Brahmamudi Serial Today June 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : హోటల్ రూంలో మీడియాకు దొరికిన అప్పు, కళ్యాణ్ – కుప్పకూలిపోయిన మూర్తి
Brahmamudi Today Episode: హోటల్ రూంలో మీడియా రెడ్ హ్యాండెడ్ గా అప్పు, కళ్యాణ్ దొరకడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అపర్ణను రాజ్ ఓదారుస్తుంటాడు. నేను నిన్ను ఎన్నో రకాలుగా తిట్టాను. అందులో సగం నీ భార్యను కూడా తిట్టాను అయినా మీరు ఎక్కడా తొణకలేదు. నా కోసం మీరు ఎంత ఓపికగా ఉన్నారు. ఇక నా జీవితంలో భర్త అనే అధ్యాయం ముగిసిపోయినట్లే అంటుంది అపర్ణ దీంతో రాజ్ షాక్ అవుతాడు. మరోవైపు కళ్యాణ్, అప్పు ఒక కారును, కావ్య ఇంకో కారును ఫాలో అవుతుంటారు. ఇంతలో కావ్యకు ఒక వీడియో మెసేజ్ వస్తుంది. మాయ పంపిస్తుంది. అందులో మాయ మాట్లాడుతుంది. తనకు ఆ బిడ్డకు ఏ సంబంధం లేదని.. ఆ బిడ్డను అనాథ ఆశ్రమం నుంచి తీసుకొచ్చానని నా వెనక ఉన్నవాళ్లు నాతో ఈ నాటకం ఆడించారని మీ మామయ్యకు ఏం తెలియదని డబ్బుల కోసం ఇదంతా చేయించారని నన్ను వాళ్లు ఎప్పుడైనా చంపొచ్చని అందుకే ఈ వీడియో చేశానని మాయ చెప్తుంది. వీడియో చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇంతలో కిడ్నాపర్ల కారును ఓవర్‌టేక్ చేసి కావ్య వెళ్లి మాయను వెతుకుతుంది. ఆ కారులో మాయ ఉండదు. కిడ్నాపర్ కావ్యను గన్‌తో బెదిరించి కావ్య ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు. డ్రైవర్ యాదగిరి ఫోన్ తీసుకుని కళ్యాణ్‌కు ఫోన్ చేసి జరిగింది చెప్తుంది కావ్య. మరోవైపు రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది.
రాహుల్: మామ్ నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశాను. మీడియా వాళ్లకు కూడా చెప్పేశాను.
రుద్రాణి: అయితే ఇక్కడ చేయాల్సిన పనులు కూడా పూర్తి చేద్దాం పదా..
అని ఇద్దరూ కలిసి అనామిక రూంలోకి వెళ్తారు.
రుద్రాణి: నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను.
అనామిక: ఎందుకు ఆంటీ?
రుద్రాణి: చాలా రోజుల నుంచి కళ్యాణ్ ను అప్పును విడగొట్టే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు అన్నావు కదా
రాహుల్: ప్లాన్ చేసే అవసరం లేకుండా నీ మొగుడు నీకు ఆ అవకాశం ఇచ్చేశాడు.
అనామిక: ఏమంటున్నారు మీరు నాకేం అర్థం కావడం లేదు.
రుద్రాణి: కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? అప్పుతో కలిసి హోటల్ హాయ్‌లో ఫోర్ జీరో టూ రూంలో ఉన్నాడు. ఇప్పుడు కనక నువ్వు మీ అత్తని తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించావంటే వాళ్లిద్దరూ పర్మినెంట్‌గా విడిపోతారు.
అని చెప్పగానే కోపంగా అనామిక కళ్యాణ్‌ను తిడుతుంది. వెంటనే హోటల్‌కు వెళ్లిపోతుంది. రాహుల్, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు. ఈ దెబ్బతో కళ్యాణ్, అనామిక విడిపోతారు. ఈ గొడవలకు మా వదిన గుండె ఆగిపోతుంది అంటుంది రుద్రాణి. మరోవైపు కళ్యాణ్, అప్పు కిడ్నాపర్ల కారు హోటల్ ముందు ఆగడం చూసి లోపలికి వెళ్తారు. రిసెప్షన్‌లో కనుక్కుని ఫోర్ జీరో టూ రూంలోకి వెళ్తారు అప్పు, కళ్యాణ్. బయటి నుంచి కిడ్నాపర్ వచ్చి డోర్ లాక్ చేసి వెళ్తాడు. ఇంతలో మీడియా వాళ్లు వస్తారు. వాళ్ల వెనకాలే కావ్య వస్తుంది. మీడియావాళ్లను చూసిన కిడ్నాపర్ డోర్ ఓపెన్ చేసి వెళ్తాడు.
మీడియా: మీరు దుగ్గిరాల కళ్యాణ్ కదా ఈ టైంలో ఈ హోటల్ రూంలో ఈ అమ్మాయితో ఏం చేస్తున్నారు. ఈ అమ్మాయితో ఎన్ని రోజులుగా ఈ సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారు.
అప్పు: మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
మీడియా: మాకు చెప్పకపోయినా జనాలకు సమాధానం చెప్పాలి మేడం.
అని మీడియా వాళ్లు అడగ్గానే ఇప్పుడు మాయ విషయం చెబితే అన్ని నా వల్లే బయటకు వస్తాయని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య వెళ్లి మీడియా వాళ్లను తిడుతుంది. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చారని చెప్తుంది. అప్పు, కళ్యాణ్ లను అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంటే ఇంతలో అనామిక, ధాన్యలక్ష్మీ అక్కడకు వస్తారు. ఇంతలో న్యూస్ టీవీలో చూసిన మూర్తి బాధతో కుప్పకూలిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఏంటీ.. త్రిష ఏకంగా రాజమౌళి మూవీ ఆఫర్‌నే తిరస్కరించిందా? - అసలేం జరిగిందంటే..!