Brahmamudi Serial Today May June 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్ ను నిర్భంధించిన యామిని – కావ్యను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రాజ్
Brahmamudi Today Episode: కావ్యతో మాట్లాడటానికి వెళ్తున్న రాజ్‌ను యామిని ఆపేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: యామిని దుగ్గిరాల ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చి మరీ కావ్యను పెళ్లికి పిలవడంపై వైదేహి సీరియస్ అవుతుంది. కావ్య ఒక్కతే రాకుండా ఫ్యామిలీ వస్తానంది. రేపు వాళ్లు వచ్చి ఏం చేస్తారో అని టెన్షన్ పడుతుంది.
యామిని: మామ్ రిలాక్స్ ఎందుకు అంత టెన్షన్ పడుతావు. వస్తే రానివ్వు.. అయినా మనం పిలిచింది కూడా రావాలనే కదా
వైదేహి: ఏంటే రావాలనే కదా.. వాళ్లు వస్తే ఊరికే కూర్చుంటారు అనుకున్నావా..? పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. రామ్ మనసు మార్చే ప్రయత్నం చేస్తారు.
యామిని: ఎలా చేస్తారు మామ్.. బావకు ఆ కావ్యకు పెళ్లి అయిపోయిందని చెప్తారా..? చెబితే బావకు గతం గుర్తు చేయాలి. వాళ్లు అంత ధైర్యం చేస్తారా..? ఇప్పుడు మా పెళ్లిని ఆపడం ఎవరి తరం కాదు కూల్‌గా పాటలు విందామా..?
అంటూ యామిని చెప్పినా వైదేహి కోపంగా చూస్తుంది. ఇక దుగ్గిరాల ఇంట్లో రాజ్, యామిని ల పెళ్లి ఎలా ఆపాలా అని అందరూ ఆలోచిస్తుంటారు.
సుభాష్: ఏంటమ్మా ఆ యామినికి అలా మాటిచ్చేశావు మా అందరినీ పెళ్లికి తీసుకొస్తానని అంటావేంటి..? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు.
ఇందిరాదేవి: నాకు అర్థం అయిందిరా సుభాష్
కళ్యాణ్: ఏమి అర్థం అయింది నాన్నమ్మ
ఇందిరాదేవి: ఎమి అర్థం అవడం ఏంట్రా మనవడా..? నా మనవరాలు కావ్య ఆ పెళ్లి ఆపడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది
అపర్ణ: ఏంటి కావ్య అత్తయ్యగారు చెప్పేది నిజమేనా..?
కావ్య: నేను పెళ్లి ఆపడానికి ఏ ప్లాన్ చేయలేదు అత్తయ్యా
స్వప్న: ఏంటి కావ్య నువ్వు చెప్పేది
కావ్య: నిజంగానే నేను ఆ పెళ్లి ఆపడానికి ఏం ప్లాన్ చేయలేదు
ఇందిరాదేవి: ఏంటి ఏం ప్లాన్ చేయలేదా..? చేయకపోతే మరి దానితో ఎందుకు ప్రగల్బాలు పలికావు
కావ్య: నేనేం ఫోజులు కొట్టడం లేదు అమమ్మగారు మీ అందరినీ నేను పెళ్లికి తీసుకెళ్తాను
ఇందిరాదేవి: ఎందుకు రావాలి మేము రాము
కావ్య: మీరు తప్పకుండా రావాలి
అపర్ణ: ఎందుకు రావాలి అక్కడ వాడు ఇంకో అమ్మాయి మెడలో తాళి కడుతుంటే చూసి ఆశీర్వదించాలా
కావ్య: అత్తయ్యా మీరు ఆశీర్వదించాల్సిన అవసరం లేదు అక్కడ ఆ పెళ్లి జరగదు
రుద్రాణి: పెళ్లి జరగదు అని అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు..
కావ్య: జరగదని నాకు తెలుసు.. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. మా ఇద్దరిని కలిపిన ఆ దేవుడే మమ్మల్ని విడిపోకుండా కాపాడతాడు అని నమ్మకం ఉంది
అంటూ కావ్య వెళ్లిపోతుంది. రుద్రాణి వెళ్లిపోయాక మిగతా అందరూ కలిసి ఎలాగైనా పెళ్లిని ఆపాలని అందుకు యామిని సైడు ఉండే ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేయాలని ఎవరా ఆ ఒక్కరు అని ఆలోచిస్తుంటారు. ఇంతలో వైదేహి, యామిని ఇంటికి వెళ్లగానే అక్కడ పంతులు ఎదురొచ్చి మీరు రాత్రి మాట్లాడింది నాతోనే మీ పెళ్లికి మంచి ముహూర్తం సెట్ చేశాను. అని చెప్పి వెళ్లిపోతాడు. రాజ్ రూంలో కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తూ... కాల్ చేస్తాడు.
కావ్య: ఇంత రాత్రి పూట కాల్ చేయడం ఏంటండి ఎందుకు కాల్ చేస్తున్నారు..? మీ కారణంగా నేను రాత్రిళ్లు లేటుగా పడుకుని పొద్దున్నే లేవలేకపోతే నా పనులన్నీ ఎవరు చేస్తారండి.. నాకు ఈ టైంలో మీతో మాట్లాడే ఉద్దేశమే లేదు. ముందు ఫోన్ పెట్టేయండి
రాజ్: ఏంటండి మీరు వాగుడు పక్షిలాగా లొడలొడా వాగుతూనే ఉన్నారు. ఏ మాకు పనుల్లేవా..? మేము బిజీగా ఉండమా..? అసలు నేను ఏం చెప్తున్నానో కూడా వినరేంటండి మీరు
కావ్య: మీరేం చెప్తారో నాకు తెలుసు మొన్న రాత్రి అంతా అడవిలో తప్పిపోయాం కదా ఇంటికి క్షేమంగా వెళ్లారా..? ఆరోగ్యం అది బాగానే ఉందా అని అడుగుతారు. నేను క్షేమంగానే ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది ఓకేనా బై
అని ఫోన్ కట్ చేస్తుంది కావ్య. రాజ్ బాగా ఆలోచించుకుని డైరెక్టుగా వెళ్లి కావ్యను కలవాలని వెళ్తుంటే యామిని ఎదురొచ్చి బావ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ రాజ్‌ను వెళ్లకుండా ఆపేస్తుంది. రాజ్ కోపంగా రూంలోకి వెళ్లిపోతాడు. మరుసటి రోజు దుగ్గిరాల ఇంట్లో అందరూ పెళ్లికి రెడీ అవుతుంటారు. రుద్రాణి రాకుండా ఉంటే మనం వేసే ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుని రుద్రాణి, రాహుల్‌ను ఎలాగైనా ఈ పెళ్లికి తమతో తీసుకెళ్లకూడదని అనుకోవడంతో ఆ పని నేను చేస్తానని స్వప్న చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!




















