అన్వేషించండి

Keerthy Suresh & Suhas: సుహాస్ సరసన కీర్తి సురేష్ - సినిమా టైటిల్ ఏంటంటే?

Keerthy Suresh & Suhas: మహానటి కీర్తి సురేష్, కమెడియన్ కమ్ హీరో సుహాస్ ప్రధానపాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ప్రైమ్ ఈవెంట్ లో ఈ మూవీ టైటిల్ లాంచ్ చేసారు.

Keerthy Suresh & Suhas: దక్షిణాది అగ్ర కథానాయికల్లో అందాల భామ కీర్తి సురేష్ ఒకరు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు అగ్ర హీరోలతో కలిసి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతోంది. 'మహానటి' మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించి, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కీర్తి.. ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సుహాస్ సరసన నటించడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

షార్ట్ ఫిలింస్ తో గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన నటుడు సుహాస్. 'కలర్ ఫోటో' చిత్రంతో హీరో అవతారమెత్తి, తొలి చిత్రంతోనే హిట్టు కొట్టాడు.. విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా జాతీయ అవార్డు సాధించిన తర్వాత కథానాయకుడిగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. గతేడాది 'రైటర్ పద్మభూషణ్', ఈ ఏడాదిలో 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు' చిత్రాలతో మాంచి సక్సెస్ సాధించాడు. బిజీ షెడ్యూల్స్ తో సంవత్సరం పొడవునా బిజీగా గడుపుతున్న సుహాస్.. ఇప్పుడు కీర్తి సురేశ్ తో జత కట్టబోతున్నారు.

కీర్తి సురేష్ - సుహాస్ ప్రధాన పాత్రల్లో 'ఉప్పు కప్పురంబు' అనే సినిమా రూపొందుతోంది. అని ఐవి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమా కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటిటి కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించి, టైటిల్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి కీర్తి రాలేదు కానీ, వేదిక మీద సుహాస్ సందడి చేశారు.

'ఉప్పు కప్పురంబు' అనేది సెటైరికల్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోన్న సినిమా. ఒక గ్రామంలోని స్మశానవాటికలో ఖాళీ స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఎలాంటి పరిష్కార మార్గాలను కనుగొన్నారనేది ఈ మూవీ స్టోరీ లైన్ గా ప్రచారం చేయబడుతోంది. ఇందులో కీర్తి సురేష్ ది పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, సుహాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.

ఏదేమైనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్, విక్రమ్, నాని, రామ్, నితిన్, శివ కార్తికేయన్ లాంటి హీరోలతో ఆడిపాడిన కీర్తి సురేష్.. ఇప్పుడు సుహాస్ తో 'ఉప్పు కప్పురంబు' సినిమా చేయడం విశేషమనే చెప్పాలి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే, ఇది కచ్చితంగా సుహాస్ ఇమేజ్ ని పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారా? లేదా ఇద్దరూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నరా? అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం 'రివాల్వర్‌ రీటా', 'రఘుతాత', 'కన్నివేడి' వంటి చిత్రాల్లో నటిస్తోంది. 'తేరి' రీమేక్ గా రూపొందుతున్న 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. మరోవైపు సూహాస్ 'ప్రసన్న వదనం', 'గొర్రె పురాణం', 'శ్రీరంగనీతులు', 'ఆనందరావు అడ్వెంచర్స్' సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అలానే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు.

Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'గేమ్ ఛేంజర్' వరకు.. క్రేజీ చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే!

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget