Brahmamudi Serial Today January 16Th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను టార్గెట్ చేసిన అనామిక, రాజ్‌ను పూల్ చేసిన కావ్య
Brahmamudi Today Episode: కళ్యాణ్ శోభనం విషయంలో దూరంగా ఉండమని ధాన్యలక్మీ, కావ్యకు చెప్తుంది. అయినా కావ్య రూం డెకరేట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: స్వప్న పాయసం కావాలని వెంటనే తీసుకుని రమ్మని రుద్రాణికి ఆర్డర్ వేస్తుంది. రుద్రాణి చేయనని చెప్పడంతో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేసి మీరు నన్ను హరాస్‌మెంట్ చేస్తున్నారని కంప్లైంట్ చేస్తానని స్వప్న బెదిరిస్తుంది. దీంతో రుద్రాణి సరేనని పాయసం తీసుకొస్తానని బయటకు వచ్చి గొడకేసి తల బాదుకుంటుంది. ఇంతలో అక్కడకు రాహుల్ వచ్చి ..
రాహుల్: మామ్ ఎందుకు అంత గట్టిగా పిలిచింది.
రుద్రాణి: దాన్ని పిచ్చి కుక్క కరిచింది. నీకు వినబడిందా? మరెందుకు రాలేదు..
రాహుల్: నువ్వెల్లావు కదా అని
రుద్రాణి : అది చెప్పింది చేయకపోతే కేసు పెడుతుందట.
రాహుల్ : చెప్పింది చేయకపోతేనే కదా నువ్వు చేస్తున్నావు కదా
అంటూ చెప్పి వెళ్లిపోతాడు.. మరోవైపు ధాన్యలక్ష్మీ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కావ్య ఒక దగ్గర నిలబడి బాధపడుతుంటే..రాజ్ వచ్చి శోభనం గది ఎందుకు డెకరేట్ చేయడం లేదని అడుగుతాడు. ఇంతలో అనామిక వచ్చి నాకు సంబంధించిన పని కదా అందుకే చేయడం లేదంటుంది. దీంతో అలాంటిదేం లేదని చెప్పి కావ్య అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నా మీద కావ్యకు కోపం ఎప్పుడు తగ్గుతుందో అని అనామిక అనుకుంటూ వెళ్లిపోతుంది. కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు కళ్యాణ్ వస్తాడు. ఏడుస్తున్న కావ్యను చూసి
కళ్యాణ్: వదిన
కావ్య: ఏంటి? కవి గారు రెడీ అవ్వకుండా కిచెన్‌లోకి వచ్చారు. ఏమైనా కావాలా?
కళ్యాణ్: మీకోసమే వచ్చాను వదిన
కావ్య: ఇప్పుడు నేనేం చేయగలను.. నాకు చాలా పనుంది. ఏదైనా పనుంటే వెళ్లి మీ అన్నయ్యకు చెప్పండి.
అనగానే మీరు కూడా ఇలా మారిపోతే ఎలా వదిన అంటూ కళ్యాణ్ బాధపడతాడు. ఎవరో ఏదో అన్నారని మీరు మూఢనమ్మకాలను నమ్ముతారా? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య కన్వీన్స్ అవుతుంది. బెడ్ రూంలో డెకరేట్ చేయడానికి ఒప్పుకుంటుంది. రాజ్ రూంలో వర్క్ చేసుకుంటుంటాడు. కావ్య వెళ్లి కళ్యాణ్ రూం డెకరేట్ చేద్దాం రండి అని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి రూం డెకరేట్ చేయడానికి వెళ్తారు. అక్కడ డెకరేట్ చేస్తున్న వ్యక్తిని కావ్య మా ఆయన వచ్చాడు ఇక నువ్వు వెళ్లు అని పంపిస్తుంది.
రాజ్: ఏయ్ పనివాడికి నాకు తేడా లేదా?
కావ్య: అయ్యోరామా..! డెకరేట్ చేయడానికి మీ బదులు ఇంకొకాయన వచ్చారని చెప్పానండి.
రాజ్: నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు తెలుసా?
కావ్య: నాకే అంత తెలివితేటలు ఉంటే నా శోభనం స్టోర్ రూంలో ఎందుకు జరిగేది.
అంటూ ఇద్దరూ కామెడీగా మాట్లాడుకుంటూ రూం డెకరేట్ చేస్తారు. మరోవైపు రుద్రాణి రిలీఫ్‌గా పడుకోబోతుంటే స్వప్న ఫోన్ చేసి.. అనామికను శోభనం గదిలోకి పంపించాలంటా త్వరగా రెడీ అయ్యి రమ్మని..వచ్చేటప్పుడు తనకు కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకురావాలని ఆర్డర్ వేస్తుంది. దీంతో రుద్రాణి స్వప్నను తిట్టుకుంటూ బాధపడుతుంది. మరోవైపు అందరూ కలిసి అనామికను రూం దగ్గరకు తీసుకొచ్చి లోపలికి తోసేసి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతారు.
అనామిక: ఈ తోసేయడం ఏంటో అర్థం కాదు. ఎన్ని సినిమాలు చూసినా కూడా అర్థం కాలేదు. ఎంటి చూస్తున్నారు. డోర్ వేయండి.. నాకు పాలంటే ఇష్టం లేదు. సగం తాగేంత సీను లేదు. నువ్వు తాగుతావా? ఎంటి కావాలా? వద్దా?
కళ్యాణ్: పెద్దవాళ్ల సెంటిమెంటుని ఎందుకు కాదనడం కొంచెం కొంచెం తాగుదాం.
అనామిక: నేనేతై తాగను బాబు నువ్వు తాగితే తాగు. నాకు పాల వాసన అంటేనే వాంప్టింగ్ వస్తుంది. నువ్వు తాగు..
అంటూ కళ్యాణ్‌కు ఇవ్వగానే పాలు తాగుతాడు కళ్యాణ్. తర్వాత పూల గురించి కవిత్యం చెబుతుంటే అనామిక ఆపి ఈ కవితలు కాకుండా వేరే ఏదైనా మాట్లాడు అంటుంది. అయితే ఈ రూం ఎవరు డెకరేట్ చేశారో తెలుసా అని అడుగుతాడు కళ్యాణ్. ఎవరని అనామిక అడుగుతుంది. మా కావ్య వదిన అని కళ్యాణ్ చెప్పగానే అనామిక సీరియస్‌గా చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: అయోధ్య రామమందిరానికి దగ్గర్లో భూమి కొన్న అమితాబ్ - త్వరలో సొంత ఇంటి నిర్మాణం, ఎన్ని కోట్లంటే?