Aranmanai 4: తెలుగులో ఫ్లాప్ - తమిళంలో బ్లాక్ బస్టర్ - 'అరణ్మనై 4’కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్
Aranmanai 4: తమిళ్ ఇండస్ట్రీ ఎట్టకేలకు ఈ ఏడాది హిట్ కొట్టింది. రికార్డు కలెక్షన్ లు సాధించి అరుణ్ మనై 4 హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
Aranmanai 4 box office collections: 2024లో అసలు హిట్ కొట్టని తమిళ ఇండస్ట్రీకి 'అరణ్మనై 4' సినిమా ప్రాణం పోసింది. ఈ ఏడాది తొలి హిట్ గా నిలిచింది ఈ సినిమా. రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్. తమిళ హీరో, కుష్బు భర్త సుందర్.సి, తమన్నా తదితరులు నటించిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. మే 3న రిలీజైన సినిమా పది రోజుల్లో కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది కోలీవుడ్‌కు భారీ కలెక్షన్స్ అందించిన మూవీ ఇదే కావడం గమనార్హం.
రూ.50 కోట్ల కలెక్షన్..
తమన్నా, సుందర్ సి నటించిన సినిమా వీకెండ్ లో భారీ కలెక్షన్లు సాధించింది. హిట్ టాక్ రావడం, వీకెండ్ కావడంతో భారీగానే వసూళ్లు వచ్చాయి. రిలీజైన రెండో వారంలో దాదాపు రూ.10.75 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఇక పది రోజుల్లో రూ.41.05 కోట్లు రాబట్టి మొత్తం రూ.50 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని, తమిళనాడులో బిగ్ హిట్ అవుతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ.60 కోట్లకు పైగానే కలెక్షన్లు నమోదయ్యాయి. దాంట్లో కూడా మలేషియాలోనే అధిక కలెక్షన్లు సాధించింది. ఇక మొదటి వారం 37.75 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండో శుక్రవారం రూ.2.60 కోట్లు, రెండో శనివారం రూ.4.25 కోట్లు, రెండో ఆదివారం రూ.5.40 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి ఇదే హయ్యస్ట్ గ్రాస్. మలయాళం సినిమా మంజుమ్మల్ బాయ్స్ తమిళ్ లో సాధించిన కలెక్షన్స్ కంటే అరణ్మనై 4 ఎక్కువ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘బాక్’ టైటిల్‌తో రిలీజైంది.
కథేంటంటే?..
శివశంకర్ (సుందర్ సి) లాయర్. అతడికి చెల్లెలు శ్రీనిధి (తమన్నా) అంటే ప్రాణం. అయితే... ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ఆమెను కుటుంబం దూరం పెడుతుంది. కొన్ని రోజులకి చెల్లెలితో పాటు బావ ఆత్మహత్య చేసుకుంటారు. అది తెలిసి అత్తయ్య (కోవై సరళ)తో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ ఊరిలో పదేళ్లకు ఒకసారి జరిగే తిరునాళ్ల సమయంలో జన్మించిన వ్యక్తులను 'బాక్' అనే క్షుద్ర శక్తి చంపడానికి ప్రయత్నిస్తుందని అతడు తెలుసుకుంటాడు. తన మేనకోడలు పుట్టిన తేదీ అదే కావడంతో ఆమెను కాపాడుకోవాలని ప్రయత్రిస్తాడు. ఉత్తరాదిలో క్షుద్ర శక్తి దక్షిణాదిలో గ్రామానికి ఎందుకు వచ్చింది? 'బాక్' నుంచి ప్రజలను కాపాడాలని వచ్చిన స్వామి జీ (కెజియఫ్ రామచంద్ర రాజు) ఏం చేశారు? ఆత్మగా మారిన శ్రీనిధి తన కూతురు, కొడుకును కాపాడుకోవడం కోసం ఏం చేసింది? మేనకోడల్ని కాపాడుకోవడానికి శివ శంకర్ ఏం చేశాడు? చివరకు ఆ 'బాక్' ఏమైంది? ఊరిలో అమ్మవారు ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: నా బిడ్డను బతికించాలని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నా: ముక్కు అవినాశ్