అన్వేషించండి

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పును కోడలిగా అంగీకరించిన ధాన్యలక్ష్మీ – అప్పును ఇంట్లోకి తీసుకురావద్దన్న కావ్య

Brahmamudi Today Episode: కళ్యాణ్ లేకపోతే నేను బతకలేనని నువ్వే ఎలాగైనా కళ్యాణ్, అప్పులను తీసుకురావాలని ధాన్యలక్మీ, రాజ్ ను రిక్వెస్ట్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: తమ ఫ్రెండ్స్‌ చలిలో పడుకోవడం చూసిన అప్పు, కళ్యాణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్‌ అవుతారు. అదే విషయం ఫ్రెండ్స్‌ కు చెబితే వాళ్లు వద్దని వారిస్తారు. అయితే తాము గెస్ట్‌ హౌస్‌ కు షిప్ట్‌ అవుతున్నట్లు అప్పు తన ఫ్రెండ్స్‌ కు చెప్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతుంటారు. ధాన్యలక్ష్మీ మాత్రం రూంలోనే ఉండిపోతుంది. ధాన్యలక్ష్మీ ఎక్కడుందని ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో రాజ్‌, కావ్య చేసిన నిర్వాకానికి ధాన్యలక్ష్మీ బయటకు రాలేకపోతుందని రుద్రాణి అంటుంది. దీంతో రుద్రాణికి స్వప్న వార్నింగ్‌ ఇస్తుంది. కావ్య ధాన్యలక్ష్మీ రూంలోకి కాఫీ తీసుకుని వెళ్తుంది.

ధాన్యలక్ష్మీ: కాఫీ ఇస్తున్నావా? విషం ఇస్తున్నావా?

ప్రకాష్‌: కావ్య నాకివమ్మా.. కళ్యాణ్‌ కాఫీ తాగుదువు కిందకు రారా.. అవున్నమ్మా ఉదయం నుంచి కళ్యాణ్‌ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడు వీడు.

 ( అందరూ షాక్ అవుతారు. బెడ్‌ రూంలోంచి ధాన్యలక్ష్మీ ఏడుస్తూ వస్తుంది.)

ధాన్యలక్ష్మీ: క‌ళ్యాణ్ లేడు...ఇక మన ఇంటికి రాడు..

అని ధాన్యలక్ష్మీ చెప్పడంతో కళ్యాణ్‌ వెళ్లిపోయిన విషయం గుర్తుకు వచ్చిన ప్రకాశ్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. ధాన్యలక్ష్మీ కూడా అందరిని తిడుతుంది. తనను ఓదార్చడానికి వచ్చిన రాజ్ దూరంగా నెట్టి వేస్తుంది.

రుద్రాణి: ఈ కథంతా వెనకుండి నడిపించిన కావ్యను వదిలేశావేంటి? ధాన్యలక్ష్మీ.  

అపర్ణ: నీకు ఎన్నిసార్లు గ‌డ్డి పెట్టిన బుద్ధిరాదా?

స్వప్న: ప‌శువుల జాతికి చెందిన‌ది క‌దా...మ‌నిషిలా ఎందుకు మాట్లాడుతుంది.

కావ్య: ఇలా ఎవరు పడితే వాళ్లు ఇష్టం వచ్చినట్లు నిందలు వేస్తార‌నే అప్పు, క‌ళ్యాణ్ పెళ్లి జ‌ర‌గ‌కుండా నేను  అడ్డుకున్నాను. పెళ్లి చేసింది మీరు...మాట‌లు ప‌డేది నేనా? .. వాళ్ల‌కు మీరు స‌మాధానం చెప్తారా? న‌న్ను స‌మాధానం చెప్ప‌మంటారా?

 అంటూ కావ్య, రాజ్‌ను నిలదీస్తుంది. ఈ గొడవలన్నీ పక్కన పెట్టి కళ్యాణ్‌ను ఇంటికి తీసుకురమ్మని ప్రకాష్‌ కన్నీళ్లతో రాజ్‌ను వేడుకుంటాడు. దీంతో రాజ్‌ వాళ్లిద్దరిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదేనని చెప్పడంతో ధాన్యలక్ష్మీ కోపంగా ఆ అప్పు ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి నేను ఒప్పుకోను అంటుంది. క‌ళ్యాణ్‌కు పెళ్లి అయింద‌ని, భార్యాభ‌ర్త‌ల‌ను విడ‌దీయ‌డం పాప‌మ‌ని అప‌ర్ణ‌, ఇందిరాదేవి ఎంత చెప్పినా ధాన్యలక్ష్మీ వినదు. డ‌బ్బు కోస‌మే క‌ళ్యాణ్‌ను అప్పు పెళ్లిచేసుకుంద‌ని నానా మాటలు తిడుతుంది.

ప్రకాష్‌: నేను కూడా నిన్ను వ‌దిలేయాల‌నుకుంటున్నాను. భ‌రణం కింద నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను.

ధాన్యలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నారు మీరు?

ప్రకాష్‌: మ‌రి నువ్వేం మాట్లాడుతున్నావు...అప్పు కోస‌మే ఇళ్లు వ‌దిలిపెట్టిన క‌ళ్యాణ్‌...ఆమె లేకుండా ఇంటికి ఎలా తిరిగివ‌స్తాడ‌ని అనుకుంటున్నావు. అసలు క‌ళ్యాణ్ ఇళ్లు వ‌దిలిపెట్ట‌డానికి కార‌ణం నువ్వు, రుద్రాణి.

ధాన్యలక్ష్మీ: ఆ మాటకొస్తే అప్పు వ‌ల్లే క‌ళ్యాణ్ కాపురం కూలిపోయింది. అనామిక జైలు వెళ్లింది. మ‌న కుటుంబం ప‌రువు పోయింది. అటువంటి దాన్ని  ఇంట్లో అడుగుపెట్టనివ్వను.

అపర్ణ: ఆస్థి కోస‌మే క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంద‌ని మాటిమాటికి అనకు. నీవల్ల, రుద్రాణి వ‌ల్లే అప్పుకు మ‌రో అబ్బాయితో జ‌ర‌గాల్సిన పెళ్లి  ఆగిపోయింది.

 ఎవ‌రు ఎంత చెప్పిన ధాన్య‌ల‌క్ష్మి విన‌దు. నాకు నా కొడుకు మాత్ర‌మే కావాలి. అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్, కావ్య గొడవపడతారు. కళ్యాణ్‌ ను ఒప్పించి ఎలాగైనా ఇక్కడికి తీసుకురావొచ్చు కానీ నన్ను ఇబ్బంది పెట్టినట్లు అప్పును పెడితే తాను ఊరుకోదని అప్పుడు ఇంట్లో రోజు యుద్దమే జరుగుతుందని చెప్తుంది. తర్వాత ధాన్యలక్ష్మీ రాజ్‌ దగ్గరకు వచ్చి కళ్యాణ్‌కు దూరంగా నేను ఉండలేనని నువ్వే ఎలాగైనా అప్పు, కళ్యాణ్‌ లను తీసుకురావాలని అడుగుతుంది. రాజ్‌ సరేనని కావ్యను కూడా తనతో పాటు రమ్మని ఇద్దరం కలిసి వెళ్లి తీసుకొద్దామని అడగ్గానే కావ్యను తాను రానని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget