Brahmamudi Serial Today March 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను తీసుకొస్తానన్న కావ్య – కుట్రలు మొదలు పెట్టిన రుద్రాణి
Brahmamudi Today Episode: కావ్యను పిచ్చిదాన్ని చేయాలనుకున్న రుద్రాణి అదే విషయం ఇంట్లో వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటారు. కావ్యకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది స్వప్న. కానీ కావ్య కాఫీ తీసుకోదు. దీంతో స్వప్న బాధగా నువ్వైనా చెప్పు ఆంటీ కావ్య వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు.. తాగలేదు అని అడుగుతుంది. అపర్ణ ఏడుస్తుంది.
అపర్ణ: నా కొడుకు కళ్ల ముందు లేకపోతే ఇక ఆకలికి దాహానికి చోటెక్కడిది ఇప్పుడు మాకేమీ వద్దు.
కానిస్టేబుల్ : మేడం రిపోర్ట్స్ వచ్చాయి..
అప్పు: సరే నువ్వు వెళ్లు..
సుభాష్: ఏంటమ్మా అవి
అప్పు: రాత్రి అక్క చెప్పినదాన్ని బట్టి నాకు కొంచెం అనుమానం వచ్చి బావ గారి బట్టల మీద ఉన్న బ్లడ్ ను ఫోరెన్సిక్ డిఫార్ట్‌మెంట్‌కు పంపించాను
రుద్రాణి: పోలీస్ అయ్యాక నీకు అనుమానాలు బాగా ఎక్కువై పోయాయి.
స్వప్న: మీరు నోరు మూసుకుంటారా..? ముందు అందులో ఏముందో చెప్పవే
ప్రకాష్: ఏంటమ్మా ఏమని వచ్చింది రిపోర్ట్స్ లో
రుద్రాణి: ఏమొస్తుంది. దాని కళ్లు చూస్తే అర్థం అవుతలేదా..? ఆ రిపోర్ట్స్ లో ఏముందో
ఇందిరాదేవి: నువ్వు నోరు మూస్తావా..? రుద్రాణి.. నువ్వు చెప్పు అప్పు అందులో ఏముందో
అప్పు: ఆ షర్ట్ మీద ఉన్న బ్లడ్ బావదే
అందరూ మరింత ఎమోషనల్‌గా ఫీలవుతారు. అపర్ణ ఇంకా గట్టిగా ఏడుస్తుంది.
కావ్య: ఆయన బతికే ఉన్నారు. అది నా మనసకు తెలుసు. మీరు ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఆయినా ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరే నీకు
అప్పు: ఇలాంటి విషయాల్లో నిర్దారణ చేసుకోవాలంటే.. ఇలా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెల్ప్ తీసుకోక తప్పదు అక్కా
కావ్య: ఏమీ అవసరం లేదు. ఆయన బతికే ఉన్నారు
రుద్రాణి: నువ్వన్నటే రాజ్ బతికే ఉన్నాడనుకుందాం. మరి ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు. సరే యాక్సిడెంట్ అయ్యాక నువ్వు కారులో ఉన్నావు.. మరి రాజ్ ఎక్కడ.. రాజ్‌ను చూపించలేవు కానీ బతికే ఉన్నాడని అంటున్నావు.. నీ గాలి మాటలు నమ్మాలా..? లేక ఈ రిపోర్ట్స్ నమ్మాలా..?
కావ్య: ఆయన బతికే ఉన్నాడు.. మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఈ కథ ఎక్కడ ఆగిపోయిందో అక్కడికే వెళ్లి మొదలు పెడతాను. ఆయన ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను.
అంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్, యామినికి సారీ చెప్తాడు.
యామిని: సారీ దేనికి బావ
రాజ్: నేను తెలియకుండా నిన్ను చాలా బాధపెడుతున్నాను. నిజానికి నేను కావాలని ఏమీ చేయడం లేదు. నా గతంలోకి తొంగి చూద్దామంటే అంతా చీకటే కనిపిస్తుంది. ఆ గతంలో నువ్వు ఉన్నావని పెళ్లి దాకా వెళ్లామంటే ఏమీ తెలియడం లేదు. నా మనసులో అంతా గందరగోళంగా ఉంది. ఈ కొత్త జీవితం అస్తవ్యస్తంగా ఉంది. నాది కానీ ఇంట్లో ఉన్నానని నా మనసు చెప్తుంది.
యామిని: నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను బావ కానీ నేను అబద్దం చెప్పడం లేదు బావ. ఒక అమ్మాయి జీవితం పంచుకోవడం దాకా వెళ్లిందంటే అందులో వేరే స్వార్థం ఏముంటుంది..?
రాజ్: అది కూడా నిజమే.. నువ్వు నీ లాగే ఉన్నావు.. నేనే నా లాగా లేను.. నేను ఇప్పుడే పుట్టినట్టు ఉంది. నీతో పెళ్లి దాకా వెళ్లినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆ సాక్ష్యాల్లో నేను ఉన్నట్టు నాకే తెలియడం లేదు. అందుకే అలవాటు పడటానికి సమయం పడుతుంది. అంతవరకు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను.
యామిని: వద్దు బావ నాకోసం బలవంతంగా మారాలనుకోవద్దు.. నువ్వు నీలాగే ఉండు.. నేనే నిన్ను ఎందులోనూ ఫోర్స్ చేయను.
అంటూ వెళ్లిపోతుంటే రాజ్ చేయి పట్టుకుని ఆపేస్తాడు. మనిద్దరం కలిసి అలా బయటకు వెళ్దామా..? అని అడుగుతాడు. యామిని సరే అంటుంది. ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటే మరోవైపు నుంచి కారులోనే వెళ్తున్న కావ్య రాజ్‌ను చూస్తుంది. కారు దిగి రాజ్ కారు వెనకాల పరెగెడుతుంది. కొంత దూరం వెళ్లాక కావ్య నడవలేకపోతుంది. కారు ఆపిన రాజ్ దిగిడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















