Brahmamudi Serial Today December 17th:‘బ్రహ్మముడి’ సీరియల్: ప్రకాష్‌కు దొరికిపోయిన అప్పు – అయోమయంలో సుభాష్
Brahmamudi serial today episode December 17th: అర్ధరాత్రి స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అప్పు, ప్రకాష్ కు దొరికిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాహుల్‌ను స్టేజీ మీద కొట్టాలన్నంత కోపంగా వెళ్తున్న రాజ్‌కు ఎదురుగా స్వప్న వస్తుంది. స్వప్ను చూసి రాజ్ ఆగిపోతాడు.
స్వప్న: మీరే లేకపోతే ఇవాళ రాహుల్ ఇలా ఉండేవాడు కాదు. థాంక్యూ కావ్య, రాజ్..
అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.
కావ్య: చూశారా మా అక్క ఎంత సంతోషంగా ఉంది. రాహుల్ తప్పు చేస్తున్నాడని మా అక్కకు తెలియదు. రాహుల్ చాలా కష్టపడుతున్నాడని ఆ కష్టంతోనే తన భర్తకు గౌరవం దక్కుతుందని ఆనంద పడుతుంది. ఇప్పుడు మీరు వెళ్లి మా అక్క ఆనందాన్ని ఆవిరి చేస్తారా…
అంటూ కావ్య ప్రశ్నించగానే.. రాజ్ ఆగిపోతాడు. కట్ చేస్తే అప్పుడే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుంది అప్పు. హాల్లో ఎవ్వరూ లేకపోయే సరికి హమ్మయ్య అనుకుంటూ తమ రూంలోకి వెళ్లబోతుంటే.. ప్రకాష్ ఎదురుగా వస్తాడు.
అప్పు: మామయ్య మీరా..?
ప్రకాష్: ఏమోనమ్మా నేనేనా..? మామయ్యనేనా..? నువ్వు గుర్తు చేశావు కదా గుర్తొచ్చింది
అప్పు: జోక్ బాగుంది మామయ్య
ప్రకాష్: ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అమ్మ..
అప్పు: మీ అబ్బాయి ఇంకులో పెన్ను అయిపోయిందంట… చచ అది కాదు.. పెన్నులో ఇంకు అయిపోయిందంట అది కొనుక్కుని రావడానకి వెళ్లాను మామయ్య.. కరెక్టుగానే చెప్పాను కదా కన్వీన్స్ గా లేదా మామయ్య..
ప్రకాష్: ఇది వర్కవుట్ కాలేదు కానీ.. ఇంకేదైనా చెప్పమ్మా..
అప్పు: చల్లగాలికి బయటకు వెళ్లాను మామయ్య..
అప్పుడే అక్కడకు కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్: పొట్టి ఇంకా లాగకు నాన్నకు అంతా తెలిసిపోయింది
అప్పు: తెలిసిపోయిందా… ఎలా మామయ్య
ప్రకాష్: అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుందా..?
అప్పు: అంటే అది మామయ్య ఒక కేసు అర్జెంట్ అవసరం ఉండి డీల్ చేయాల్సి వచ్చింది
ప్రకాష్: అదే సమస్య అసలు నీవు పోలీస్ జాబే చేయకూడదని మీ అత్తయ్య చెప్తుంది. ఇప్పుడేమో నువ్వు ఉన్న కండీషన్‌లో మీ నాటకం మీ అమ్మకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి
కళ్యాణ్: అయ్యో ఊహించుకోవడమే కష్టంగా ఉంది నాన్న.. ఇంకా చెప్పకు
అనగానే.. ప్రకాష్ కోపంగా కళ్యాణ్, అప్పులను తిడతాడు. కళ్యాణ్, అప్పు సైలెంట్‌గా పైకి వెళ్లిపోతారు. తర్వాత ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలు రాహుల్ చేసిన నిర్వాక గురించి అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ లకు చెప్తుంది.
సుభాష్: మీరు కేరళ నుంచి ఇంటికి రాగానే రాహుల్ చేసిన పని గురించి చెప్పాలనుకున్నాం. కానీ మీరు ఫంక్షన్‌కు వెళ్లాక తెలుస్తుంది అనుకున్నాం. కానీ మీరు అక్కడికి వెళ్లి వాడికి సత్కారం చేసి వచ్చారా..?
అపర్ణ: మీ నాన్నను నమ్మించి గొంతు కోశాడు. మన కంపెనీకి కోట్లలో నష్టం వచ్చేలా చేశాడు. అలాంటి రాహుల్‌ను ఇంకా నమ్మాలనుకుంటుంన్నావా..?
రాజ్: లేదు అమ్మా వంద మందిలో వాడిని నిలదీద్దాం అని అనుకున్నాను కానీ అప్పుడే స్వప్న అడ్డు పడింది.
సుభాష్: అంటే ఈ విషయం స్వప్నకు కూడా తెలుసా..?
రాజ్: స్వప్నకు తెలిస్తే స్వప్నే గడ్డి పెట్టేది. కానీ రాహుల్‌ను అమాయకంగా నమ్ముతుంది. రాహుల్ చాలా కష్టపడి పైకి వస్తున్నాడని ఊహించుకుంటుంది. వాడో గొప్ప క్రియేటర్ అని అపోహ పడుతుంది.
అపర్ణ: అసలు ఏం అంటున్నావురా… స్వప్నకు తెలియకుండా అడ్డుపడటం ఏంటి.?
రాజ్: అవునమ్మా స్వప్నకు అసలు నిజం తెలియదు.. ఇప్పుడు ఇదంతా అబద్దం అని ఆ డిజైన్స్ రాహుల్ వి కాదు.. అవి నా కంపెనీ నుంచి దొంగిలించాడని స్వప్నకు తెలిస్తే.. రాహుల్‌ను మళ్లీ కన్నెత్తి కూడా చూడదు.. అందుకే స్వప్నకు తన భర్త మీద ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆగిపోయాను.
అని చెప్పగానే.. అయితే ఈ సమస్యకు వెంటనే ఏదో పరిష్కారం ఆలోచించాలి లేదంటే వాడిని అలాగే వదిలేస్తే మనం డేంజర్‌లో పడిపోతాం అని చెప్తారు అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్. సరే అంటారు రాజ్, కావ్య. మరోవైపు ఇంటికి వచ్చిన రాహుల్‌ను రుద్రాణి మెచ్చుకుంటుంది. తర్వాత రోజు తమ ఆఫీసులో నుంచి డిజైన్స్ ఎవరు దొంగిలించారో తెలుసుకుంటారు రాజ్, కావ్య. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















