Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ధాన్యలక్ష్మీకి బుద్ది చెప్పిన కావ్య – కళ్యాణ్ మనసులో అప్పు ఉందన్న రాజ్
Brahmamudi Today Episode: కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ఇంట్లో వాళ్లందరికి రాజ్ చెప్పడంతో ధాన్యలక్మీ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ దగ్గరకు కావ్య వెళ్లి మీరు అప్పును ప్రేమిస్తున్నారా? ఒక ఫ్రెండుగానే చూస్తున్నారా? అని అడుగుతుంది. మీ పెళ్లి జరిగితే రుద్రాణి మాటలే నిజం అవుతాయి. మీ అమ్మగారు అప్పును కోడలుగా ఒప్పుకోరు అంటుంది. అయితే అప్పు సంతోషమే నాకు ఇష్టం. ఎవరేమనుకుంటున్నారో అనేది అనవసరం. అప్పుకు ఏది ఇష్టమో అదే చేయండి అని కళ్యాణ్ చెప్పగానే కావ్య నా అనుమానం కూడా తీరిపోయిందని.. అలాగే కళ్యాణ్‌ను ధాన్యలక్ష్మీ చూసిన అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. దీనికి కళ్యాణ్ ఒప్పుకోడు. నేనున్న పరిస్థితుల్లో మళ్లీ పెళ్ళి అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తాడు. అయితే నా మాటకు మీరు ఏమాత్రం విలువిచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకుంటారని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు ధాన్యలక్ష్మీ దగ్గరకు రుద్రాణి వెళ్లి కావ్య, కళ్యాణ్‌ను పెళ్లికి ఒప్పించిందా లేదా తెలుసుకోమని రెచ్చగొడుతుంది. సరే కనుక్కుంటానని ధాన్యలక్ష్మీ వెళ్తుంది.
కావ్య: చిన్నత్తయ్యా కాఫీ
ధాన్యలక్ష్మీ: నాకు కాఫీ వద్దు.
ప్రకాష్: ఇప్పుడు వద్దా.. రోజూ వద్దా?
ధాన్యలక్ష్మీ: ఇప్పుడు వద్దు..
రుద్రాణి: మరేం కావాలి ధాన్యలక్ష్మీ..
స్వప్న: ఏం నువ్వేమైనా కీ ఇచ్చి తీసుకొచ్చావా? చేసిపెట్టేదానిలాగా చెప్తున్నావు.
ధాన్యలక్ష్మీ: కావ్యా..
కావ్య: మామయ్యగారు మీరు టీ అడిగారు కదా మర్చిపోయాను నేను పెట్టుకుని తీసుకొస్తాను.
ధాన్యలక్ష్మీ: నిన్నే పిలుస్తుంటే వినిపించడం లేదా? ఇక్కడే ఉండి పలకవేంటి?
కావ్య: పిలిచారా అప్పుడు నేను ఎక్కడున్నాను.
ధాన్యలక్ష్మీ: ఇక్కడే ఉన్నావు.
కావ్య: మరి ఎందుకు అరిచారు. నేను ఇక్కడే ఉన్నానుగా నా చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా
స్వప్న: నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుందే బాగానే కడిగావు.
ధాన్యలక్ష్మీ: నాకిచ్చిన మాట ఏం చేశావు. కళ్యాణ్ ను పెళ్లికి ఒప్పించావా?
స్వప్న: ఈవిడ మాటకి ప్రకాశం అంకులే కాదు. కన్న కొడుకు కూడా విలువియ్యడన్నమాట. మా కావ్య ఒప్పించాల్సిన కర్మ పట్టింది.
ధాన్యలక్ష్మీ: స్వప్న ఇది మా ఫ్యామిలి విషయం.
స్వప్న: అప్పుడు మా చెల్లిని ఎందుకు అడుగుతున్నారు.
కావ్య: నేను కనుక్కున్నాను కవిగారి మనసులో అప్పు లేదు.
ధాన్యలక్ష్మీ: అయితే కళ్యాణ్‌ను పెళ్లికి ఒప్పించావా?
రాజ్: ఎవరు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది.
ధాన్యలక్ష్మీ: ఏంటి?
రాజ్: నువ్వు సరిగ్గానే విన్నావు పిన్ని ఇంకోటి కూడా చెప్తున్నాను సరిగ్గా విను. నేను కళ్యాణ్‌కు అప్పును ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను.
ఇందిరాదేవి: ఏమంటున్నావు రాజ్ మళ్లీ ఏంటి ఇదంతా..?
ప్రకాష్: వాడు ఒప్పుకున్నాడా?
రాజ్: వాడి మనసులో అప్పు ఉందని నాకు అర్థం అయింది.
కావ్య: ఏవండి మీరు కవిగారి మనసులోకి దూరి తెలుసుకున్నారా? మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా?
అనగానే కావ్య మనసులో ఉన్నది బయటపడకుండా రాజ్‌తో ఇలా చేయిస్తుంది అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. ఇవన్నీ ఎందుకు కళ్యాణ్‌ను పిలిచి అడుగుదామని స్వప్న చెప్తుంది. కళ్యాణ్ వచ్చి తన మనసులో అప్పు లేదని తనని ఒక ఫ్రెండుగానే చూశానని చెప్తాడు. దీంతో నన్ను మోసం చేసినా పర్వాలేదు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు అంటూ రాజ్ చెప్పడంతో.. అలాంటిదేం లేదని కళ్యాణ్ చెప్పడంతో అపర్ణ, ధాన్యలక్ష్మీని తిడుతుంది. ధాన్యలక్ష్మీ మాత్రం కావ్య నువ్విచ్చిన మాట సంగతేంటిన కావ్యను అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.