Brahmamudi Serial Today May July 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య హగ్ విషయం చెప్పిన రాజ్ - హ్యాపీగా ఫీలయిన అపర్ణ, ఇందిరాదేవి
Brahmamudi Today Episode: రాజ్ ను రాజ్ లా మార్చేందుకు ట్రైనింగ్ ఇస్తున్న కావ్యను రుద్రాణి చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాహుల్ రూంలో వచ్చి నగల కోసం వెతుకుతుంటే స్వప్న వస్తుంది. స్వప్నను చూసిన రాహుల్ షాక్ అవుతాడు. స్వప్న కూడా రాహుల్‌ను అనుమానిస్తుంది.
స్వప్న: మళ్లీ ఏం కొట్టేయాలని వెతుకుతున్నావు
రాహుల్: ప్రతిసారి ఏదో ఒకటి కొట్టేయడానికి నేను దొంగను కాదు స్వప్న
స్వప్న: కుక్కతొక వంకర అన్నట్టు నీ బుద్ది మారదు కదా..? అయినా అది నీ తప్పు కాదులే తప్పులు చేయడం అనేది తమరి డీఎన్‌లోనే ఉంది.ఏం చేస్తాం ఇలా అనుభవించాల్సిందే.. చెప్పు ఏం కొట్టేయడానికి వచ్చావు
రాహుల్: ఏం లేదు నేనేం కొట్టేస్తాను స్వప్న
స్వప్న: మరి గదిలో ఇంత స్పేస్ ఉండగా ఇక్కడికే ఎందుకు వచ్చావు
రాహుల్: ఒక్క నిమిషం ఇదిగో ఈ చార్జర్ కోసం వచ్చాను
అంటూ చార్జర్ తీసుకుని వెళ్లిపోతాడు.
స్వప్న: నా దొంగమొగుడు చెప్తుంటే ఏదో డౌటుగా అనిపిస్తుంది. కచ్చితంగా ఏదో చేయబోతున్నాడు
రాహుల్: చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు కొద్దిలో కొద్దిగా తప్పించుకున్నాను.
మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాహుల్. మరోవైపు అపర్ణ, ఇంద్రాదేవి రాజ్, కావ్య గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే రాజ్ వస్తాడు.
ఇందిరాదేవి: నిన్న ఏం జరిగిందో చెప్పు మనవడా..?
రాజ్: ఏం జరుగుతుంది. ఏదో ఒకటి తిని పడుకున్నాను
ఇందిరాదేవి: ఒరేయ్ వెధవ మేము అడుగుతుంది అది కాదు
అపర్ణ: నిన్న నువ్వు ఏం తిన్నావు.. ఏం బట్టలు వేసుకున్నావు అని కాదు నిన్న నువ్వు కావ్య బయటకు వెళ్లారు కదా..? ఏం మాట్లాడుకున్నారు ముందు దాని గురించి చెప్పు
రాజ్: చాలా మాట్లాడుకున్నాము..
ఇందిరాదేవి: అసలు ఏం మాట్లాడుకున్నారో క్లియర్‌గా చెప్పు
రాజ్: అంటే అది మా ఇద్దరి లైఫ్ గురించి పూర్తిగా క్లారిటీగా మాట్లాడుకున్నాము. ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి కన్పీజ్ ఉండదు. నేను చేసిన పనికి నాకు థాంక్స్ కూడా చెప్పారు.
ఇందిరాదేవి: ఇది కదా మాకు కావాల్సింది
అపర్ణ: ఈ శుభవార్త వినడానికే ఇన్ని రోజులు ఎదురుచూశాం
ఇందిరాదేవి: అయితే వెంటనే పంతులును పిలిపించాలి
అపర్ణ: పెళ్లికి ముహూర్తం పెట్టించాలి
రాజ్: హలో మరీ అంత స్పీడ్ అయిపోకండి కాస్త నెమ్మది
ఇందిరాదేవి: ఇంకా నెమ్మది ఏంట్రా నిర్ణయం తీసుకునే వరకే మీరు.. తర్వాత అంతా మా నిర్ణయం ప్రకారమే జరగాలి
రాజ్: అసలు పెళ్లికి ఓకే అని నేనెప్పుడు చెప్పాను
అపర్ణ: ఇప్పుడే అన్నావు కదరా లైఫ్ గురించి పూర్తిగా మాట్లాడుకున్నామన్నావు
అని అడగ్గానే.. ఆఫీసు గురించి కావ్య చెప్పిన విషయాలు చెప్తుంటే.. కావ్య వస్తుంది.
కావ్య: రామ్ గారు ఏంటండి మీరు ఉదయం రాగానే నన్ను వచ్చి కలవమన్నాను ఇక్కడ వీళ్లతో ముచ్చట్లు పెడుతున్నారు
రాజ్: ముచ్చట్లు కాదండి మనం చేయబోయే పని గురించి క్లారిటీగా చెప్తున్నాను.
కావ్య: చేయాల్సిన పని మీద క్లారిటీ ఉండాల్సింది మీకు.. నేర్చుకోవాల్సింది మీరు. పదండి అసలే టైం చాలా తక్కువగా ఉంది పదండి రండి
రాజ్ ను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది.
రాజ్: చూశారా..? చేయిపట్టుకుని లాక్కుని వెళ్తుంది
అని అపర్ణ, ఇందిరాదేవిలకు సైగ చేస్తాడు. మరోవైపు స్వప్న, అప్పును పిలచి తన నగలు మెరుగు పెట్టించుకురా అని ఇస్తుంది. ఇంత సడెన్‌గా ఎందుకు అక్కా అని అప్పు అడగ్గానే.. లాకర్‌లో పెడదామనుకుంటున్నాను అందుకే అని రాహుల్ గురించి చెప్తుంది. అప్పు సరేనని నగలు తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను రాజ్‌లా మార్చేందుకు కావ్య నానా తిప్పలు పడుతుంది. రాజ్ కూడా కావ్య చెప్పినట్టు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. కావ్య, రాజ్‌కు ట్రైనింగ్ ఇవ్వడం చూసిన రుద్రాణి ఇదేదో కొత్త ప్లాన్ వేసిందని షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















