Brahmamudi Serial Today January 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం చెప్పిన వీరయ్య – స్పృహ కోల్పోయిన కావ్య
Brahmamudi serial today episode January 7th: కడుపులో బిడ్డ చనిపోవడానికి రుద్రాణికి పసరు ఇచ్చానని వీరయ్య నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: వీరయ్య చేత నిజం చెప్పించాలని కనకం అనకుంటుంది. కానీ రుద్రాణి తనకు ఏ తప్పు తెలియదని.. కనకం కావాలని తన మీద నిందలు వేస్తుందని గొడవ చేస్తుందని చెప్తుంది. రాజ్ కోపంగా చూస్తుంటాడు.
కనకం: ఎందుకు ఇంతకు తెగించిందో మీరే అడగండి ఈవిడగారిని
రుద్రాణి: అబద్దం కనకం చెప్పిందంతా అబద్దం నాకేం సంబందం లేదు.. అసలు వీడెవడో నాకు తెలియదు.. అసలు ఇదంతా కనకం నా మీద చేస్తున్న కుట్ర.
రాజ్: రేయ్ చెప్పరా ఏంటి ఇదంతా
సుభాష్: అలా అడిగితే వాడు చెప్పడు.. రేయ్ కనకం చెప్పింది నిజామేనా.. చెప్పరా
అని కొడుతుంటాడు.
వీరయ్య: అయ్యా నిజం చెప్తానయ్యా..? కనకం అమ్మగారు చెప్పిందంతా నిజమే అయ్యా..? రుద్రాణి అమ్మగారు కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి మందు కావాలి అన్నారు అయ్య.. డబ్బులు కూడా ఇచ్చారు. ఆ మందు నేనే ఇచ్చానయ్యా.. అంతకు మించి నాకేం తెలియదయ్యా.. నన్ను వదిలేయండి అయ్యా
అని పారిపోతాడు. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు..
అపర్ణ: ఇప్పుడేం అంటావు రుద్రాణి.. మాట్లాడవేంటి..?
ఇందిరాదేవి: ఒసేయ్ ఎంత స్వార్థ పరురాలివే నువ్వు .. ఇన్నాళ్లు ఎవరి మీద విరుచుకుపడ్డా.. ఎవరిని నిందించినా.. ఎంత మంది కీడు కోరుకున్నా..? ఏదో ఒకరోజు నువ్వు మారతావని అనుకున్నాను.. ఈ ఇంటి మనుషుల ఔనత్యాన్ని తెలుసుకుంటావని అనుకున్నాను.. కానీ ఈ ఇంటి వంశాకురాన్ని పొట్టన పెట్టుకుంటావని కల్లో కూడా ఊహించలేదు.
సుభాష్: నీకు మా ఇంటికి ఏ సంబంధం లేకపోయినా కేవలం మా నాన్న మాటను గౌరవించి ఈ ఇంటి ఆడబిడ్డ స్థానం ఇచ్చాము.. నిన్ను నీ కొడుకును కూతురును సొంత మనుషుల కన్నా ఎక్కువే చూసుకున్నాం.. మేము బంధాన్ని పెంచుకుంటే.. నువ్వు బాధ్యతను తెంచుకున్నావు మేము నీకు హక్కును కల్పిస్తే నువ్వు దాన్ని అవకాశంగా తీసుకున్నావు..? ఎన్ని కుట్రలు చేసినా సహించాము.. భరించాము కానీ ఈరోజు మా అందరి కళ్లల్లో పొడవాలనుకున్నావు.. చీ నీది ఒక బతుకేనా..?
ఇందిరాదేవి: ఎప్పుడో మా బావ ఇచ్చిన మాట కోసం నిన్ను దిక్కు లేని దాన్ని చేయకూడదని.. నిన్ను అనాథలా చూడకూడదని నా బిడ్డలతో పాటు నిన్ను కూతురు అనుకున్నానే.. అందరిలాగే నువ్వు కూడా ఈ ఇంటి వైభవాన్ని అనుభవించాలి అనుకున్నాను.. కానీ నీలో మనిషి చచ్చిపోయి ఇంతటి మృగం బయటకు వస్తుంది అనుకోలేదు.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.
కావ్య: రుద్రాణి గారు ఎందుకు మీకు ఇంత భయంకరమైన ఆలోచన వచ్చింది మీకు.. ఏం ద్రోహం చేశామని ఇంత విషం కక్కాలి అనుకున్నారు.. ఈ బిడ్డను తొమ్మిది నెలలు మోయడానికి నేను ఏ తల్లి పడన కష్టాలు పడ్డాను.. ఈ ఇంటికి వారసత్వాన్ని ఇవ్వడానికి ఎవ్వరూ దాటని గండాలను దాటాను.. నా బిడ్డకు ఈ ప్రపంచాన్ని చూపించడానికి ఆ మృత్యువుతోనే పోరాటం చేశాను కదా.. అలాంటిది కడుపులోని పిండాన్ని తుడిచేయాలని ఎలా అనిపించింది మీకు.
రాజ్: అత్తయ్యా నిన్ను ఏనాడు మేనత్త అనుకోలేదు.. నా తల్లి తర్వాత తల్లి అనుకున్నాను.. నీ కొడుకు రాహుల్ ను నా తమ్ముడే అనుకున్నాను.. నీ కొడుకు చెడిపోతుంటే.. రాహుల్ ను నిలబెట్టమని చెప్పింది అత్తయ్యా నా కళావతి. అలాంటి కళావతి కడుపు పోగొట్టాలని ఎలా అనుకున్నావు అత్తయ్య..
అపర్ణ: రేయ్ రాజ్ దాన్ని ఎందుకురా ఇంకా అత్తయ్యా అని పిలుస్తున్నావు.. అలా పిలిపించుకునే అర్హత అది ఎప్పుడో కోల్పోయింది. నా కోడలి మీద కక్ష కట్టినప్పుడే దీంతో బందం తెగిపోయింది. నా వారసుడిని నలిపేయాలని చూసినప్పుడే అది ఈ ఇంటి దృష్టిలో చచ్చిపోయింది. దీన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు..
రుద్రాణి: వదిన ఏదో క్షణికావేశంతో స్వార్తంతో తెలియని తనంతో చేశాను వదిన.. నన్ను క్షమించు వదిన.. రాజ్ నన్ను క్షమించు.. రాజ్
రాహుల్: మమ్మీ నువ్వు మాట్లాడకు.. గుండెల్లో గుణపాలు దింపి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా..?
అంటుండగానే.. ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని ఇంట్లోంచి గెంటేస్తుంది. అప్పుడే కావ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. ఏ ప్రాబ్లమ్ లేదని చెప్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ రాహుల్ ను తిడుతుంది. తల్లీకొడుకు ఇద్దరూ ఒకే అంటుంది. స్వప్న రాహుల్ అలాంటి వాడు కాదని మారిపోయాడని సమర్థిస్తుంది. తర్వాత రాహుల్, రేఖ వెళ్లి రుద్రాణిని కలుస్తారు. తమ పగ నెరవేరాలంటే ఇద్దరూ ఆ ఇంట్లోనే ఉండాలని చెప్తుంది రుద్రాణి. సరే అంటారు రాహుల్, రేఖ. కావ్య ఏడుస్తుంటే.. రాజ్ ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















