Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ప్రకాష్‌కు క్షమాపణ చెప్పిన కావ్య – దుగ్గిరాల ఇంట్లో మారిపోయిన రూల్స్
Brahmamudi Today Episode: ప్రకాష్ బాధను చూసి కావ్య వెళ్లి సారీ చెప్తుంది. అయినా ప్రకాష్ అసహనంగా కావ్యను తిడుతూ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
![Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ప్రకాష్‌కు క్షమాపణ చెప్పిన కావ్య – దుగ్గిరాల ఇంట్లో మారిపోయిన రూల్స్ brahmamudi serial today episode January 9th written update Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ప్రకాష్‌కు క్షమాపణ చెప్పిన కావ్య – దుగ్గిరాల ఇంట్లో మారిపోయిన రూల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/09/743c58f5439bfc14a431414c5bd883df1736388580283879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: ప్రకాష్.. తనకు జరిగిన అవమానానికి నిద్ర రావడం లేదని సుభాష్ దగ్గరకు వెళ్లి బాధపడతాడు. కావ్య అవమానం చేయడం వల్ల నా భార్య నాకు రేపటి నుంచి విలువ ఇస్తుందా..? అని అడుగుతాడు. దీంతో నాకు కొంచెం టైం ఇవ్వు నేను కావ్యతో మాట్లాడతానని సుభాష్ చెప్పగానే.. ఇప్పుడు మన దగ్గర లేనిదే టైం అన్నయ్యా అంటూ వెళ్లిపోతాడు ప్రకాష్. లోపలికి వెళ్లిన ప్రకాష్ కు కావ్య ఎదురొస్తుంది. కావ్యను చూసిచూడనట్టు వెళ్లిపోతుంటాడు ప్రకాష్.
కావ్య: నలుగురిలో నేను అలా మాట్లాడటం తప్పే కానీ మనఃస్పూర్తిగా మీరు నన్ను క్షమించండి నేను మీ కూతురి లాంటి దాన్ని.. నిజంగానే మేము చాలా గోల్డ్ తీసేసుకున్నాము చిన్న మామయ్య.
ప్రకాష్: అయినా నిన్ను క్షమించడానికి నేను ఎవరు? ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావు. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేనమ్మా దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో
ధాన్యలక్ష్మీ: సూపర్.. నీ తెలివి తేటలు వేరే లెవెల్. అందరిలో ఆయన్ని అవమానించి ఇప్పుడు చీకట్లో క్షమాపణ అడుగుతున్నావా..?
కావ్య: ఎందుకు అత్తయ్యా ఇలా మారిపోతున్నారు. ఒకప్పుడు అందరిని కాదని నాకు సపోర్టు చేశారు. ఇప్పుడు ఎందుకు నన్ను శత్రువుగా చూస్తున్నారు
ధాన్యలక్ష్మీ: మారింది నేను కాదు నువ్వు ఆస్థులు వచ్చాక నువ్వు మారిపోయావు. నాకు నా మొగుడికి అవమానం చేసి ఇప్పుడు ఇలా మాట్లాడతావా..?
కావ్య బాధపడుతుంది. పైనుంచి అంతా గమనిస్తుంటాడు రాజ్. ఏడుస్తూ పైకి వచ్చిన కావ్యను రాజ్ ఓదారుస్తాడు. రాహుల్, రుద్రాణి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉంటారు.
రుద్రాణి: ఓరే రాహుల్ ఈ ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది
రాహుల్: ఏం ఫీలింగ్ మామ్
రుద్రాణి: ఆకాశం విరిగిపడ్డట్టు.. భూమి బద్దలైనట్టు థ్రిలింగ్ గా ఉంది.
రాహుల్: ఎన్నో ఏళ్ల కలలు ఇప్పుడిప్పుడే కదా నిజమవుతున్నాయి
రుద్రాణి: కరెక్టుగా చెప్పావురా నీలో ప్రవహించే నా రక్తం అప్పుడప్పుడు నాలా ఆలోచించేలా చేస్తుంది. దేవుడు మనల్ని అర్థం చేసుకుని ధాన్యలక్ష్మీ పుట్టింటి వాళ్ల రూపంలో ఒక అవకాశం ఇచ్చాడు.
రాహుల్: అవును మమ్మీ అవమాన పడ్డ ప్రకాష్ అంకుల్ కూడా త్వరలోనే మనతో కలుస్తాడు
రుద్రాణి: ఒక చిన్న నిప్పురవ్వ అడవినే కాల్చేసినట్టు.. ఆ కావ్య చేసిన చిన్న తప్పిదంతో చిచ్చు రగిల్చి ఈ ఇంటినే కాల్చేద్దాం…
అసలు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు మమ్మీ అని రాహుల్ అడగగానే.. వెంటనే నీ పెళ్లానికి సీమంతం చేయాలంటుంది రుద్రాణి. రాహుల్ షాకవుతాడు. మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.
శాంత: అమ్మా ఏం టిఫిన్ చేయమంటారు
రుద్రాణి: ఎవర్ని అడుగుతున్నావే.. ఈ ఇంటికి మహారాణి శ్రీమతి కావ్యాదేవి గారు వెళ్లి చేతులు కట్టుకుని ఆవిడనే అడుగు.
శాంత: కావ్యా మేడం మిమ్మల్నే అడగమన్నారు
రుద్రాణి: ఎందుకు ఇవన్నీ కవ్వింపు చర్యలా.. అయినా నువ్వు చేసేది ఎలాగైనా ఒక్కటే కదా ఏదో ఒకటి చేయ్
శాంత: లేదమ్మా ఇవాళ్టీ నుంచి ఎవరెవరికి ఏం కావాలో అడిగి చేయమన్నారు
రుద్రాణి: ఆవిడ మా మీద దయ చూపి శాసనాలు తిరగరాస్తున్నారా..?
శాంత: మీరు మాట్లాడింది నాకేం అర్థం కాలేదమ్మా..
కావ్య: నాకు అర్థం అయింది.. కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు కండీషన్స్ పెట్టాల్సి వచ్చింది. మా ఆయన చెప్పడం వల్ల.. ఇవాళ్టీ నుంచి రూల్స్ బ్రేక్ చేస్తున్నా…
ధాన్యలక్ష్మీ: ముష్టి వాళ్లకు పడేసినట్టు నాలుగు రకాల కూరలు, నాలుగు రకాల టిఫిన్లు పెడితే నువ్వు చేసిన అవమానాలు అన్ని మర్చిపోతాము అనుకున్నావా..?
అంటూ మాట్లాడుతుండగానే.. పంతులు వస్తాడు. ఎవరు పిలిపించారు అని ఇందిరాదేవి అడిగితే నేనే పిలిపించానని స్వప్నకు సీమంతం చేయాలని చెప్తుంది రుద్రాణి. రుద్రాణి మాటలకు అందరూ షాక్ అవుతారు. ఈ ఇంట్లో టీ, కాఫీలకే దిక్కు లేదు.. ఇక సీమంతం అంటే ఎలా అంటుంది స్వప్న దీంతో స్వప్న ఈ సీమంతం చాలా గ్రాండ్ గా జరిపిస్తాను నువ్వేం వర్రీ అవ్వకు అంటుంది రుద్రాణి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)