అన్వేషించండి

Brahmamudi Serial Today May June 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రూంలోనే బంధీలుగా రాహుల్‌, రుద్రాణి – కనకాన్ని తిట్టిన కావ్య

Brahmamudi Today Episode: కావ్యను తీసుకెళ్లి నిజం చెప్తాడు రాజ్‌. అయితే బెదిరిస్తే పెళ్లి చేసుకోవడం ఏంటని కావ్య ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: పంతులు తనకు తెలుసని ఆయన వీక్‌ పాయింట్‌ కూడా తెలసని కనకం చెప్తుంది. ఏంటని అపర్ణ, ఇందిరాదేవి అడగ్గానే ఆయన వీక్‌ పాయింట్‌ కనకాంబరం అని చెప్పి మీరు వెళ్లి పంతులను కనకాంబరం వచ్చింది పైన గదిలో ఉందని తీసుకురండి. అక్కడ పంతులును లాక్‌ చేసి మన దారిలోకి తెచ్చుకుందాం అని చెప్తుంది. సరేనని అపర్ణ, ఇందిరాదేవి పంతులు దగ్గరకు వెళ్లి చూస్తుంటారు.

పంతులు:  ఎంటండీ నా వంక అలా చూస్తున్నారు. కొంప దీసి నన్ను తినేస్తారా ఏంటి..?

ఇందిరాదేవి: అంత అదృష్టం మాకు వద్దులేండి శాస్త్రిగారు

పంతులు: మరి ఎందుకు అలా చూస్తున్నారు

అపర్ణ: ఎందుకంటే మీకోసం ఒకరు ఎదురుచూస్తున్నారు కాబట్టి

పంతులు: ఏమిటీ నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నారా..? ఎవరు వాళ్లు

ఇందిరాదేవి: కనకాంబరం

అపర్ణ: పైన గదిలో ఉంది వెళ్లండి

పంతులు: చాలా థాంక్స్‌ అమ్మా దీర్ఘాయుష్మాన్‌భవ.. ఓరేయ్‌ శిష్యా చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను

పంతులు గదిలోకి వెళ్లి కనకాన్ని చూసి షాక్‌ అవుతాడు. నా కనకాంబరం ఎక్కడ అని అడుగుతాడు. ఇంట్లో ఉంటుంది అని కనకం చెప్తుంది. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. పంతులును బెదిరించి ‌బ్లాక్‌ మెయిల్ చేసి పెళ్లి ఆపేసేందుకు ఒప్పిస్తారు. తర్వాత రాజ్‌, కావ్యను పక్కకు తీసుకెళ్లి నిజం చెప్తాడు.

రాజ్‌: మీరు అనుకుంటున్నట్టు యామిని పెళ్లి చేసుకుందామంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. యామిని ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్లే ఇష్టం లేదు. ఈ విషయం గురించి మీకు చెబుదామనుకుంటే మీరేమో వినిపించుకోవడం లేదు. ఇప్పుడు చెప్పండి కళావతి గారు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడంలో తప్పు ఏమైనా ఉందా..?

కావ్య: చనిపోతాను అని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటారా రామ్‌ గారు. ఈరోజు యామిని బెదిరిస్తే పెళ్లి చేసుకుంటున్నారు. రేపు ఇంకో అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటే అప్పుడేం  చేస్తారు.. మనిషి బయపడితే పెళ్లి చేసుకోవడం కాదండి.. మనసుకు అనిపిస్తే చేసుకోవాలి. ఆ మనిషి కళ్ల ముందు లేకపోతే మనం బతకలేము అనిపిస్తే చేసుకోవాలి.. రామ్‌ గారు మీకు అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా..?

రాజ్‌:  ఉన్నారండి.. కానీ..

కావ్య:  అది నాకు చెప్పవలసిన అవసరం లేదు. మీ మనసును అడిగి తెలుసుకోండి..

అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు రూంలో బంధీలుగా ఉన్న రుద్రాణికి యామిని కాల్ చేస్తుంది.

రుద్రాణి: హలో చెప్పు యామిని

యామిని: ఏంటి ఫోన్‌ లిప్ట్‌ చేయడానికి ఇంత లేటు

రుద్రాణి:  ఫోన్‌ సైలెంట్‌లో ఉంది. చూసుకోలేదు.

యామిని: ఫోన్‌ మాత్రమే సైలెంట్‌లో ఉందా..? లేకపోతే నీ ప్లాన్‌ కూడా సైలెంట్‌లో ఉందా..?

రుద్రాణి: అదేంటి యామిని అలా అడిగావు..?

యామిని: ఈ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. కానీ ఇంత టైం అయినా మీరు  ఇంకా ఎక్కడ కనిపించడం లేదేంటి..? అసలు పెళ్లికి వచ్చావా..? లేదా..?

రుద్రాణి: వచ్చాను యామిని ఇదిగో ఇక్కడే పక్కన ఉన్నాను టైం చూసి ఎంట్రీ ఇద్దామని ఆగిపోయాను

యామిని: సరే సరే ఓకే..

అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. పంతులతో కలిసి పై గదిలోంచి కిందకు వస్తున్న ముగ్గురిని కావ్య చూస్తుంది. అనుమానంగా పంతులును బ్లాక్‌ మెయిల్‌ చేశారా అంటూ నిలదీస్తుంది. అదేం లేదని నువ్వు ప్రతిదానిలో అనుమానిస్తున్నావేంటి అంటూ ఇందిరాదేవి తిడుతుంది. అందరూ అక్కడి నుంచి పూజ దగ్గరకు వెళ్తారు. పంతులు పూజ జరిపిస్తుంటే.. కనకం, అపర్ణ, ఇందిరాదేవి కోపంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget