Brahmamudi Serial Today May 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : పెళ్లి వాయిదా వేయమన్న రాజ్ - రాజ్‌ను కన్వీన్స్ చేసిన యామిని
Brahmamudi Today Episode: త్వరలో జరగబోయే తమ పెళ్లిని కొద్ది రోజులు పోస్ట్ ఫోన్ చేద్దామని రాజ్ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఐసీయూలో ఉన్న రాజ్.. యామినితో కావ్య గురించి అడగ్గానే.. యామిని ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. ఎవరో సంబంధం లేని వ్యక్తి కోసం ఎందుకు ఎదురుచూస్తావని చెప్తుంది. దీంతో రాజ్ కోపంగా కళావతి వచ్చిందా రాలేదా అని అడుగుతాడు.
యామిని: ఎందుకు వస్తుంది బావ.. తనకు నీ మీద ఉన్న ప్రేమ కానీ బాధ్యత కానీ ఉంటుందా..? అక్కడ నువ్వు కళ్లు తిరిగి పడిపోయేసరికి ఎవరితోనో హాస్పిటల్‌కు పంపించి అక్కడే ఉండిపోయింది.
రాజ్: ఏంటి కళావతి గారు హాస్పిటల్‌కు రాలేదా..?
ఐసీయూ బయటి నుంచి చూస్తున్న కావ్య ఏడుస్తుంది.
కళ్యాణ్: చూశావా వదిన యామిని నీ గురించి అంత చెడుగా చెప్పినా కూడా కళ్లు తెరవగానే అన్నయ్య నీ గురించి అడిగారు. నువ్వెందుకు ఇంకా కంగారు పడుతున్నావు
కావ్య: లేదు కవి గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను పాపిస్టి దాన్ని నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీల్లేదు. నేను మాట్లాడినా ఏం చేసినా ఆయన గతాన్ని గుర్తు చేసినట్టే అవుతుంది. నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీల్లేదు. అనుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు.
ఇంద్రాదేవి: ఏంటి కావ్య రాత్రికి అక్కడే ఉంటానందా..?
అపర్ణ: ఏం లేదు అత్తయ్యా కాసెపట్లో వచ్చేస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు
రుద్రాణి: ఎలా వస్తారు. గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే మళ్లీ కోమాలోకి వెళ్లాడు కదా రాజ్
రాహుల్: అసలు ఇప్పుడు నీ ప్లానేంటి మమ్మీ
రుద్రాణి: ఫ్రెండ్స్ పార్టీకి అని చెప్పి ఇంట్లో అందరికీ అబద్దం చెప్పి వెళ్లి ఆ రాజ్ తో డాన్స్ చేసింది కదా రామ్ అంటూ అది ఆడుతున్న నాటకాన్ని దానితోనే ఎలా ముగిస్తానో చూడు
ఇంతలో కావ్య వాళ్లు ఇంట్లోకి వస్తారు.
రుద్రాణి: ఆగు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావు..ఏం చేసి వచ్చావు..
ఇంద్రాదేవి: కోపంగా ఏంటా ఆడగడం పార్టీకి వెళ్తున్నాను అని నా మనవరాలు చెప్పింది కదా..?
రుద్రాణి: ఈ దుగ్గిరాల ఇంటి కోడలు అంటే ఒక పరువు ఉంది. ఒక మర్యాద ఉంది. నువ్వు అది ఇవాళ దిగజార్చావు
అపర్ణ: రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు..
రుద్రాణి: నా మీద అరవడం కాదు వదిన పార్టీకి అని చెప్పి రిసార్ట్స్ లో పరాయి మగాడితో గంతులేసి వచ్చింది. నేను చెప్తుంది నిజమో కాదో మీ ముద్దుల కోడలిని అడగండి.. ఏం ధాన్యలక్ష్మీ ఏదో రహస్యం మాట్లాడుతున్నట్టు మెల్లగా మాట్లాడుతున్నావు.. కావ్య చేసింది ఏమైనా చిన్న పనా అలా పరాయి మగాడితో తిరుగుతుంటే మన ఇంటి పరువు ఏమౌతుందో అడగండి.. చనిపోయిన మొగుడు ఎలాగూ తిరిగి రాడనుకుని ఇలా చెడు తిరుగుళ్లు తిరుగుతుంది. ఏం వదినా ఏం మాట్లాడవేంటి.. వెళ్లి కాస్త గడ్డి పెట్టు..
