Brahmamudi Serial Today March 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య కోసం రిస్క్ చేసిన రాజ్ – మనసులో ప్రేమను గుర్తుచేసిన శ్వేత
Brahmamudi Today Episode: నిప్పులో కాలేయబోయిన కావ్యను రాజ్ సేవ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: భాస్కర్ పీడ వదిలించుకునేందుకు రాజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ ఫ్లాప్ అవుతాయి. రాజ్ చాలా అసహనంగా ఉండగా శ్వేత ఫోన్ చేస్తుంది. అత్తారింటికి వెళ్లిన తర్వాత నన్ను మర్చిపోయావని రాజ్‌పై సెటైర్ వేస్తుంది. ఇది అత్తారిళ్లులా లేదు అండమాన్ జైలులా ఉందని, నవ్వుతూనే అందరూ నరకం చూపిస్తున్నారని రాజ్ కోపంగా బదులిస్తాడు. మరి అక్కడ ఉండటం ఎందుకు? నువ్వు చాలా మారిపోయావని అంటుంది. అదేం లేదని అంటాడు రాజ్.
శ్వేత: కావ్యకు ఆమె బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడోనని తెగ టెన్షన్ పడుతున్నావు. కావ్య తన బావతో పుట్టింటికి వెళుతుందని తెలిసి నువ్వు కూడా ఆమెతో పాటు అక్కడికి వెళ్లావు. ఈగో వల్ల ఒప్పుకోవడం లేదు కానీ నిజానికి నీ మనసులో కావ్య పట్ల చాలా ప్రేమ ఉందనిపిస్తుంది.
రాజ్: అలాంటిదేం లేదు, కావ్య నా లైఫ్‌లో నుంచి వెళ్లిపోవడం ఖాయం
శ్వేత: అసలు ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఎందుకొచ్చాడు. పని మీద వచ్చాడా? లేదంటే నువ్వు కావ్య విడిపోతున్నారని తెలిసి అమెరికా నుంచి ఇండియా వచ్చాడా? గతంలో కావ్యను భాస్కర్ ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కోల్పోయిన ప్రేమను తిరిగి దక్కించుకోవడానికే వచ్చాడా అన్నది నువ్వు తెలుసుకో. అంత మంచి అమ్మాయి ఒక్కసారి నీ జీవితంలోంచి వెళ్లిపోతే ఎప్పటికీ తిరిగి రాదు.
అంటూ శ్వేత చెప్పడంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు కావ్య, భాస్కర్, అప్పు, మూర్తి మాట్లాడుకుంటుంటారు. రాజ్ మనసులో ప్రేమ బయటకు వచ్చేందుకు ఇంకేం చేయాలని ప్లాన్ చేస్తారు. ఇక తనను తాను నిరూపించుకోవడానికి బయటకు వెళ్లిన కళ్యాణ్ ఇంటికి వచ్చి ప్రకాష్‌కు తన కవితలు ఎవ్వరూ పబ్లిష్ చేయడానికి ఒప్పుకోవడం లేదని చెప్తాడు. అప్పుడే అనామిక వస్తుంది.
అనామిక: నీ లైఫ్ అంతా వెయిట్ చేసినా ఆ టైం ఎప్పటికీ రాదు కళ్యాణ్.
ప్రకాష్: ఎంటమ్మా అలా అంటావు మావాడేదో సాధించాలనుకుంటున్నాడు కదా? భార్యగా నువ్వు సపోర్టు చేయాలి కానీ ఇలా హేళన చేయకూడదమ్మా..
అనామిక: ఆ విషయం నాకు తెలియదా? అంకుల్ కానీ మీ అబ్బాయి చేసే ప్రయత్నాలు చూస్తుంటే నమ్మకం ఎలా కలుగుతుంది చెప్పండి.
కళ్యాణ్: థాంక్స్ అనామిక నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు
అనగానే కళ్యాణ్. ఇప్పటికైనా కళ్లు తెరిచి...మీ అన్నయ్యలా ఆలోచించు. అతడిలా గొప్పగా బతకడంపై దృష్టిపెట్టమంటుంది అనామిక. నువ్వు అంటున్న గొప్పతనం డబ్బు, ఇలాంటి బంగళాలో బతకడం వల్ల రాదని కళ్యాణ్ చెప్పడంతో.. నెల రోజుల్లో నువ్వే నా దారికి వస్తావని కోపంగా అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను మళ్లీ ఏడిపించాలని కావ్య, భాస్కర్ ఫిక్సవుతారు. రాజ్ ముందు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఎంతైనా మన అల్లుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేదని కృష్ణమూర్తి అంటాడు.
రాజ్: మన అల్లుడు కాదు..మేనల్లుడు.. మేనల్లుడు (కోపంగా)
మూర్తి: అయ్యో ఏదో అలవావటులో పొరపాటుగా అనేశాను బాబు. ఏమీ అనుకోకండి.
అప్పు: బావ నీకు గుర్తుందా? వినాయక చవితి వచ్చిందంటే నువ్వు అక్క కలిసి డాన్స్ చేసే వాళ్లు మళ్లీ మీరు కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉంది.
భాస్కర్: నాకు చేయాలనే ఉంది కానీ అన్నయ్యా ఫీల్ అవుతాడేమో?
అప్పు: చీ బావది బ్రాడ్ మైండ్ అలా ఏమీ అనుకోడులే
అనగానే భాస్కర్, కావ్య కలిసి డాన్స్ చేస్తుంటారు. డాన్స్ చేస్తూ.. కావ్య నిప్పుపై అడుగేయబోతుంటే ఆమెకు ప్రమాదం జరుగకుండా రాజ్ అడ్డుకుంటాడు. దీంతో రాజ్ చేతి కాలిపోతుంది. అది చూసి కావ్య కంగారు పడుతుంది. రాజ్ లోపలికి వెళ్లిపోతాడు. రాజ్‌లో మార్పు వస్తుందని అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు క్రెడిట్ కార్డ్ బిల్ యాభై వేలు రావడం చూసి స్వప్న టెన్షన్ పడుతుంది. డబ్బుల కోసం రుద్రాణిని నిలదీస్తుంది స్వప్న. తన దగ్గర డబ్బులు లేవని రుద్రాణి చెప్తుంది. డబ్బులు ఎలా, ఎవరి నుంచి రాబట్టుకోవాలో నాకు తెలుసని స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భాస్కర్ కుంటుతూ రూంలోంచి బయటకు వస్తుంటే కనకం గట్టిగా అరుస్తుంది. మూర్తి ఏమైందని అడగ్గానే అల్లుడు నడవలేకపోతున్నాడని చెప్పడంతో రాజ్ కోపంగా చూస్తుంటాడు. కనకానికి ట్యూషన్ చెప్పినట్లు కలగంటాడు. తర్వాత భాస్కర్‌ను కావ్య నడిపించబోతుంటే రాజ్ వెళ్లి భాస్కర్‌ను నడిపించుకుని తీసుకుపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా చెప్పేశారోచ్