Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను తిట్టిన యామిని – కావ్యతోనే జీవితం అన్న రాజ్
Brahmamudi serial today episode August 9th: కావ్య నిన్ను మోసం చేస్తుందని యామిని చెప్పినా రాజ్ నమ్మడు దీంతో యామిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.

Brahmamudi Serial Today Episode: కావ్య మీద రాజ్‌కు కోపం వచ్చేలా చేయాలని యామిని అనుకుంటుంది. ఎలాగైనా రాజ్ దృష్టిలో కావ్య తప్పు చేస్తుందని నిరూపించాలనకుంటుంది.
యామిని: నీకోసం ప్రాణాలు తీసుకోవడానికి రెడీ అయిన మా బావను ఎందుకు రిజెక్ట్ చేశావు కావ్య. ఒక్క కారణం చెప్పు.. అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి సాల్వ్ చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. మా బావ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. చెప్పు కళావతి మా బావను వద్దు అనడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి.? ఆ దేవుడి దయ వల్ల మా బావకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా అయ్యుండి తన ప్రాణాలు పోయి ఉంటే..
అని అటుండగానే కావ్య స్పీడుగా వచ్చి యామిని కొడుతుంది.
కావ్య: ఇంకొక్కసారి ఆయన గురించి పిచ్చి వాగుడు వాగావంటే చంపేస్తాను. ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి.. సంతోషంగా ఉండాలి. దానికోసం నా జీవితాన్ని పణంగా పెట్టడానికి నేను సిద్దంగా ఉంటాను
యామిని: ఓహో మా బావ ప్రాణానికి అంత విలువ ఇచ్చేదానివే అయితే మరి తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు. తను నీతో కలిసి ఏడడుగులు నడవాలనుకుంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. చూశావా బావ నీ మీద ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది. కానీ ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే మాత్రం తన దగ్గర సమాధానం లేదు. ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా..? బావ. ఈ కళావతి నిన్ను మోసం చేస్తుంది. కావాలనే నీతో ఎమోషనల్‌గా ఆడుకోవాలని చూసింది. నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసి తన వెంట తిప్పుకోవాలని చూసింది. ఇప్పుడు పెళ్లి అనే సరికి ముఖం చాటేస్తుంది. ఈ కళావతి ఒప్పుకుంటుందని ఇంకా నమ్మకం ఉందా బావ
రాజ్: తన మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం ప్రయాణించాను. నన్ను వద్దు అనడానికి కళావతి వద్ద ఏ కారణాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేను. వీళ్ల మీద కోపంతో నీతో రాలేను. కళావతి గారు వద్దు అన్నంత మాత్రాన ఈ కుటుంబాన్ని ఎలా వదిలేస్తాను..
యామిని: అది కాదు బావ
రాజ్: యామిని అమ్మతో కాసేపు మాట్లాడి వస్తాను నువ్వు వెళ్లు
రుద్రాణి: రాజ్, యామినిని ఇంకా బాధపెట్టకు.. నీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా..? మేమంతా ఇక్కడే ఉంటాము కదా…? నువ్వు ఎప్పుడైనా రావొచ్చు రామ్
ఇందిరాదేవి: తను ఇక్కడే ఉంటానంటే మధ్యలో నువ్వేంటి.. అమ్మా యామిని మీ బావను మేము ఏమీ చేయము రాత్రికి ఇంటికి వస్తాడు వెళ్లు..
అని చెప్పగానే యామిని వెళ్లిపోతుంది. వెనకాలే వెళ్లిన కావ్య యామినికి వార్నింగ్ ఇస్తుంది. త్వరలోనే రాజ్‌కు నిజం చెప్తానని నిజం తెలిశాక నీ పరిస్తితి ఏంటని అడుగుతుంది. నువ్వు నిజం చెప్పే వరకు నేను చూస్తూ ఊరుకోనని నాకు దక్కని బావను ఎవ్వరికీ దక్కనివ్వను అంటూ వెళ్లిపోతుంది. మరోవైపు రేవతి ఎమోషనల్ అవుతుంది. జగదీస్ రేవతిని ఓదారుస్తాడు. ఇక రాజ్ ను అపర్ణ ఇందిరాదేవి తిడుతుంటారు. రాజ్ సారీ చెప్పి వెల్లిపోతుంటే కావ్య వస్తుంది. కావ్యను చూస్తూ వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లగానే యామిని కోపంగా కావ్యను తిడుతుంది. రాజ్ కావ్యను వెనకేసుకొస్తాడు. ఏదో బలమైన కారణం ఉంది కాబట్టే కావ్య అలా చేసిందని చెప్తాడు రాజ్. తర్వాతి రోజు కావ్య హాస్పిటల్‌కు వెళ్తుంది. రాజ్ ఫాలో చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















