Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు వార్నింగ్ ఇచ్చిన అపర్ణ – ఎమోషనల్ అయిన కావ్య
Brahmamudi serial today episode August 14th: ఇంకోసారి కిచెన్‌లోకి వెళ్లొద్దని కావ్యకు అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: అప్పును ఏ పని చేయోద్దని ఇక నుంచి రెస్ట్ తీసుకోమని కావాలనుకుంటే.. సింపుల్‌గా యోగా.. లేదంటే మెడిటేషన్ చేసుకో అంటూ కళ్యాణ్ చెప్తాడు.
అప్పు: ఏంటి కూచి కోపం వచ్చిందా.? అలిగావా..? సరేలే ఇంకా నా కడుపులో ఉన్న నీ కూతురుకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అంతే కాదు కూచి మీ నాన్న నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో కూడా చెప్తాను.
అంత బయటి నుంచి చూస్తున్న కావ్య.. రాజ్‌ను గుర్తు చేసుకుంటూ రాజ్‌తో గతంలో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు.
అపర్ణ: ఏంటి కావ్య ఏం జరిగింది..?
కావ్య: ఏం లేదు అత్తయ్య
అంటూ వెళ్లిపోతుంది.
ఇందిరాదేవి: పాపం పిచ్చిది నా మనవడు ఈ టైంలో తనతో పాటు ఉంటే బాగుంటుంది అని ఆశ పడుతుంది అపర్ణ.
అపర్ణ: తల్లి కాబోయే ఏ ఆడపిల్లైన కోరుకునేది ఈ టైంలో భర్త పక్కన ఉండాలనే కదా అత్తయ్య .. దాని దురదృష్టమో.. మన అదృష్టమో వాడు ఈ ఇంటికి దాని జీవితానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వాడు పక్కన లేని లోటు ఎలాగూ తీర్చలేం.. కనీసం దాన్ని సంతోషపెట్టే ప్రయత్నం అయినా చేద్దాం అత్తయ్యా
ఇందిరాదేవి: అవును అపర్ణ అలాగే చేద్దాం..
మరునాడు కావ్య కాఫీ చేస్తుంటే అపర్ణ, ఇందిరాదేవి వెళ్తారు.
అపర్ణ: కావ్య ఏం చేస్తున్నావు
కావ్య: నేనేం చేస్తున్నాను కాఫీ పెడుతున్నాను అంతేగా అత్తయ్యా
అపర్ణ: కాఫీ కావాలని మేము నిన్ను అడిగామా
కావ్య: అదేంటి అత్తయ్యా ఇన్ని రోజులు కాఫీ పెడుతుంది నేనేగా
ఇందిరాదేవి: ఇన్ని రోజులు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి అనుకుంటున్నావా..? కొద్ది రోజుల్లో నువ్వు దుగ్గిరాల ఇంటికి వారసుణ్ని ఇవ్వబోతున్నావు
అపర్ణ: రత్తాలు.. ఎక్కడున్నావు.. రత్తాలు ఇటురా..
రత్తాలు: చెప్పండి అమ్మగారు
అపర్ణ: ఇక నుంచి కిచెన్‌లో నువ్వు తప్ప కావ్య కనబడకూడదు. అలా కనబడితే ఇక నుంచి నువ్వు ఉండవు
రత్తాలు: అలాగే అమ్మగారు.. అమ్మ కావ్య అమ్మ దయచేసి మీరు వెళ్లండి మీ ఇల్లును నమ్ముకునే బతుకుతున్నాను.
అనగానే కావ్య వెళ్లిపోతుంది. అందరికీ కాఫీ రత్తాలు తీసుకొస్తుంది.
ప్రకాష్: కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి..? రత్తాలు
ఇందిరాదేవి: ఏం అది తీసుకొస్తే కాఫీ తాగరా ఏంటి..?
ప్రకాష్: అలా కాదు ఎప్పుడూ కావ్య కదా తీసుకొచ్చేది
అపర్ణ: ఇప్పటి నుంచి కాఫీయే కాదు వంట కూడా చేయదు.
ప్రకాష్: మరి ఎవరు చేస్తారు వదిన..
అపర్ణ: నేనే చేస్తాను..
ప్రకాష్: అయ్యో..
అపర్ణ: ఏం పాతికేళ్లుగా నేనే చేశాను తినలేదా..?
ఇందిరాదేవి: అంతకు ముందు నేను చేశాను కదా
ప్రకాష్: అయితే ఓకే మీ వంట అమృతంతో సమానం
రుద్రాణి: అయినా కావ్యకు ఏమైంది వదిన సడెన్‌గా పనులు మానేసింది.
అపర్ణ: ఇప్పుడు తను పనులు చేయకూడదు కాబట్టి
ఇందిరాదేవి షాక్ అవుతుంది.
రుద్రాణి: తను ఏమైనా ప్రెగ్నెంటా..? పనుల చేయకుండా ఉండటానికి
ఇందిరాదేవి: అసలు నీ ఉద్దేశం ఏంటి రుద్రాణి.. కడుపుతో ఉంటేనే పనులు చేయకూడదా..?
రుద్రాణి: కాదు చెల్లికి కడుపొస్తే.. అక్కకు రెస్ట్ ఇవ్వడం వెనక మీ ఉద్దేశం ఏంటా..? అని
అపర్ణ: ఉద్దేశం లేదు పాడు లేదు.. పాపం నా కోడలు ఇన్ని రోజుల కష్ట పడటం చూసి నాకే జాలేసింది. ఇంట్లో ఇంత మంది పనివాళ్లు ఉండగా తను పని చేయడం ఏంటా..? అనిపించింది.
ఇందిరాదేవి: అందుకే కావ్యకు కిచెన్ నుంచి రిటైర్‌మెంట్ ఇచ్చాం
ప్రకాష్: ఏంటి కిచెన్ నుంచి రిటైర్‌మెంట్ ఇచ్చారా..?
అనగానే అపర్ణ, ఇందిరాదేవి అవును ఇచ్చాం అంటూ ప్రకాష్‌కు లెక్చర్ ఇస్తారు. దీంతో ప్రకాష్ నన్న వదిలేయండి అమ్మా అంటాడు. అందరూ నవ్వుకుంటారు. తర్వాత రాహులతో రుద్రాణి కావ్య రూంలోకి వెళ్లి నిజం తెలుసుకోవాలని చెప్తుంది. సరే అంటాడు రాహుల్. తర్వాత ధాన్యలక్ష్మీ అప్పుతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తా అని చెప్తుంది. రాత్రికి కావ్య రూంలోకి వెళ్లి టాబ్లెట్ తీసుకెళ్తాడు. ఆ టాబ్లెట్ చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. అవి ప్రెగ్నెంట్ వాడే టాబ్లెట్ అని రాహుల్‌కు చెప్తుంది. వెంటనే విషయం యామినికి చెప్పాలనుకుంటుంది. మరోవైపు స్వరాజ్ భోజనం చేయకుండా అపర్ణతో మాట్లాడాలని మారాం చేస్తుంటే.. రేవతి, అపర్ణకు ఫోన్ చేస్తుంది. స్వరాజ్‌తో మాట్లాడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















