Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఫుడ్ అంటే చాలా ఇష్టమన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ ఎంత ఖర్చుపెడతాడని ఫ్యాన్స్‌లో చర్చలు మొదలయ్యాయి.
Prabhas: కొందరు స్టార్ హీరోలు ఏం చేసినా సెన్సేషన్‌గానే ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు హీరోల చేసే ప్రతీ పనిపై ఫ్యాన్స్ ఫోకస్ చాలా ఉంటుంది. అలాంటి హీరోల్లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ చేసే ప్రతీ పనిని, ఆఫ్ స్క్రీన్ తన ప్రవర్తనను ఫ్యాన్స్ చాలా ఫోకస్ చేస్తుంటారు. ఇక ప్రభాస్ గురించి ఎవరు మాట్లాడినా ముందుగా ప్రస్తావించే విషయం ఫుడ్. తను ఒక ఫుడ్ లవర్ అని, తనకు ఫుడ్ అంటే ఇష్టమని చాలామంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే చెప్పారు. అయితే ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ ఎంత ఖర్చుపెడతాడు అనే విషయంపై తాజాగా చర్చలు మొదలయ్యాయి.
లక్షల్లో ఖర్చు..
ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారంటే చాలు.. ఈ మూవీ టీమ్ మొత్తం ఫుడ్ విషయంలో టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే వారికి కావాల్సిన ఫుడ్ కావాల్సినట్టుగా ప్రభాస్ ఇంటి నుంచి వస్తుంది కాబట్టి. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రివీల్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్‌తో నటించిన హీరోయిన్లు.. తాము ప్రభాస్‌తో కలిసి నటిస్తే డైటింగ్ అనేది మర్చిపోవాలి అంటూ కామెంట్స్ కూడా చేశారు. వారి సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పోస్టులు చేసినవారు కూడా ఉన్నారు. అలా ప్రభాస్‌కు ఫుడ్ అంటే ఇష్టమని అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ లక్షల్లో ఖర్చు పెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేకమైన టీమ్..
ప్రభాస్.. తన మూడ్‌ను బట్టి ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే తనకు చాలా ఇష్టం. అంటే ప్రతీ పూట వారి ఇంట్లో చాలారకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు ప్రభాస్ కోసం సిద్ధంగా ఉంటాయట. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పనిచేస్తుందట. అలా ఎన్నో రకాల వంటలు చేయడానికి, అంతమంది కిచెన్‌లో పనిచేయడానికి పూటకు కనీసం రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని సమాచారం. ఒక్క పూట కోసం రూ.2 లక్షలు ఖర్చుపెట్టడమేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నా.. ప్రభాస్ గురించి తెలిసినవారు మాత్రం తనతో పాటు చాలామందికి కలిపి వంట చేయిస్తాడు కాబట్టి ఆ మాత్రం ఖర్చు అవ్వడం కామనే అని కామెంట్స్ చేస్తున్నారు.
‘కల్కి 2898 AD’ సక్సెస్..
ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ ఇచ్చిన సక్సెస్‌లో సంతోషంగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ప్రభాస్‌తో పాటు ఇందులో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనెకు కూడా వారి పాత్రల వల్ల మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ట్విస్ట్ చూసి ప్రేక్షకులంతా చాలా సంతోషంతో థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. ఒకసారి చూస్తే సరిపోదని మళ్లీ మళ్లీ ‘కల్కి 2898 AD’ను చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు అభిమానులు. ‘కల్కి 2898 AD’ అయిపోవడంతో ‘రాజా సాబ్’పై ఫోకస్ పెట్టనున్నాడు ప్రభాస్.
Also Read: ప్రభాస్‌తో డేటింగ్? DP టాటూపై స్పందించిన దిశా పటానీ - అదేంటీ అలా అనేసింది