్దరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది. అయితే రూంలో ఉన్న ప్లవర్‌వాజ్‌ను పగులగొట్టి దానికి సారీ చెబితే అది మళ్లీ అతుకుతుందా? అని కళ్యాణ్ అడగ్గానే అది ప్రాణం లేనిది నువ్వు ప్రాణం ఉన్న వ్యక్తివి అంటుంది అనామిక. నాకు ప్రాణం ఉంది కానీ అందులో ప్రేమే లేదంటాడు కళ్యాణ్. నన్నెప్పుడూ భర్తగా చూడలేదని ఇప్పుడే కాదు నిన్నెప్పుడూ దగ్గరకు తీసుకోలేనని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు.
మరోవైపు కావ్య రూంలోకి రాగానే రాజ్ నిద్రపోతుంటాడు. రాజ్ ను చూసిన కావ్య ప్రేమగా రాజ్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో కావ్య ఆత్మ బయటకు వస్తుంది. వెంటనే ముద్దు పెట్టుకో అని కావ్యకు చెప్తుంది. కావ్య సిగ్గుపడుతుంది. ఇంతలో ఆత్మ నేను ముద్దు పెట్టుకుంటాను చూడు అంటూ వెళ్లి రాజ్‌ను కావ్య ఆత్మ ముద్దు పెట్టుకుంటుంది. దీంతో కావ్య సిగ్గుపడుతుంది. ఇంతలో రాజ్ నిద్ర లేచి ఏం జరిగిందని అడుగుతాడు. ఏం లేదని కావ్య వెళ్లిపోతుంది. తర్వాత కళ్యాణ్ హాల్ లో కూర్చుని కవితలు రాసుకుంటుంటే రుద్రాణి వస్తుంది.
రుద్రాణి: వీడేంటి ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు.. ఈ సంగతి తెలిస్తే అనామిక ఇల్లు పీకి పందిరేస్తుందని మనసులో అనుకుని అనామికను వెతుకుంటూ వెళ్తుంది. అనామిక గార్డెన్‌లో కూర్చుని ఉండటం చూసి అనామికను లోపలికి తీసుకొచ్చి కళ్యాణ్‌ను చూపిస్తుంది. కవితలు రాస్తున్న కళ్యాణ్‌ను చూసిన అనామిక షాక్ అవుతుంది.
రుద్రాణి: ఏయ్ ఏంటి వాడు ఆఫీసుకు వెళ్లకుండా కవితలు రాస్తుంటే చూస్తూ నిలబడ్డావేంటి?
అనామిక: నేనే వెళ్లి నిలదీయాలా?
రుద్రాణి: ఏం మళ్లీ ఈ చెంప కూడా పేలిపోతుందని భయపడుతున్నావా?
అనామిక: నాకు అలాంటి భయాలేం లేవు అడగాల్సిన వాళ్లతోనే అడిగిస్తాను.
అంటూ కిచెన్‌లోకి వెళ్లి ధాన్యలక్ష్మికి కళ్యాణ్ ఆఫీసుకు వెళ్లకుండా హాల్లో కూర్చుని కవితలు రాస్తున్నాడని చెప్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ, అనామిక హాల్లోకి వస్తారు. అనామిక కళ్యాణ్‌ను పిలిచినా ఉలకడు.. పలకడు. రుద్రాణి పిలిస్తే పలుకుతాడు. అనామిక అంతలా పిలిస్తే నీకు వినిపించలేదా? అని రుద్రాణి అడుగుతే నన్ను పిలిచిందా? బయట కుక్కలు మొరుగుతున్నాయనుకున్నా అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
కళ్యాణ్: ఈరోజు నుంచి నాకు వచ్చిన పని నచ్చిన పని చేసుకుంటూ కూర్చుంటాను.
ప్రకాశ్: మరి అందరూ కలిసి నీకు ఇచ్చిన పని ఏం చేస్తావురా?
కళ్యాణ్: అది నాకు నచ్చని పని అని తెలుసు కదా నాన్న.
రుద్రాణి: మీరిద్దరూ కలిసి కవిత్వం రాస్తున్నారా? వచ్చిన, నచ్చిన తెచ్చిన అని ప్రాస పదాలతో తెలుగు వర్షం కురిపిస్తున్నారు.
అనామిక: ఆఫీసుకు ఎందుకు వెళ్లవు..
కళ్యాణ్: అది అడగడానికి నువ్వెవరు?
అనామిక: నేను నీ భార్యను అడిగే హక్కు నాకుంది. చెప్పాల్సిన బాధ్యత నాకుంది.
అంటూ అనామిక చెప్పగానే ఇంట్లో వాళ్లు ఎవరైనా మీ భర్తల మీద మీరు పోలీస్ కేసు పెట్టారా? అని అడుగుతాడు కళ్యాణ్. ఎవరు? ఎవరి మీద కేసు పెట్టలేదని ప్రకాష్ చెప్పగానే నా మీద కేసు పెట్టిన మనిషి నాకు భార్య ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతకాలం నీకు నచ్చినవన్నీ చేశాను. ఇవాళ్టీ నుంచి నాకు నచ్చినవి మాత్రమే చేస్తానని చెప్తాడు కళ్యాణ్. నేను ఇక ఆఫీసుకు వెళ్లనని అనడంతో.. ఇలా ఆఫీసుకు వెళ్లనని అంటే ఎలారా అని అపర్ణ అడగడంతో అది నీ సమస్య పెద్దమ్మా అంటూ అపర్ణను ప్రశ్నిస్తాడు కళ్యాణ్ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: తెలుగులో ఫ్లాప్ - తమిళంలో బ్లాక్ బస్టర్ - 'అరణ్మనై 4’కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్