Brahmamudi Serial Today July 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కోర్టు దగ్గరకు రాజ్ కు ఘోర అవమానం – కుప్పకూలిపోయిన ధాన్యలక్ష్మీ
Brahmamudi Today Episode: మహిళా మండలి సభ్యులలోకి తన మనుషులను పురమాయించి కళ్యాణ్ మీదకు టమాటాలు వెయిస్తుంది రుద్రాణి దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఈ భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన అప్పును రేపు కోర్టులో ప్రవేశపెట్టండి అని జడ్జి కోర్టును వాయిదా వేస్తాడు. తర్వాత అందరూ బయటకు వస్తారు. కళ్యాణ్ తరుపున న్యాయవాది నేను చేయాల్సింది చేసాను. ఇక అనామికను కళ్యాణ్ కొట్టలేదని.. చాలా బాగా చూసుకునే వాడని మీరు ఒక్క సాక్ష్యం తీసుకురండి అని చెప్పగానే పెళ్లాన్ని మొగుడు బాగా చూసుకున్నాడు అనే దానికి సాక్ష్యం ఎలా తెస్తాం అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇంతలో లోపలి నుంచి వచ్చిన అనామిక వాళ్ల దగ్గర సాక్ష్యాలే లేవని నన్ను బతిమాలి నాకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకెళ్లమని నేను కేసు వాపసు తీసుకుంటానని అనామిక అంటుంది.
కళ్యాణ్: అప్పుడు నిన్ను ప్రేమించి మోసపోయాను. ఇప్పుడు మళ్లీ నేను మోసపోవడానికి సిద్దంగా లేను.
అనామిక: సరే అయితే రేపు కోర్టులోనే చూసుకుద్దాం. మీ లాయర్ గారు సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారు కదా? వీలైతే వాటిని తీసుకురండి చూద్దాం.
రాజ్: ఇంత దూరం వచ్చాక ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు కళ్యాణ్. నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు.
రుద్రాణి: రేయ్ నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేశాశా?
రాహుల్: అంతా చేశాను మమ్మీ.. ఆ మహిళా మండలి ఆడవాళ్ళ మధ్యలోకి మన వాళ్లు ముగ్గురు వెళ్లి జాయిన్ అయ్యారు. కళ్యాణ్ అక్కడికి వెల్లగానే వాడికి సన్మానం చేయడానికి సిద్దంగా ఉన్నారు.
రుద్రాణి: వెరీ గుడ్..
అని చెప్తుంది. కళ్యాణ్‌ను పోలీసులు జీపు దగ్గరకు తీసుకెళ్తుంటే రాహుల్ పంపించిన ముగ్గురు ఆడవాళ్లు టమాటాలు కళ్యాణ్ మీదకు వేస్తారు. ఇంతలో రాజ్ వచ్చి అడ్డుపడతాడు. రాహుల్, రుద్రాణి, అనామిక చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మూర్తితో నా కూతురు ఎందుకు కోర్టుకు వెళ్లాలని ప్రశ్నిస్తుంది కనకం. అప్పు కనకాన్ని కన్వీన్స్ చేస్తుంది. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హాల్‌లో కూర్చుని ఆలోచిస్తుంటారు.
ఇందిరాదేవి: తల్లిని తండ్రిని పంచాయతీకి పిలిచిన పిల్ల వాళ్లు చూసుకుంటారులే అని ఒక పక్కన నిలబడొచ్చు. కానీ ఇంట్లో ప్రతి ఒక్కరినీ మర్యాద లేకుండా తీసిపడేసింది. మన కుటుంబంలో కూడా ఆవేశం తన్నుకొచ్చింది అంటే దానికి అనామిక ప్రవర్తనే కారణం.
ధాన్యలక్ష్మీ: ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అవన్నీ కాదు అత్తయ్యా.. కళ్యాణ్ జైలుకు వెళ్లకుండా ఆపాలంటే ఏం చేయాలని ఆలోచించాలి.
సుభాష్: అంటే ఏంటమ్మా అనామిక డిమాండ్ చేసిన్నట్టు తన దగ్గరకు వెళ్లి అందరం క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురావాలా?
ధాన్యలక్ష్మీ: తప్పదు బావగారు మన కళ్యాణ్ కోసం ఏమైనా చేయాల్సిందే కదా ఇంతకు మించి ఏం చేయగలం.
అపర్ణ: ధాన్యలక్ష్మీ నీ బాధ మాకు అర్థం అవుతుంది. మేం కూడా అంతే బాధపడుతున్నాం. తెలియక చేసిందో చిన్నతనం వల్ల చేసిందో అంటే ఏదో ఒకటి చేసి తీసుకురావచ్చు. కానీ అనామిక మన మీద కక్ష్య గట్టింది. భర్తను జైలుకు పంపడానికి కూడా వెనకాడని భార్య రేపు తిరగి ఇంటికి వస్తే.. పక్కలో పామును పెట్టుకుని పడుకున్నట్లే ఉంటుంది. ఏ క్షణం ఎందులోంచి తప్పు తీస్తుందో తెలియక మనం అంతా అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
ధాన్యలక్ష్మీ: మీరంతా ఎంతసేపు ఇంటి గురించి పరువు గురించే ఆలోచిస్తున్నారే తప్పా నా కొడుకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒక్కరూ ఆలోచించడం లేదు.
ప్రకాష్: నోర్మూయ్.. ఏం వాగుతున్నావే ఏం మాట్లాడుతున్నావ్.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదా? ఇంత మంది కోర్టుకు రావాల్సిన అవసరం ఏంటి? నీకు ఒక్కదానికే కొడుకు ఉన్నట్లు మాట్లాడుతున్నావు. నీ కొడలు వచ్చిన దగ్గర నుంచి వాణ్ని నువ్వు ఒక్కసారైనా నమ్మావా? ప్రతి విషయంలో వెనకేసుకొచ్చి ఆ పిల్లకు అంత అలుసు ఇచ్చింది నువ్వే కదా?
అంటూ ప్రకాష్ ఆవేశపడుతుంటే రాజ్ వచ్చి ఆపుతాడు. కావ్య కూడా ధాన్యలక్ష్మీకి ఏదో చెప్పబోతుంటే నువ్వు మధ్యలో మాట్లాడకు నీవల్ల, మీ అప్పు వల్లే ఇదంతా జరిగింది అనడంతో అందరూ షాక్ అవుతారు. కావ్య, స్వప్న ధాన్యలక్ష్మీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఆ అనామికను సగం చెడగొట్టింది మా అత్తే అంటూ స్వప్న, రుద్రాణిని తిడుతుంది. ఇక కళ్యాణ్ ఎలా బయటకు తీసుకురాగలం అంటూ ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?