Brahmamudi Serial Today March 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కొత్త నాటకం మొదలు పెట్టిన యామిని – అప్పుకు తన ప్లాన్ చెప్పిన కావ్య
Brahmamudi Today Episode: రాజ్, కావ్యకు మెసేజెస్ చేయడం చూసిన యామిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే..రుద్రాణి, కావ్యను తిడుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది.
రుద్రాణి: అమ్మా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం.
స్వప్న: నిన్ను నీ కొడుకును నమ్మడం ఈ ఇల్లు ఎప్పుడో వదిలేసింది అత్తా. చెప్పాల్సింది చెప్పేశారు కదా..? మా కావ్యను తిడుతూనే తను చేసిన వంటను మెక్కేయండి. మళ్లీ ఉదయాన్నే లేచి ఎవరి మీదైనా అరవాలంటే శక్తి కావాలి కదా..?
రుద్రాణి: మాకేం అవసరం లేదు.
రాహుల్ : మమ్మీ ఆకలిగా ఉంది.
సుభాష్: చేసిన ఘనకార్యం చాలు కానీ ఇక తినండి
కావ్య: (మనసులో) హమ్మయ్యా మా ఆయన విషయం గుర్తుకు రాలేదు. కృష్ణయ్య మా ఆయన్ని దాచిపెట్టడానికి చిన్న అబద్దం ఆడాను. ఇంతకీ ఆయన నేను చేసిన చికెన్ తిన్నారో లేదో..
అని మనసులో అనుకుంటుంది. మరోవైపు యామిని వాళ్ల ఇంట్లో భోజనం చేస్తున్న రాజ్, కావ్య పంపించిన చికెన్ తిని అద్బుతంగా ఉందని మెచ్చుకుంటాడు. యామిని, రాజ్‌ను తిడుతుంది.
యామిని: ఇందాకటి నుంచి చూస్తున్నాను. అద్బుతం అంటున్నావు.. ఈ మాత్రం వంట నేను చేయలేనా..?
వైదేహి: అది కాదు బేబీ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే..
యామిని: షటప్ మామ్ ఇంత ఆయిల్ వేసి.. ఇంతంత ఉప్పు, కారం వేసి నేను చేయలేనా..? ఇలా తింటే బావ హెల్త్ ఏమవుంది. డాక్టర్ ఏం చెప్పారు..? డాక్టర్ చెప్పినందుకే కదా నేను లైట్ ఫుడ్ వండుతున్నాను. రామ్ ఇంకొకసారి ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినకు.. రేపటి నుంచి స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వు
రాజ్: ఓకే యామిని రేపటి నుంచి ఫాలో అవుతాను. ఇవాళ్టీకి ఇది తినేస్తాను. అంకుల్ ఏంటి చూస్తున్నారు. మీ కూతురు చెప్పింది రేపటి నుంచి ఇవాళ్టీకి ఇది తినండి.
అంటూ రాజ్ భోజనం చేసి రూంలోకి వెళ్లి చాలా రోజుల తర్వాత కడుపు నిండా రుచికరమైన ఫుడ్ తిన్నాను అనుకుని కావ్యకు థాంక్స్ చెప్పాలనుకుంటాడు. మరోవైపు రాజ్ చికెన్ తిన్నాడా..? లేదా..? తింటే నా వంట నచ్చలేదా ఇంకా ఫోన్ చేయలేదు అనుకుంటూ రాజ్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంది కావ్య. మరోవైపు డస్ట్ బిన్‌లో పడిపోయిన కావ్య నెంబర్ తీసుకుని కాల్ చేయబోయి.. ఇంత రాత్రి పూట కాల్ వద్దులే అనుకుని రాజ్, కావ్యకు మెసేజ్ చేస్తాడు. రాజ్ మెసేజ్ చూడగానే.. కావ్య హ్యాపీగా గట్టిగా అరుస్తుంది.
రుద్రాణి: ఏమైంది దీనికి సాయంత్రం చచ్చినోడికి వంట పంపిచాను అని చెప్పింది. ఇప్పుడేమో మెసేజ్ చేశాడని అరుస్తుంది. కొంపదీసి చచ్చిన రాజ్ దెయ్యం అయి వచ్చి దీనిలో దూరలేదు కదా..? అబ్బో నేను ఇంకా ఇక్కడే ఉంటే నన్ను ఆవహించవచ్చు.
అని భయపడుతూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్యకు మెసేజ్ చేస్తున్న రాజ్‌ను చూసి యామిని కోపంగా ఫీలవుతుంది.
యామిని: నేను ఇంత కష్టపడితే.. అది ఒక్క పూట భోజనం పెట్టగానే.. ఇంతలా మెసెజెస్ చేయాలా..? కావ్య చాలా డేంజర్.. దానికే కాదు.. రామ్‌కు కూడా టైం ఇవ్వకూడదు. రామ్ ఇప్పటి వరకు బతిమిలాడిన యామినిని మాత్రమే చూశావు.. రేపటి నుంచి అసలైన యామినిని చూస్తావు.
అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది యామిని. మరోవైపు కావ్య రూంలోకి అప్పు వస్తుంది.
అప్పు: ఏంటక్కా ఫోన్ చూస్తూ మురిసిపోతున్నావు.. అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా..?
కావ్య: ఇప్పుడు ఏమైంది అప్పు.. ఎందుకలా కోపంగా ఉన్నావు
అప్పు: నువ్వు ఉన్నట్టుంది అన్నదానం చేయడం ఏంటి..? ఆ రుద్రాణి నువ్వు బావకు పంపించావు అనడం ఏంటి..?
కావ్య: అవును అప్పు మీబావ గారికే పంపించాను. నువ్వుఅడ్రస్ తీసుకొచ్చి ఇచ్చావు. నేను ఆ అడ్రస్‌కు వెళితే అక్కడ ఆయన కనిపించారు. ఆయనకు గతం గుర్తు లేదు. నన్ను కూడా గుర్తు పట్టలేదు.
అప్పు: ఇంత జరుగుతున్నా..? నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు అక్కా…?
కావ్య: ఊరుకోక.. ఎవరిని నిలదీయాలి
అప్పు: మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు
అని అప్పు అడగ్గానే.. కావ్య తన ప్లాన్ చెప్తుంది. మరోవైపు రాజ్‌ను పెళ్లి చేసుకునేందుకు యామిని తన ప్యామిలీతో కలిసి కొత్త డ్రామాకు తెర తీస్తుంది. అందులో భాగంగా వాళ్ల డాడీ తనకు స్ట్రోక్ వచ్చినట్టు నాటకం ఆడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

