Brahmamudi Serial Today May July 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఒంటరిగా బోర్డ్ మీటింగ్‌కు వెళ్ళిన రాజ్ - కావ్యకు వార్నింగ్ ఇచ్చిన యామిని
Brahmamudi Today Episode: కావ్య యామిని కాల్ చేయడంతో రాజ్ ఒంటరిగా బోర్డు మీటింగ్‌కు వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఆఫీసుకు వెళ్లడానికి కావ్య, రాజ్ రెడీ అయి కిందకు వస్తారు. ఇంట్లో వాళ్లు అందరూ రాజ్‌ను ఆశ్చర్యంగా చూస్తుంటారు. రాజ్ కూడ వాళ్లను అలాగే చూస్తాడు.
రాజ్: ఏంటి అలా చూస్తున్నారు.. వేరే గ్రహం నుంచి వచ్చానా ఏంటి..? నేను మీ మనిషినే కదా..? నాన్నమ్మ మీ ఇంట్లో వంట చేసే పనిమనిషి పేరేంటి..?
ఇందిరాదేవి: లక్ష్మీ.. ఎందుకు..? మనవడా..?
రాజ్: తను చేసిన పప్పులో ఉప్పు తక్కువ అయింది. వంకాయ కూరలో కారం ఎక్కువ అయింది. రైస్‌లో అయితే మొత్తం రాళ్లే వచ్చాయి. అందుకని తనని వంటమనిషి పోస్ట్ నుంచి తోటమాలిని చేస్తున్నాను
అపర్ణ: అత్తయ్యా వీడు కొత్త రాజేనా..? లేక పాత రాజేనా..?
ఇందిరాదేవి: నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ
అపర్ణ: వీడి మాటతీరు బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు లేదు అత్తయ్యా.. మర్చిపోయిన గతం కొద్దికొద్దిగా గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇందిరాదేవి: నాకు అలాగే ఉంది అపర్ణ కానీ నువ్వు అప్పుడే బయటపడకు.. కొద్దిసేపు అబ్జర్వ్ చేయ్
రాజ్: మమ్మీ ఏంటి ఇద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు..ఎనీ ప్రాబ్లమ్.. ఏదైనా ఉంటే డైరెక్టుగా చెప్పండి
ఇందిరాదేవి: ఏం లేదు మనవడా..? డౌటు లేదు వీడు వాడే అనిపిస్తుంది అపర్ణ
రాజ్: (నవ్వుతూ) ఏంటి అందరూ షాక్ అయ్యారా.? భయపడ్డారు కదా..? నేనే కళావతి గారి నిజమైన బాస్ అని అందరూ నమ్మేశారు కదా
కళ్యాణ్: అవును అన్నయ్యా ఒక్క క్షణం నిజంగానే వదిన వాళ్ల బాస్ మన ఇంటికి వచ్చారేమో అనిపించింది
స్వప్న: నాకైతే ఇప్పటికీ మీరు రామా..? మా చెల్లి వాళ్ల బాసా..? అని తేల్చుకోలేకపోతున్నాను
రాజ్: మరి నేనంటే ఏంటనుకున్నారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ..
రుద్రాణి: చూస్తుంటే అర్థం అవుతుంది రామ్ నీ యాక్టింగ్ ప్రత్యేకించి చెప్పడం ఎందుకు
రాజ్: అత్తా కొన్ని సార్లు మన గురించి మనమే చెప్పుకోవాలి లేదంటే గుర్తింపు ఉండదు. ఏం కళావతి గారు మీరు ఇచ్చిన ట్రైనింగ్‌కు నేను ఇచ్చిన ఫెర్మామెన్స్‌కు షాక్ అయి షేక్ అయిపోయారా..? ఎలా ఉంది మన యాక్టింగ్.. ఇక మీరు ఏం టెన్షన్ పడకండి.. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే.. ఇక ఆఫీసుకు వెళ్దామా..?
అని ఇందిరాదేవి దగ్గర బ్లెసింగ్స్ తీసుకుని ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్తారు. ఆఫీసు దగ్గర కారు దిగగానే రాజ్ కూల్‌గా చూస్తూ..
రాజ్: నిన్న నేను ఆఫీసుకు వచ్చినందుకు చాలా టెన్షన్ పడ్డారు. కానీ అలా రావడం వల్లే నా భయం పోయి ఇవాళ పుల్లు కాన్ఫిడెంట్ వచ్చింది
కావ్య: అది ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా ఉంటే చాలు
రాజ్: మీటింగ్‌లో ఎలా అదరగొడతానో మీరే చూస్తారు కదా
కావ్య: మా బాస్ ఇలా ఎక్కువ మాట్లాడరు. తక్కువ మాట్లాడతారు ఎక్కువ చేస్తారు.
రాజ్: నేను మీ బాస్ ను కాదు కదా ఎక్కువ మాట్లాడతాను తక్కువ టైంలో వర్క్ ఫినిష్ చేస్తాను
అంటూ చెప్తుండగానే యామిని, కావ్యకు ఫోన్ చేస్తుంది. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకుని రాజ్‌ను లోపలికి వెళ్లమని చెప్పి కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది.
యామిని: ఏంటి కావ్య కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నావు నువ్వు ఎంత చేసినా ఈ రోజు గెలిచేది నేనే ఎందుకంటే సిద్దార్థ్‌కు రాజ్‌కు గతం గుర్తు లేదన్న విషయం చెప్పాను
కావ్య: ఎదుటి వాళ్ల జీవితాలను లాక్కోవాలని చూసే నీకు ఇలాంటివి తప్పా ఇంకేం తెలుస్తుంది చెప్పు
యామిని: అన్నట్టు మర్చిపోయాను ఈరోజు నీకు ఇంకొక సర్పైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను అదేంటో తెలుసుకో లేదంటే బోర్డు మీటింగ్‌లో నువ్వు ఓడిపోగానే నాకు కాల్ చేయ్ చెప్తాను
అని యామిని బెదిరించగానే కావ్య భయపడుతూ స్వప్నకు కాల్ చేసి యామిని చెప్పింది అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అలాగే అప్పుకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సరే అంటూ అప్పు కాల్ కట్ చేస్తుంది. ఇంతలో యామిని రౌడీలు ఇద్దరూ అప్పుకు లంచం ఇస్తున్నట్టు నటించి ఏసీబీ వాళ్లకు పట్టిస్తారు. ఏసీబీ వాళ్లు అప్పును అరెస్ట్ చేస్తారు. ఇక మీటింగ్ హాల్లోకి వెళ్లిన రాజ్‌ను బోర్డు మెంబర్స్ విష్ చేస్తారు. సిద్దార్థ్ మాత్రం కోపంగా చూస్తుంటాడు. రాజ్ కోపంగా అందరినీ తిడతాడు. ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారని అడుగుతాడు. ఎవ్వరూ పలకరు. కంపెనీ టర్నోవర్ తగ్గింది అందుకే చైర్మన్ ను మార్చాలని మీటింగ్ ఏర్పాటు చేశామని సిద్దార్థ్ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















