Brahmamudi Serial Today January 31st - ‘బ్రహ్మముడి’ సీరియల్ : రెస్టారెంట్ లో కళ్యాణ్, అనామికల రొమాన్స్ – గుండెలు పగిలేలా బాధపడ్డ కావ్య
Brahmamudi Today Episode: నిజాన్ని కళ్లతో చూసిన కావ్య గుండెలు పగిలేలా బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఆఫీసుకు వచ్చిన కావ్యను చూసి రాజ్ జెలసీగా ఫీలవుతుంటాడు. తను ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పకుండా టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో కావ్య తాను ఆఫీసుకు ఎందుకు వచ్చానో.. చెప్తుంది. రాజ్ ఏం చేస్తున్నారో.. ఏం చేయబోతున్నారో అన్ని తేల్చుకోవడానికే వచ్చానని కావ్య చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు.
రాజ్: నువ్వు మాట్లాడేది దేని గురించి..?
కావ్య: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి.. అదే ఇంతకు ముందు ఏం డిజైన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇకముందు ఎం చేయబోతున్నారో అవి తెలసుకోవడమే నా డ్యూటీ.
రాజ్: మంచిది.. ఇంటి దగ్గర టిఫిన్ తినేశావు కదా..? బయటకు వెళ్లి స్రేయిట్‌గా వెళ్లి లెఫ్ట్‌కు వెళితే అక్కడో కిచెన్ ఉంటుంది.
కావ్య: ఉంటే...?
రాజ్: వెళ్లి టీ పెట్టు..
అనగానే హలో సార్ నేను అటెండర్ కాదు డిజైనర్‌ను అనగానే రాజ్ ఇరిటేటింగ్‌గా నిన్ను తగిలించిందేంటే మా అమ్మా అనగానే స్టాఫ్‌తో గౌరవంగా మాట్లాడటం నేర్చుకో అంటుంది. దీంతో శృతిని పిలిచి కావ్యకు సీటు చూపించి పని చెప్పమనగానే కావ్య వెళ్లిపోతుంది. వెంటనే రాజ్ కోపంగా సుభాష్‌కు ఫోన్ చేసి కావ్యకు జాబ్ ఎందుకిచ్చావని ఫీలవుతాడు.
మరోవైపు అప్పు డెలివరీ ఇవ్వకుండా ఇంటికి వచ్చి పడుకోవడంతో వాళ్ల ఓనరు ఫోన్ చేస్తాడు. పదినిమిషాల్లో వస్తానని వెళ్లావు..రెండు గంటలవుతుంది ఇంకా రాలేదేంటి అంటాడు. సారీ సార్ తప్పైంది అనగానే నీకిదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. దీంతో అప్పు బెడ్‌రూంలోంచి పరుగెత్తుకొచ్చి బయటకు వెళ్లబోతుంటే కనకం ఆపి భోజనం చేయమని చెప్తుంది. నన్ను ఎందుకు నిద్ర లేపలేదు అని తిట్టి వెళ్లిపోతుంది. మూర్తి, కనకం అప్పు జీవితం గురించి ఆలోచిస్తారు. మరోవైపు కళ్యాణ్, అనామిక రెస్టారెంట్‌కు వెళ్తారు. అనామిక మూడ్ ఆఫ్‌గా ఉంటుంది.
కళ్యాణ్: మూడ్ మారుతుందని బయటకు తీసుకొస్తే ఇక్కడ కూడా అలాగే ఉంటావా?
అనామిక: మరేం చేయాలి.. నువ్వు చేస్తున్న పనికి నిన్ను ఎత్తుకుని అందరి ముందు ముద్దు పెట్టాలా?
కళ్యాణ్: వినడానికి బాగుంది అమ్మాయి.
అనామిక: ఏంటి?
కళ్యాణ్: అదే ఎప్పుడూ అబ్బాయిలే ఎత్తుకుని ముద్దు పెడతారు. డిఫరెంట్‌గా నువ్వు ఎత్తుకుని ముద్దు పెడతా అంటున్నావు కదా చాలా ఎగ్జైంటింగ్‌గా ఉంది.
అనామిక: నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను అబ్బాయి.
కళ్యాణ్: నేను సిన్సియర్ గా చెప్తాను.. ఏంటో చెప్పు అమ్మాయి..
అనామిక: నువ్వు కూడా బావగారిలా ఆఫీసుకు వెళ్లొచ్చు కదా..
కళ్యాణ్: నువ్వు నన్ను ఇష్టపడింది నా కవితలు చూసి కదా
అనగానే కొంచెం తడబడుతూ అనామిక అవును అంటుంది. మీ ఆస్థిని చూసి చేసుకున్నాను అనుకున్నావా? ఎంటి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో మరి ఇప్పుడెందుకు మారిపోతున్నావు అంటూ కల్యాణ్ ప్రశ్నిస్తాడు. నాకు ఇలా ఉండటమే ఇష్టం అని చెప్తాడు. ఇంతలో ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్ తింటుంటే అక్కడికి అప్పు వస్తుంది. కల్యాణ్, అనామిక వచ్చింది కూడా అప్పు పనిచేసే రెస్టారెంట్‌కే.
అప్పును గమనించిన అనామిక కల్యాణ్‌కు ఐస్‌క్రీమ్ తినిపిస్తుంది దీన్ని దూరం నుంచి గమనిస్తుంది అప్పు. కల్యాణ్, అనామికను చూసిన అప్పు బాధపడుతుంది. మరోవైపు శృతి, కావ్యల దగ్గరకు రాజ్ వచ్చి నేను చెప్పినట్టు కాకుండా వేరేలా డిజైన్స్ ఎందుకు వేశారని తిట్టి డిజైన్స్ మార్చమని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో శ్వేత, రాజ్‌కు కాల్ చేస్తుంది. అరవింద్ వచ్చాడని చాలా భయంగా ఉందని చెప్పడంతో రాజ్ నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ వెళ్లిపోతాడు. కావ్య కూడా రాజ్‌ను ఫాలో అవుతుంది.
మరోవైపు శ్వేత భర్త అరవింద్ ఎంట్రీ ఇస్తాడు. శ్వేతను కొట్టి సైకోలా సారీ చెప్తాడు. శ్వేతను బెదిరించి ఆస్థి నా పేరుమీద రాయి అంటే రాయవు.. అంటూ కొడుతుంటాడు.. రాజ్ వచ్చి అరవింద్‌ను కొడతాడు. దీంతో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగానే ఉంది అంటూ అనుమానిస్తాడు. మీరు అక్రమ సంబంధం పెట్టుకుని నాకు విడాకులు ఇస్తున్నావు కదూ అంటూ అరవింద్ అనగానే రాజ్ కోపంగా అరవింద్‌కు వార్నింగ్ ఇస్తాడు. అరవింద్ వెళ్లిపోతాడు. శ్వేత ఏడుస్తుంటే.. రాజ్ ఓదారుస్తుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. కిటికీలోంచి శ్వేత, రాజ్‌ను చూసి షాక్ అవుతుంది. తను అనుమానించింది నిజమేనని బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రభాస్ సినిమాలో ఎన్‌టీఆర్, నాని? తెరలు చిరుగుతాయేమో!