Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఆస్తులు పంచమన్న ధాన్యలక్ష్మీ – నిజం చెప్పమన్న అపర్ణ
Brahmamudi Today Episode: ఇంట్లో వాళ్లకు నిజం చెప్తే అయిపోతుంది కదా అంటాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఆస్తులు పంచమన్న ధాన్యలక్ష్మీ – నిజం చెప్పమన్న అపర్ణ brahmamudi serial today episode January 18th written update Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఆస్తులు పంచమన్న ధాన్యలక్ష్మీ – నిజం చెప్పమన్న అపర్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/18/4eaeb2feca6b359af0308d1301f3485a1737164132241879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి.. కోపంగా అది కంపు నోరు వేసుకుని అంతలా మాట్లాడుతుంటే నువ్వేమి అనవు రాజ్ అంటుంది. దీంతో రాజ్ కోపంగా రుద్రాణిని పై విరుచుకుపడతాడు. నలుగురు కలిసి నవ్వుకోవడం ఇంటిల్లి పాది సంతోషంగా ఉండటం నీకు గిట్టదు. నువ్వు నీ కొడుకు పనిగట్టుకుని ఏదో పరిశోధించినట్టు నిలదీస్తుంటే.. అసలు నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు అంటూ రాజ్ తిడుతుంటే..
ధాన్యలక్ష్మీ: రుద్రాణి గొడవ పుట్టిస్తుంది సరే ఎలాగూ ఆ నిజం బయట పెట్టింది కదా రాజ్.. అంటే మన కంపెనీ అకౌంట్స్ లో కనీసం ఐదు లక్షలు కూడా లేవా..? హాస్పిటల్ బిల్లు కట్టడానికి నగలు తాకట్టు పెట్టేంట దుస్తితిలో ఉన్నామా..? అది తేలాలి ముందు.
అపర్ణ: ఏం తేలాలి చెప్పు.. అకౌంట్ విషయమా..? ఎక్కడ తేలాలి.. నగలు తాకట్టు పెట్టిన విషయమా..? రుద్రానికి నీకు పెద్ద తేడా లేదని నువ్వు కూడా ఈ మధ్య ఫ్రూవ్ చేసుకుంటుంన్నావు. కానీ రుద్రాణి కనిపెట్టిన అద్బుతమైన విషయానికి నేను సమాధానం చెప్తాను. నేను చెప్తేనే కావ్య నగలు తాకట్టు పెట్టింది.
రుద్రాణి: ఏంటి వదిన నువ్వు అయిదు లక్షల కోసం నీ కోడలి చేత నగలు తాకట్టు పెట్టించావా..?
అపర్ణ: అవును నేనే తాకట్టు పెట్టించాను.
ఇందిర: ఎందుకు అపర్ణ నీకు తెలిసి ఇదంతా జరిగిందా..? నగలు తాకట్టు పెట్టించాల్సిన కష్టం ఏమోచ్చింది
అపర్ణ: కష్టం కాదు అత్తయ్యా.. అవసరం వచ్చింది కంపెనీ అకౌంట్లు అన్ని హోల్డ్ లో పెట్టారని రాజ్ చెప్పగానే.. హాస్పిటల్ బిల్లు కట్టకపోతే పరువు పోతుందని నేనే నగలు తాకట్టు పెట్టించి బిల్లు కట్టించాను.
రుద్రాణి: చాకచక్యంగా నువ్వు నీ కొడుకు కోడల్ని దోషుల్ని చేయకుండా కాపాడుతున్నావని అర్థం అయిపోయిందిలే వదిన
అపర్ణ: అవునా అయితే ఏంటి ఇప్పుడు.. నీకు చేతనైతే ఫ్రూవ్ చేయ్.. అసలు నువ్వు ఏ హక్కుతో మమ్మల్ని నిలదీస్తున్నావు. నువ్వెంత నీ లెక్కెంత.. నీ బతుకెంత.. ఈడ్చి తంగే నడిరోడ్డు మీద పడే బతుకే నీది
అపర్ణ తిట్టడంతో రుద్రాణి, రాహుల్ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. మూర్తి వెళ్లోద్దని బతిమాలుతాడు. పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి, నాన్నమ్మ .. కనీసం భోజనం చేసైనా వెళ్లండి అంటాడు అయినా వినకుండా వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక కావ్యను అపర్ణ నిలదీస్తుంది.
అపర్ణ: కావ్య నగలు ఎందుకు తాకట్టు పెట్టారు. అసలు ఏం జరుగుతుందో చెప్పు.. ఎందుకొచ్చింది ఈ పరిస్తితి ఎందుకొచ్చింది ఈ దుస్థితి
ఇందిరాదేవి: అపర్ణ ఆవేశపడొద్దు.. నీ ముందు ఉన్నది రుద్రాణి కాదు కావ్య. కావ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. మంచే చేస్తుంది
అపర్ణ: అయ్యో అత్తయ్యా నేను ఇప్పుడు కావ్య వ్యక్తిత్వాన్ని అనుమానించి అడగడం లేదు
కావ్య: అత్తయ్యా మీరు నా వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నారా..? నేను ఈ బాధ్యతలు మోయలేను అన్న రోజు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మీరే ఇలా నిలదీస్తారా..? దారి చూపించిన మీరే ఆ దారి మూసేస్తే నాకు ఇంకో దారి లేదు నన్ను క్షమించండి.
అపర్ణ: నా మీదే నేరం మోపి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతే నీకేమీ తెలియదని ఊరుకుంటాను అనుకుంటున్నావా..? నా మాటకు విలువ ఇవ్వని మనిషితో నాకు మాటలు అనవసరం.. ఇంకెప్పుడు నాతో నువ్వు మాట్లాడకు..
అంటూ వెళ్లిపోతుంది అపర్ణ. తర్వాత రూంలో కూర్చు్న్న రాజ్, కావ్య ఆలోచిస్తుంటారు. ఈ అనుమానాలకు అంతే లేదా..? ఈ అవమానాలకు ముగింపే లేదా అంటుంది కావ్య. అయితే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేద్దామంటాడు రాజ్. నిజం చెప్తే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో కావ్య చెప్తుంది. కావ్య చెప్పడం ఊహించుకున్న రాజ్ షాక్ అవుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటూ కావ్యను అడుగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)