Brahmamudi Serial Today May 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన యామిని – రాజ్ ను కావ్య ఇంటికి తీసుకెళ్లిన యామిని
Brahmamudi Today Episode: దుగ్గిరాల ఫ్యామిలికీ యామిని షాక్ ఇస్తుంది. రాజ్ తో సహా కావ్య ఇంటికి వెళ్లడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ తో తను మాట్లాడటం వల్లే ఇవాళ మళ్లీ ప్రమాదంలో పడ్డాడని అందుకే తాను మాట్లాడనని కావ్య చెప్తుంది. మీరు బలవంతం చేయడం వల్లే ఇదంతా జరిగింది అంటూ బాధపడుతుంది కావ్య.
కళ్యాణ్: ఎన్నాళ్లనీ అలా మాట్లడకుండా ఉంటావు వదిన.
కావ్య: ఆయనకు గతం గుర్తుకు వచ్చే వరకు ఉంటాను
అప్పు: అయితే ఈ లోపు ఆ యామిని ఊరుకుంటుందా..? పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. పెళ్లి కూడా చేసుకుంటే ఏంటి పరిస్థితి అక్కా..?
కావ్య: అలాగని మళ్లీ ఆయన ప్రాణాలతో ఆడుకోమంటావా..?
అపర్ణ: ఒక్కసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని రోడ్డు మీదకు వెళ్లడమే మానేస్తామా..?
కావ్య: నిజం చెప్పి ఆయనను శాశ్వతంగా దూరం చేసుకోవడం కన్నా ఎక్కడో ఒకచోట ఆయన సంతోషంగా ఉండటం బెటర్
అప్పు: ప్రాణాలతో ఉంటాడేమో కానీ సంతోషంగా ఉండడు అక్క తను ప్రేమించింది నిన్ను.. నీతోనే తన సంతోషం వెతుక్కుంటున్నాడు
కావ్య: కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి మీరంతా వెళ్లండి ఇక్కడి నుంచి
అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో రాజ్ వస్తాడు. రాజ్‌ను చూసి కావ్య షాక్ అవుతుంది.
కావ్య: ఎందుకు వచ్చారు…?
రాజ్: ఎలా ఉన్నారు అని అడుగుతారు అనుకున్నాను.. మీరేంటి ఇలా అడుగుతున్నారు
కావ్య: ఎలా ఉన్నా చూసుకోవడానికి మీ వాళ్లు ఉన్నారు కదా
రాజ్: కానీ మీరెందుకు రాలేదు.. మీరేంటో నాకు అసలు అర్థం కావడం లేదు కళావతి గారు. ఒక్కక్షణం మీరు నా సొంతం అన్నట్టు మాట్లాడతారు. ఇంతలోనే పరాయిదానిలా మాట్లాడతారు. మరోక్కసారి శత్రువులా మారిపోతారు.. అసలు నేనేం తప్పు చేశాను. హాస్పిటల్ లో పడిపోతే నన్ను ఎందుకు చూడలేదు.. అసలు ఏమైంది ఎందుకు హాస్పిటల్‌కు రాలేకపోయారు..? యామిని ఏమైనా మీతో మాట్లాడిందా..? చెప్పండి..
కావ్య: అసలు ఏంటండి మీ ఉద్దేశ్యం ఏదో నాలుగు సార్లు నవ్వతూ మట్లాడేసరికి నేనేదో మీ సొంత భార్యను అన్నట్టు నిలదీస్తున్నారేంటి..? మీరు హాస్పిటల్ లో ఉంటే చూడ్డానికి నేను ఎందుకు రావాలి. మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేను లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడాలి. మీకు నాకు ఏం సంబంధం ఉందని మీకు నేను సమాధానం చెప్పాలి. ఏదో రోడ్డు మీద పడిపోతే హెల్ప్ చేశారని నాలుగు మాటలు మట్లాడేసరికి ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తారా..? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం ఇలా అర్థరాత్రి మగాళ్లు వచ్చి పోతున్నారు అంటే నా గురించి ఎమనుకుంటారు..?
రాజ్: అంటే నేను పరాయి వాణ్నా..
కావ్య: కాకా నా సొంత మనిషి అనుకుంటున్నారా..?
రాజ్: మరి ఇన్ని రోజులు నాతో ఎందుకు తిరిగారు..నేను ఫోన్ చేసి పిలవగానే ఎందుకు వచ్చారు. ఇంటికి క్యారేజ్ ఎందుకు పంపించారు. గుడికి వస్తున్నానంటే..గిఫ్టుగా షర్టు ఎందుకు పంపించారు. నాకు అబద్దం చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి
కావ్య: ఇక చాలు ఆపండి మా ఇంట్లో పనివాళ్ళతో కూడా నేను చనువుగానే ఉంటాను. వాళ్లంతా నా వాళ్లై పోతారా..? వెళ్లండి ఇక్కడి నుంచి
అని కావ్య కోపంగా చెప్పడంతో రాజ్ వెళ్లిపోతాడు. పైనుంచి అంతా గమనించిన రాహుల్, రుద్రాణి వెంటనే తాము యామినిని కలవాలనుకుంటారు. వెళ్లి యామనిని కలిసి ముగ్గురు కలిసి రాజ్, కావ్యను ఎప్పటికీ కలవకుండా చేయాలని ప్లాన్ చేస్తారు. మరుసటి రోజు యామిని.. రాజ్‌ను తీసుకుని దుగ్గిరాల ఇంటికి వస్తుంది. రాజ్, యామిని చూసిన వాళ్లందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















