అన్వేషించండి

Brahmamudi Serial Today June 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : సూసైడ్ చేసుకున్న సుభాష్ – శోకసంద్రంలో దుగ్గిరాల కుటుంబం

Brahmamudi Today Episode: ఇందిరాదేవి కోపంతో సుభాష్ ను కొడుతుంది. దీంతో సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: మాయను ఇంట్లోంచి వెళ్లగొట్టిన రుద్రాణి హాస్పిటల్‌లో తనకు ఏమీ తెలియనట్టు ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ ఆ మాయ ఏమైందని అడుగుతుంది. ఇంతసేపు ఉంటుందా? ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది అంటుంది రుద్రాణి. ఇంతకీ మన మీద అంత పగ పెంచుకునే అవసరం ఎవరికి ఉంటుందని ధాన్యలక్ష్మీ అడగ్గానే ఏమో వాళ్లెవరో మన ఎదురుగానే ఉండొచ్చు అని కావ్య అనగానే..

రుద్రాణి: ఏమో అన్నయ్యా శ్రీరామచంద్రుడే అనుకున్నాం. బయటపడే దాకా మంచొడే అనుకున్నాం. ఈ వయసులో కూడా తప్పు చేసి బిడ్డను కంటాడు అనుకున్నామా? ఇప్పుడు చూడండి వదిన పరిస్థితి ఎలా అయ్యిందో

అనగానే ఇందిరాదేవి వెళ్లి సుభాష్‌ ను కొడుతుంది. అందరూ వచ్చి అడ్డుపడతారు.

ఇందిర: వీడికి ఈ ఒక్క చెంప దెబ్బ సరిపోతుందా? అసలు నువ్వు మనిషివేనా? దేవత లాంటి భార్యకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా.. ఇంట్లో వాళ్ల దృష్టిలో నువ్వు ఏమైపోతావోనని అలోచించలేదా? ఇలాంటి వాడినా నేను కన్నది. నా కడుపున చెడ పుట్టావు కదరా? నా కోడలు తిరిగి నా ఇంటిక రాలేదో.. నువ్వు తిరిగి నా ఇంట్లో అడుగు పెట్టవు.

కావ్య: అమ్మమ్మ మీరు ఆవేశపడకండి అత్తయ్య గారికి ఏమీ కాదు.

ఇందిరాదేవి: ఏమీ కాదు ఏంటే నా కొడలు గుండె పగిలిపోయింది. మనసు ముక్కలైంది. ఈ దుర్మార్గుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ప్రాణాల మీద ఆశే వదులుకుంది.

ధాన్యలక్ష్మీ: మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అక్కకు ఏమీ కాదు మళ్లీ మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుంది. భయపడకండి అత్తయ్య రండి ఇక్కడ కూర్చోండి.

  అని అందరూ ఇందిరాదేవిని ఓదారుస్తుంటారు. ఇంతలో డాక్టర్‌ లోపల నుంచి వస్తుంది. అపర్ణకు ఎలా ఉందని అడుగుతారు. అపర్ణకు వచ్చింది మైల్డ్‌ అటాక్‌ కాదని మాసివ్‌ హార్ట్‌ అటాక్‌ అని డాక్టర్‌ చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. కండీషన్‌ చాలా క్రిటికల్‌గా ఉందని చెప్పడంతో అందరూ బాధపడతారు. రాజ్‌ అందరిని ఇంటికి పంపిస్తాడు. కావ్యను కూడా వెళ్లమంటే వెళ్లదు. దీంతో రాజ్ కావ్యను తిడతాడు.

రాజ్: ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వద్దు వద్దు అంటున్నా ఏగేసుకుని వెళ్లి మా ఇంటి ప్రతిష్టను అంతా నువ్వే నిలబెట్టినట్టు ఏదేదో చేశావు. చివరకు దొంగ మాయను తీసుకొచ్చి నా బ్రతుకు దానికి దారపోసేట్టు చేశావు. మా అమ్మ ప్రాణాల మీదకు తీసుకొచ్చావు.

కావ్య:  నేనా .. అది కాదండి..

రాజ్‌: ఇంత జరిగినా ఇంకా నువ్వు చేసిన త్యాగాల గురించి నాతో చెప్పాలని చూస్తున్నావా? మాకోసం తెగించి చేసిన త్యాగాల గురించి ఏకరువు పెట్టాలని చూస్తున్నావా?

   అనగానే కావ్య ఎంత చెప్పాలని చూసినా రాజ్‌ వినడు. నీవల్లే దొంగ మాయ ఇంట్లోకి వచ్చిందని.. మా నాన్న ఎంత నలిగిపోతున్నాడు చూశావా? ఒకవేళ మా అమ్మకు ఏమైనా అయితే జీవితంలో నీ ముఖం చూడను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఏడుస్తూ నిలబడిపోతుంది. ఇంటికి వెళ్లిన అనామిక వెటకారంగా మాట్లాడుతుంది.

అనామిక: ఇన్ని రోజులు నేను బావగారే తప్పు చేశారు అనుకున్నాను కానీ ఏకంగా వాళ్ల నాన్నగారే తప్పు చేశారా? చీచీ తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా ఆయన వయసు ఏంటి ఆయన చేసిన పనులేంటి?