అపర్ణ: గడ్డి పెట్టాల్సింది నా కోడలికి కాదు.. నీకు.. ఇంతకంటే ఇక దిగజారవు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుతున్నావు..
రుద్రాణి: తప్పు చేసింది నీ కోడలైతే నన్ను తిడుతున్నావేంటి..?
రాహుల్: ఇంత పెద్ద న్యూస్ చెబితే ఆ కావ్యను తిడతారు అనుకుంటే మమ్మల్ని తిడుతున్నారేంటి..? ఇదెక్కడి ట్విస్ట్ (మనసులో అనుకుంటాడు)
అపర్ణ: నా కోడలి గురించి ఏమనుకుంటున్నావు.. ప్రాణం పోయినా తన మనసులో వేరొకరికి స్థానం ఇవ్వదు.. ప్రాణం ఉన్నంత వరకు నా కొడుకే ప్రాణంగా బతుకుతుంది
రుద్రాణి: పిచ్చి వదిన నిన్ను నీ అమాయకత్వాన్ని చూస్తుంటే.. జాలేస్తుంది. ఆ కావ్య నిన్ను మాత్రమే కాదు మన కుటుంబాన్ని మోసం చేస్తుంది. రామ్ అనే కుర్రాడితో తిరుగుతుంది. కావాలంటే తననే అడుగు
అపర్ణ: ఎవర్నీ అడగాల్సిన అవసరం నాకు లేదు. అన్ని నిజాలు నాకు తెలుసు.. రామ్ వేరు రాజ్ వేరు కాదు వాళ్లిద్దరూ ఒక్కటే అన్న విషయం కూడా నాకు తెలుసు.. నాకే కాదు ఈ ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి నిజం తెలుసు.. ఒక్క నీకు నీ కొడుకుకి తప్పా
రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు.
రాహుల్: ఇన్ని రోజు మేము వేసిన ప్లాన్‌లో వీళ్లందరూ పాత్రధారులు అనుకున్నాం.. కానీ వీళ్లు ఆడుతున్న నాటకంలో మేము జోకర్లం అయ్యామా..? (మనసులో అనుకుంటాడు.)
రుద్రాణి: అంటే రాజ్ బతికే ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసా..
ఇంద్రాదేవి: తెలుసు.. తను గతం మర్చిపోయాడన్న విషయం తెలుసు. (రుద్రాణి షాకింగ్ గా చూస్తుంది.) ఏంటి అలా చూస్తున్నావు.. గట్టిగా మాట్లాడితే ఆ రిసార్ట్ ప్లాన్ చేసింది మేమే.. కావ్యను ఒప్పించి అక్కడకు పంపించిందే మేము
సుభాష్: నిజం తెలిసిపోయింది కదా అని పిచ్చి పిచ్చిగా మట్లాడకు
అనగానే రుద్రాణి నిజం చెప్తుంది. రాజ్ మళ్లీ కోమాలోకి వెళ్లాడు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. కళ్యాణ్ అదేం లేదని అన్నయ్య బాగానే ఉన్నారని చెప్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడని అపర్ణ అడగ్గానే.. యామిని వాళ్లు ఇంటికి తీసుకెళ్లి ఉంటారని చెప్తాడు. మరోవైపు రాజ్.. కావ్య గురించి ఆలోచిస్తూ ఉండగా వైదేహి, యామిని వచ్చి పెళ్లి గురించి అడుగుతారు. రాజ్ ఇప్పుడు వద్దని కొద్ది రోజులు పెళ్లి వాయిదా వేయమని అడుగుతాడు. యామిని సరే అంటుంది. తర్వాత రాజ్, కావ్యకు ఫోన్ చేసినా కావ్య లిప్ట్ చేయదు. అపర్ణ వచ్చి కాల్ లిప్ట్ చేయమని చెప్పినా కావ్య వినదు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















