Brahmamudi Serial Today August 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పెళ్లిమండపంలోంచి అప్పు ఎస్కేప్ – అదిరిపోయే రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిన అనామిక
Brahmamudi Today Episode: పెళ్లి మండపంలోంచి అప్పు కనిపించకుండా పోవడంతో ధాన్యలక్మీని కావ్యను అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అప్పు, కళ్యాణ్ లకు సీక్రెట్‌గా పెళ్లి చేయాలని రాజ్ ప్లాన్ చేస్తాడు. అందుకోసం అప్పును తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే రాజ్ ప్లాన్ పసిగట్టిన కావ్య అప్పులా వేషం వేసుకుని ముసుగు కప్పుకుని కారు ఎక్కుతుంది. నీకు కళ్యాణ్‌కు గుడిలో పెళ్లి జరిపిస్తానని రాజ్ అనడంతో ఒకసారి పెళ్లైన వాళ్లకు మళ్లీ పెళ్లి జరిపించడం ఏంటి? అని అడుగుతుంది కావ్య. ఎవరికి పెళ్లైంది అంటూ రాజ్ కోపంగా అంటాడు. నీకు నాకు అని కావ్య సమాధానం చెబుతుంది. కోపంగా రాజ్ వెనక్కి తిరిగిచూస్తాడు. అప్పు ప్లేస్‌లో కావ్య ఉండటం చూసి రాజ్ షాక్ అవుతాడు.
రాజ్: ఏయ్ అప్పు ఏది? ఎక్కడుంది.?
కావ్య: పెళ్లి మంటపంలో ఉంది.
రాజ్: మీ ఫ్యామిలీకి ఈ ముసుగు కాన్సెప్ట్ బాగా కలిసివచ్చినట్లుంది. ఏదో ఒకరోజు నీకు ముసుగు వేసి కర్ర తీసుకొని వీపు వాచిపోయేలా కొడతాను.
రాజ్: ఇప్పుడు అప్పు, కళ్యాణ్‌లను ఎలా కలపాలి.
కావ్య: మీరు అక్షింతలు వేయడం తప్ప ఏం చేయలేరు. అప్పు పెళ్లిని కళ్లారా చూడాలి. కారును వెనక్కి తిప్పి కళ్యాణ మంటపానికి పోనివ్వండి.
అనగానే రాజ్ కారు యూటర్న్ తీసుకుంటాడు. రాజ్, కావ్య కనిపించకపోవడంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి టెన్షన్ పడుతుంటారు.
పెళ్లికొడుకు శ్రీరామ్ వచ్చి పీఠలపై కూర్చుకుంటాడు. అప్పును తీసుకురావడానికి స్వప్న పెళ్లి కూతురు రూమ్‌కు వెళుతుంది. కానీ అక్కడ అప్పు కనిపించకపోవడంతో స్వప్న కంగారుగా పరుగెత్తుకొచ్చి అప్పు రూంలో లేదని చెప్తుంది. అప్పు మిస్సింగ్ వెనుక రాజ్ ఉన్నాడనుకొని కావ్య అనుమానపడుతుంది.
కావ్య: ఏవండి నిజం చెప్పండి అప్పు ఎక్కడికి వెళ్లిందండి.
రాజ్: నేను నీతోనే ఉన్నానుగా...నాకేం తెలుసు
రుద్రాణి: ధాన్యలక్ష్మీ.. అప్పు కనిపించడం లేదంటే నీకు కోడలు అయినట్లే అక్కడ నీ కొడుకు కూడా జంప్ అని సెక్యూరిటీ చెప్పాడు.
అని రుద్రాణి, ధాన్యలక్మీని రెచ్చగొడుతుంది. అప్పును వెతకడానికి రాజ్, కావ్య కలిసి వెళ్లబోతుండగా ధాన్యలక్ష్మీ, కావ్యను తిడుతుంది. ధాన్యలక్ష్మీని రాజ్ తిడతాడు. కావ్య మా ఇంటి పరువు పోయే పని ప్రాణం పోయిన చేయదని కనకం ఎమోషన్ అవుతుంది. అప్పు గురించి బాధపడుతున్న కృష్ణమూర్తిని సుభాష్, ప్రకాష్ ఓదారుస్తుంటారు. తర్వాత అనామిక ఎంట్రీ ఇస్తుంది. అప్పును రౌడీల సాయంతో అనామిక కిడ్నాప్ చేస్తుంది. అనామికను చూసి అప్పు షాకవుతుంది.
అప్పు: నీకు జైలుకు వెళ్లిన బుద్దిరాలేదా
అనామిక: నన్ను జైలుకు పంపించిన ఒక్కొక్కరిని ఒక్కో ఆట ఆడుకోవాలని తిరిగి వచ్చాను నీతోనే ఈ ఆటను మొదలుపెట్టాను.
అప్పు: నువ్వే నన్ను కిడ్నాప్ చేశావని తెలిస్తే నీకు మళ్లీ జైలు తప్పదు అనామిక.
అనామిక: నా పగ చల్లారిన తర్వాత జీవితాంతం జైలులో కూర్చోవడానికైనా నేను రెడీ అప్పు.
అంటూ అనామిక వార్నింగ్ ఇస్తుంది. నన్నుప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టడమే కాకుండా నాకు విడాకులు ఇప్పించడానికి కారణం నువ్వేనని, నన్ను జైలుకు పంపించిన నువ్వే నా మొదటి టార్గెట్ అని అప్పుతో అంటుంది అనామిక. నీ పెళ్లి ఆపించి కళ్యాణ్‌తో నువ్వు లేచిపోయావని అందరిని నమ్మించడానికే కిడ్నాప్ చేశానని అనామిక చెబుతుంది. మరోవైపు పెళ్లిమండపంలో ఈ పాటికి అప్పు, కళ్యాణ్‌లా పెళ్లి జరిగిపోయి ఉంటుందని రుద్రాణి అంటుంది. ఇంతలో కళ్యాణ్ రావడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.