Brahmamudi Serial Today May June 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం గదిలో అలిగిన అప్పు – నగలు లవర్‌కు ఇచ్చిన రాహుల్
Brahmamudi Today Episode: ఇంట్లో ఎత్తుకెళ్లిన నగలు తీసుకెళ్లి రాహుల్ తన లవర్ కు ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: శోభనం గదిలోకి వచ్చిన అప్పును కళ్యాణ్ తిడతాడు. ఇక్కడ కూడా ఆ ఫోనేంటని ప్రశ్నిస్తాడు. దీంతో అప్పు అలుగుతుంది. అప్పును ఎలాగైనా కూల్ చేయాలని కళ్యాణ్ పాట పాడతాడు. దీంతో అప్పు కూల్ అవుతుంది. ఇంట్లో కొట్టేసిన నగలు తీసుకెళ్లి తన లవర్‌కు ఇస్తాడు రాహుల్.
రాహుల్: ఈ నగలు ఆ స్వప్న కన్నా నీకే అందంగా ఉన్నాయి బేబీ
లవర్: నిజమా..?
రాహుల్: నిజం నువ్వు వేసుకోగానే ఈ నగలకే అందం వచ్చింది.
లవర్: థాంక్యూ బేబీ
రాహుల్: ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా..?
లవర్: ఎందుకు..?
రాహుల్: నువ్వు అడిగినట్టు నీకు ఈరోజు నగలు తీసుకొచ్చాను. అక్కడ మా మమ్మీ కోరుకున్నట్టు కావ్య రాజ్ ఇద్దరూ కలవకుండా విడిపోయారు
లవర్: దానివల్ల మీకు వచ్చే లాభం ఏముంది
రాహుల్: ఏముంది అని చిన్నగా అడుగుతావేంటి బేబీ.. ఇప్పుడు కనక ఆ రాజ్ యామినిని పెళ్లి చేసుకున్నాడంటే.. దానివల్ల మా ఫ్యామిలీకి ఫర్మినెంట్‌గా దూరం అయిపోయినట్టే..
లవర్: దూరం అయితే
రాహుల్: రాజ్యానికి రాజు లేకపోతే సింహాసనం ఖాళీగా ఉంటుంది. కదా..? సింహాసనం ఖాళీగా ఉంటే నాలాంటి సైన్యాధిపతి రాజ్యాన్నే సొంతం చేసుకుని సింహాసనం మీద ఎక్కి కూర్చుంటాడు కదా
లవర్: నువ్వేమో సింహాసనం ఎక్కి రాజువై పోతావు. నిన్ను నమ్ముకున్నందుకు నాకేమో ముష్టి ఈ నగలేనా..?
రాహుల్: ఆస్థి రాగానే.. నా భార్యకు విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను.
లవరు: నిన్ను నేను నమ్మను కానీ నాకు ఇప్పుడు విల్లా కావాలి కొనివ్వు
అని అడగ్గానే.. రాహుల్ షాక్ అవుతాడు. అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరూ కలిసి కావ్యను పిలిచి యామిని ఏదో డ్రామాలు ఆడుతుందని రాజ్‌ను ఈరోజు రిసార్ట్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అయిందని చెప్తారు.
కావ్య: అది ప్లాన్ చేస్తే మాత్రం ఆయన వెళ్లాలి కద అమ్మమ్మ. దానితో పెళ్లి పనులకే తిరగని ఆయన ఇంక రిసార్ట్‌కు ఏం వెళ్తారు. కచ్చితంగా వెళ్లరు
అపర్ణ: లేదు కావ్య రాజ్ వెళ్తున్నాడట
కావ్య: ఏంటి అత్తయ్య మీరు చెప్పేది
అపర్ణ: అవునమ్మా.. ఆ యామిని ఆడింది డ్రామా అని తెలియక.. నా కొడుకు దానికి మాట ఇచ్చాడంట
ఇందిరాదేవి: వీడో పెద్ద హరిశ్చంద్రుడిలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి దానితో పాటు వెళ్తున్నాడట. పొరపాటున వాడు కానీ ఏదైనా తప్పు చేశాడంటే ఇక నీ జీవితం నాశనం అయిపోతుంది కావ్య
అని ఇందిరాదేవి భయపడుతూ ఇక నువ్వు కూడా రంగంలోకి దిగాలి కావ్య అంటూ కావ్యను కూడా రిసార్ట్‌కు వెళ్లేలా ఒప్పిస్తారు. మరోవైపు యామని బట్టలు సర్దుతుంటే వైదేహి వస్తుంది.
యామిని: ఎందుకు మమ్మీ అలా ఉన్నావు..
వైదేహి: నాకు ఎందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుంది బేబీ
యామిని: ఏంటి తప్పు నేనేం పరాయి మగాడితో వెల్లడం లేదు కదా..? నా మెడలో తాళి కట్టబోయేవాడితోనే కదా వెల్తుంది
వైదేహి: కరెక్టే అనుకో కానీ పెళ్లికి ముందే ఇలా తొందరపడితే నలుగురు ఏమనుకుంటారు..?
యామిని: మమ్మీ నాకు నలుగురి కన్నా నాకు నా లైఫే ముఖ్యం. నాకు రాజ్ అంటే ప్రాణం. తనను సొంతం చేసుకోవడానికి నేనేమైనా చేస్తాను. నా రాజ్ నా సొంతం అవడానికి ఇంతకంటే మంచి ఐడియా ఉంటే చెప్పు ఈ ట్రిప్ ను ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను.. ఇంతకీ రాజ్ ఎక్కడ..?
అంటూ ఇద్దరూ మాట్లాడుతకుంటారు. రాజ్ బయట కారు దగ్గర ఉంటాడు. ఇందిరాదేవి రాజ్‌కు ఫోన్ చేసి కావ్యను కూడా రిసార్ట్ కు వచ్చేందుకు ఒప్పించానని చెప్తుంది. దీంతో రాజ్ హ్యపీగా ఫీలవుతాడు. ఇంతలో యామిని రాగానే ఇద్దరూ కలిసి రిసార్ట్ కు బయలుదేరుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















