Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను ఓదార్చిన అపర్ణ, ఇంద్రాదేవి – ప్రగ్నెన్సీ విషయంలో గొడవ పడ్డ కళ్యాన్, అప్పు
Brahmamudi serial today episode August 12th: అప్పుకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న ఆనందలో ఉన్న దుగ్గిరాల కుటుంబంలో మనస్పర్థలు వచ్చేలా చేయాలనుకుంటుంది రుద్రాణి.

Brahmamudi Serial Today Episode: కావ్యకు ఏ క్యాన్సర్ లేదని రావాలని నువ్వు కోరకుంటున్నావా..? అని అపర్ణ, ఇందిరాదేవి అడగ్గానే.. రాజ్ సిగ్గు పడుతాడు. కానీ కళావతి గారు ఏదో దాస్తున్నారు అదేంటో కనుక్కుంటాను అని రాజ్ మనసులో అనుకుంటాడు. రూంలో కళ్యాణ్ కవితలు రాసుకుంటుంటే అప్పు వస్తుంది.
అప్పు: కూచి ఏం చేస్తున్నావు..?
కళ్యాణ్: కవిత రాసుకుంటున్నాను
అప్పు: నాకు పుల్లగా తినాలనిపిస్తుంది కూచి..
కళ్యాణ్: ఇది వర్షాకాలం మామిడి కాయలు దొరకవు ఒకవేల దొరికినా అన్ని పురుగులు ఉంటాయి.. తింటావా..
అప్పు: మామిడి కాయలు దొరక్కపోతే ఏంటి..? కూచి చింతకాయలు దొరుకుతాయి కదా..? తెచ్చిపెట్టొచ్చు కదా
కళ్యాణ్: దానికి తెచ్చిపెట్టడం దేనికి కిచెన్‌లోకి వెళితే చింతపండు కిలోలు కిలోలు… పొట్టి నువ్వు…
అప్పు: అవును
అనగానే కళ్యాణ్ సంతోషంగా అప్పును ఎత్తుకుని తిప్పుతాడు.
కళ్యాణ్: ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను
కళ్యాణ్ కిందకు పరుగున వెళ్తూ అందరినీ గట్టిగా పిలుస్తాడు.
ప్రకాష్: ఏంట్రా ఏదో ఇంటర్ పాసయిన స్టూడెంట్ లాగా కేకలు పెడుతున్నావేంట్రా…
కళ్యాణ్: ఇది అంతకంటే పెద్ద గుడ్‌న్యూస్ నాన్న
సుభాస్: ఏదైనా పెద్ద సినిమాకు పాటలు రాసే చాన్స్ దొరికిందా ఏంట్రా అంత సంతోషపడుతున్నావు
కళ్యాణ్: అది పెద్దనాన్న.. పొట్టి నువ్వు చెప్పు
అప్పు: నేను చెప్పను.. నువ్వే చెప్పాలి..?
రుద్రాణి: ఏంటి సిగ్గు పడుతున్నారా..? అంత పనికిమాలిన పని ఏం చేశారు..?
ఇందిరాదేవి: అందరూ నీలాగా ఉంటారా…? ఇంతకీ ఏంటి నాన్నా ఆ విషయం.. సిగ్గు పడింది చాలు ఏంటో చెప్పు
కళ్యాణ్, ఇందిరాదేవి చెవిలో విషయం చెప్తాడు. ఇందిరాదేవి సిగ్గుపడుతుంది.
ప్రకాష్: ఏం చెప్పావురా మా అమ్మకు చెవిలో అలా సిగ్గు పడుతుంది.
ఇందిరాదేవి: నువ్వు తండ్రివి కాబోతున్నావురా..
కళ్యాణ్: నాన్నమ్మ…
ఇందిరాదేవి: నువ్వు కాదు నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు
అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
కావ్య: ఇప్పడు మనం దీన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి.
రుద్రాణి: నువ్వు చెప్పేది నిజమే కావ్య కానీ మా వదిన ముఖం చూస్తుంటే అలా కనిపించడం లేదు.
అపర్ణ: రుద్రాణి నేను చెప్పానా..?
రుద్రాణి: చెప్పకపోయినా..? ఒక మీ మనసులో ఏమనుకుంటున్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా..? వదిన.. ఈ ఇంట్లో మొదటగా పెళ్లి అయింది రాజ్‌కు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది కూడా నీ కోడలే అయితే గియితే మొదట ప్రెగ్నెంట్ అవ్వాల్సింది కావ్య. మొదటగా వారసుణ్ని ఇవ్వాల్సింది కావ్య… కానీ అలా జరగలేదు కదా.. .
అంటూ రుద్రాణి అనగానే అపర్ణ కోపంగా నిజం చెప్పబోతుంటే కావ్య అడ్డుపడుతుంది. అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతంది. కావ్య వెళ్లిపోతుంది.
ధాన్యం: తల్లి అవుతున్నానని చెప్తే సరిపోదు అప్పు. దానికి తగ్గ బాధ్యతలు కూడా తీసుకోవాలి.
కళ్యాణ్: అమ్మా ఫస్ట్ టైం తల్లి అవుతుంది. తనకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పు.. నువ్వు చెబితే ఫాలో అవుతుంది
అనగానే ధాన్యం సలహాలు సూచనలు ఇస్తుంది అప్పుకు ఇక రూంలోకి వెళ్లి బాధపడుతున్న కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి రుద్రాణి మాటలు పట్టించుకోవద్దని ఓదారుస్తారు. మరోవైపు అప్పు, కళ్యాణ్ తమకు కొడుకు పుట్టాలని లేదు కూతురు పుట్టాలని అనుకుంటుంటారు. తర్వాత కావ్యకు మామిడికాయలు తినమని అప్పు ఇస్తుంటే.. రుద్రాణి చూసి కావ్యకు ఎందుకు ఇస్తున్నావు.. కావ్య కూడా నెల తప్పిందా..? అందుకే రాజ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిందా అంటుంది. అప్పు, కావ్య షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















