Brahmamudi Serial Today June 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన అపర్ణ – అపర్ణ దెబ్బకు కుప్పకూలిపోయిన రుద్రాణి
Brahmamudi Today Episode: హాస్పిటల్ నుంచి వచ్చిన అపర్ణ తన మాటలతో ఇంట్లో వాళ్లకు షాకుల మీద షాకులు ఇవ్వడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య తీసుకొచ్చిన సూప్ తాగనంటుంది అపర్ణ. దీంతో రాజ్ తాగొచ్చు కదా మమ్మీ అనగానే నీభార్య తీసుకొచ్చిన సూప్ తాగను అంటున్నాను కదా అనగానే అందరూ నన్నే అనండి అని కావ్య అనగానే... అపర్ణ ఇంకెవరు అన్నారు అని కోపంగా అడుగుతుంది. ఇంకెవరు మీ అబ్బాయే మీకు ఇలా కావడానికి కారణం నేనే అంటున్నారు అని కావ్య చెప్పగానే అపర్ణ రాజ్ ను తిడుతూ మీ నాన్న చేసిన మోసానికి నా గుండె చెరువయ్యింది అంటూ ఇంకో సారి కావ్యను తిట్టొద్దు అని చెప్తుంది. మళ్లీ కావ్య సూప్ తాగండి అత్తయ్యా అనగానే రాజ్ కావ్యను తిడతాడు. అపర్ణ రాజ్‌ను తిడుతుంది ఇప్పుడే కదా చెప్పాను కావ్యను ఏమీ అనోద్దని అనగానే కావ్య షాక్ అవుతుంది. తర్వాత సూప్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య.
రాజ్: తీసుకో మమ్మీ..
అపర్ణ: ఇన్ని రోజులు నీ తండ్రి కోసం చేసిన త్యాగాలు చాలు. నా మనసు ముక్కలయిపోయినట్టు నీ భార్య మనసు ముక్కలు కాకుండా చూసుకో..
రాజ్: అంటే ఏం చేయాలి మమ్మీ..
అపర్ణ: నీ పెళ్లాన్ని పట్టించుకోరా దద్దమ్మా.. భర్త మనసులో తాను లేనని తెలిస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు.
రాజ్: కానీ డాడీ మనసులో నువ్వు ఉన్నావు మమ్మీ.
అపర్ణ: చంప పగిలిపోద్ది.. నేను నీ కాపురం గురించి చెప్తున్నాను.
అనగానే రాజ్ వెళ్లిపోతాడు. లోపల బెడ్ రూంలో కావ్య శారీ మార్చుకుంటుంది. ఇంతలో లోపలికి వచ్చిన రాజ్ కంగారుపడతాడు. దీంతో కావ్య రోమాంటిక్‌గా మాట్లాడుతుంది దీంతో రాజ్ ఇంకా ఎక్కువ కంగారుపడుతుంటాడు. కావ్య ప్లయింగ్ కిస్ ఇస్తుంది. రాజ్ తప్పించుకుని వెళ్లిపోతాడు. తర్వాత కావ్య, ఇందిరాదేవి కలిసి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో సుభాష్ రాగానే ఇందిరాదేవి తిడుతుంది. మామయ్యను తిట్టొద్దని కావ్య చెప్తుంది. అందరూ వచ్చి హాల్లో కూర్చుని ఉంటారు. అనామిక వాళ్ల అమ్మా నాన్న వస్తారు. తర్వాత కనకం, మూర్తి, అప్పు వస్తారు. అప్పును చూసిన అనామిక షాక్ అవుతుంది.
కనకం: మీకు ఇలా జరగడం ఏంటి?
మూర్తి: ఇప్పుడు ఎలా ఉందమ్మా?
అపర్ణ: పరవాలేదు కూర్చోండి.. రండి కూర్చోండి..
రుద్రాణి: మీవాళ్లు పోయిపోయి మా వదిన దగ్గరే కూర్చున్నారు. ఎందుకు బీపీ పెంచడానికా?
అపర్ణ: ఏయ్ ఇట్రా..
కావ్య: వస్తున్నాను అత్తయ్యా.. నేనే మిమ్మల్ని చూడ్డానికి రమ్మని చెప్పాను అత్తయ్యా..
అపర్ణ: నీకసలు బుద్దుందా? వాళ్లను ఎవరు పిలిచారని నేనడిగానా? నేనే పిలిచాను. ఇంట్లో పూజ ఉందని నువ్వెందుకు వీళ్లతో చెప్పలేదు. మీ పుట్టింటివాళ్లు వస్తే పలకరించడం కూడా తెలియదా?
కావ్య: తెలుసు..
అపర్ణ: ఏం తెలుసు అన్నీ నా పర్మిషన్ తీసుకునే చేస్తున్నావా? వెళ్లి వాళ్లకు కాఫీ తీసుకురా
అని చెప్పగానే కాఫీ తీసుకురావడానికి కావ్య వెళ్లిపోతుంది. రుద్రాణి కళ్లు తిరిగి పడిపోతుంటే రాజ్, రాహుల్ పట్టుకుంటారు. అపర్ణ ఇస్తున్న షాకులకు అందరూ ఫ్రీజ్ అయిపోయి చూస్తుంటారు. అపర్ణ, రాజ్‌ను పిలిచి మీ అత్తామామలను పలకరించు అని చెప్పగానే అందరూ ఇంకా షాక్ అవుతారు.
రాహుల్: మమ్మీ నాకు తల తిరిగినట్టుంది
రుద్రాణి: నాకు ఆలెరెడీ తిరిగిందిరా? మా వదినకు హాట్ స్ట్రోక్ వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నాకు హాట్ స్ట్రోక్ వచ్చేలా ఉందిరా?
రాహుల్: ఆలెరెడీ నాకు వచ్చేసినట్టే ఉంది మమ్మీ
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో పంతులు పూజకు అంతారెడీ అని చెప్పగానే అపర్ణ తాను రెండు గంటలు పూజలో కూర్చోలేనని చెప్పగానే పంతులు సుభాష్ ఒక్కడైనా పూజలో కూర్చోవచ్చంటాడు. సుభాష్ పూజలో కూర్చోవడం తనకు ఇష్టం లేదని అపర్ణ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: దేశంలోని అగ్రనటులంతా కన్నప్పలో నటించారు