కళ్యాణ్‌: అనామిక అసలు నువ్వు మనిషివేనా? ఒకవైపు మా పెద్దమ్మ చావు బతుకుల్లో ఉంది. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. నువ్వు ముందు నుంచి ఇలాగే ఉంటూ మంచిదానిలా నటించావు కదా?

అనామిక: నేను నటించానా?

 అనగానే నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశానా అనిపిస్తుంది. అని తిట్టి కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న సుభాష్‌ బాధపడుతూ కత్తితో పొడుచుకోబోతే రాజ్, కావ్య వచ్చి ఆపుతారు. డాక్టర్‌ వచ్చి ట్రీట్‌ మెంట్‌ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: 'కల్కి 2898 AD'లో దుల్కర్‌ సల్మాన్‌ది కామియో కాదా? - డైలామాలో పడేసిన ఆ పోస్ట్..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Eng 3rd Test Latest Updates: ఉత్కంఠ‌భ‌రితంగా లార్డ్స్ టెస్టు.. విజ‌యం కోసం ఇరుజ‌ట్ల దోబూచులాట.. టార్గెట్ 193.. టీమిండియా ప్ర‌స్తుతం 58/4.. రాహుల్ పోరాటం
ఉత్కంఠ‌భ‌రితంగా లార్డ్స్ టెస్టు.. విజ‌యం కోసం ఇరుజ‌ట్ల దోబూచులాట.. టార్గెట్ 193.. టీమిండియా ప్ర‌స్తుతం 58/4.. రాహుల్ పోరాటం
Kota Srinivasa Rao: విలక్షణ నటుడికి తుది వీడ్కోలు... ముసిగిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు
విలక్షణ నటుడికి తుది వీడ్కోలు... ముసిగిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు
AP Pensions: అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
India vs England Lords Test: లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేస్తే భారత్ గెలుపు కష్టం! బిగ్గెస్ట్ రన్ ఛేజ్ లిస్ట్ చూశారా
లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేస్తే భారత్ గెలుపు కష్టం! బిగ్గెస్ట్ రన్ ఛేజ్ లిస్ట్ చూశారా
Advertisement

వీడియోలు

Tamil Nadu Goods Train Fire Incident | డీజిల్‌ తరలిస్తున్న రైలులో మంటలు
Kota Srinivasa Rao Dare and Dashing | తెలుగు సినిమా బాగుండాలనే తాపత్రయం..నటుడిగా నిరూపించుకోవాలనే ఆకలి
Attack on Teenmar Mallanna Office | తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
Kota Srinivasa Rao Acting Skills | పాత్ర ఏదైనా సరే అవలీలగా మోసేయటం..కోటా మార్క్ స్టైల్
Air India Crash Report | Cockpit Voice Recorder లో రికార్డైన మాటలు ఇవే | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 3rd Test Latest Updates: ఉత్కంఠ‌భ‌రితంగా లార్డ్స్ టెస్టు.. విజ‌యం కోసం ఇరుజ‌ట్ల దోబూచులాట.. టార్గెట్ 193.. టీమిండియా ప్ర‌స్తుతం 58/4.. రాహుల్ పోరాటం
ఉత్కంఠ‌భ‌రితంగా లార్డ్స్ టెస్టు.. విజ‌యం కోసం ఇరుజ‌ట్ల దోబూచులాట.. టార్గెట్ 193.. టీమిండియా ప్ర‌స్తుతం 58/4.. రాహుల్ పోరాటం
Kota Srinivasa Rao: విలక్షణ నటుడికి తుది వీడ్కోలు... ముసిగిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు
విలక్షణ నటుడికి తుది వీడ్కోలు... ముసిగిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు
AP Pensions: అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
అమరావతిలో భూమిలేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం, జీవో జారీ
India vs England Lords Test: లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేస్తే భారత్ గెలుపు కష్టం! బిగ్గెస్ట్ రన్ ఛేజ్ లిస్ట్ చూశారా
లార్డ్స్ లో ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేస్తే భారత్ గెలుపు కష్టం! బిగ్గెస్ట్ రన్ ఛేజ్ లిస్ట్ చూశారా
Teenmar Mallanna: నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇకనుంచి తేల్చుకుందాం: కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్
నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇకనుంచి తేల్చుకుందాం: కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్
Rajamouli - Kota Srinivasa Rao: డెడ్ బాడీ దగ్గర సెల్ఫీలు ఏంటి? బుద్ధి ఉందా? కోట ఇంటి వద్ద రాజమౌళి అసహనం
డెడ్ బాడీ దగ్గర సెల్ఫీలు ఏంటి? బుద్ధి ఉందా? కోట ఇంటి వద్ద రాజమౌళి అసహనం
Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉజ్జయిని మహంకాళి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు, ఆయన మృతి బాధాకరం: చంద్రబాబు నివాళులు
అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు, ఆయన మృతి బాధాకరం: చంద్రబాబు నివాళులు
Embed widget