Brahmamudi Serial Today March 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : విడాకుల పేపర్స్ చించేసిన రాజ్ - కేక్ కిందపడేసిన కళ్యాణ్
Brahmamudi Today Episode: రాజ్ డివోర్స్ పేపర్స్ చించేయడం.. కళ్యాణ్ కేక్ కింద పడేయడం.. అపర్ణ, అనామికకు వార్నింగ్ ఇవ్వడం లాంటి ట్వీస్టుల మీద ట్విస్టులతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య రూంలో రెడీ కాకుండా కూర్చోవడంతో ఇందిరాదేవి పైకి వెళ్లి కావ్యకు సర్ది చెప్తుంది. రెడీ కావాలని జరగబోయేది జరగకమానదు. నువ్వు ఇలా టెన్షన్ పడటం మంచిది కాదు అంటూ చెప్పి కిందకు వస్తుంది ఇందిరాదేవి. మరోవైపు కింద ఫంక్షన్ కు అంతా రెడీగా ఉంటుంది. ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామిక, రాహుల్ ఒకేచోట కూర్చుని ఉంటారు. ఇంతలో ప్రకాష్ వచ్చి మీరేంటి అందరూ ఒకే దగ్గర కూర్చున్నారు దుష్టచతుష్టయంలాగా అంటాడు. దీంతో అనామికి దుష్టచతుష్టయం అంటే అర్థం చెప్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి ప్రకాష్‌ను వంటవాళ్లకు చెప్పావా అని అడుగుతుంది. మర్చిపోయానని ప్రకాష్ చెప్పడంతో అలా అయితే ఎలా అంటూ అపర్ణ చెప్పడంతో ధాన్యలక్ష్మీ, అనామిక ఫీల్ అవుతారు. దీంతో ఇందిరాదేవి ఇప్పుడు అపర్ణ ఏమన్నది మీరెందుకు ఫీల్ అవుతున్నారు దుష్టచతుష్టయం లాగా ఒక దగ్గర చేరి అన్ని అంటూ తిడుతూ పక్కకు వెళ్లిపోతుంది. ఇంతలో కళ్యాణ్ కేక్ రెడీ పెద్దమ్మా అంటూ వచ్చి ఒక దగ్గర పెట్టబోతే కేక్ కింద పడిపోతుంది. దీంతో అపర్ణ చూసుకోవచ్చు కదా నాన్న అనడంతో
ధాన్యలక్ష్మీ: ఏదో పొరపాటున పడిపోతే నా కొడుకును అంతలా మందలించాలా?
ఇందిరాదేవి: ఇప్పుడు అంతలా ఏం మందలించింది ధాన్యలక్ష్మీ..
ధాన్యలక్ష్మీ: మీరు పక్షపాతం చూపించకండి అత్తయ్యా.. చూస్తుంటే ఈవిడ రాజమాత అయిపోయి అందర్ని చెలికత్తెల్లాగా సేవకుల్లాగా మార్చాలనుకుంటుందా?
అనామిక: అంతే కద అత్తయ్యా పెద్దత్తయ్య కళ్లకు మనమందరం బానిసల్లా కనిపిస్తున్నాము.
అంటూ అత్తా కొడళ్లు అపర్ణ మీద విరుచుకుపడుతుంటే అపర్ణ కోపంగా ఇద్దరిని తిడుతుంది. నేను యుద్దభేరి మోగించానంటే కురుక్షేత్రం మొదలవుతుంది. అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో కళ్యాణ్, ప్రకాష్ కూడా ధాన్యలక్ష్మీ, అనామికలను తిడతారు. మరో కేకు తీసుకొద్దామని వెళ్తారు. ఇంతలో కనకం, మూర్తి, అప్పు వస్తారు. వాళ్లను చూసిన రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మీ, రాహుల్ వెళ్లి అవమానిస్తారు. ఇంకోసారి మా ఇంటికి రావొద్దని చెప్పినా సిగ్గులేకుండా వచ్చారని మాట్లాడటంతో అప్పు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్తాడు. అందరూ మాట్లాడుకుంటుండగా కావ్య రెడీ అయ్యి వస్తుంది.
కనకం: కుదనప్పు బొమ్మలా ఉంది మా అమ్మయి..
ఇందిరాదేవి: కాదు దుగ్గిరాల ఇంటి కోడలు..
ప్రకాష్: పేకూ వచ్చింది మరి పేకో ఏడీ.
కళ్యాణ్: నాన్న ఏంటి నీ బాష.. అదిగో పేకో.. చీచీ అన్నయ్య వచ్చేశాడు.
ఇందరాదేవి: అనవసరంగా భయపడ్డావు.. మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడానికే వచ్చాడని తెలియడం లేదు..
కావ్య: అదే నిజమైతే అంతకన్నా నాకు అదృష్టం ఇంకేం కావాలి అమ్మమ్మ..
అంటుంది కావ్య ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి డైవర్స్ పేపర్స్ తీస్తాడు. అపర్ణ ఆ పేపర్స్ ఎంటని అడగ్గానే డీవొర్స్ పేపర్స్ అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఈ మాట చెప్పగానే మీరందరూ షాక్ అవుతారని నాకు తెలుసు కానీ మేము పెళ్లి అయిన దగ్గర నుంచి అందరికీ భార్యాభర్తల్లా కనిపించామే కానీ మేమే ఏనాడు రూంలో మొగుడుపెళ్లాలలాగా లేమని.. కళావతిని చాలా బాధపెట్టాను. కానీ సంవత్సరం నుంచి కళావతి నేను మారుతానని ఏదురుచూసింది కానీ నేను మారలేదని విడాకుల కాగితం మీద సంతకం చేసి ఇచ్చింది. కానీ ఈ విడాకుల పేపర్స్ మీద నేను సంతకం చేయను అంటూ రాజ్ భావోద్వేగంతో డైవర్స్ పేపర్స్ చించివేస్తాడు. దీంతో కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్, కావ్యకు రింగ్ తొడిగి హగ్ చేసుకుంటాడు. అందరూ క్లాప్స్ కొడుతుంటారు. కట్ చేస్తే రూంలో కావ్య ఇదంతా కలగంటుంది. ఎగిరిగంతేస్తుంది. దీంతో ఇందిరాదేవి మొట్టికాయ వేయడంతో అయ్యో ఇదంతా కలా అంటూ బాధపడుతుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సుహాస్ సరసన కీర్తి సురేష్ - సినిమా టైటిల్ ఏంటంటే?