అన్వేషించండి

Brahmamudi Serial Today April 9th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : కలగన్న కావ్య – ట్విస్టు అదిరిపోయింది-అయోమయంలో ప్రకాష్‌  

Brahmamudi Today Episode: రాజ్‌ను చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ. యామినితో అపర్ణ గొడవ పెట్టుకున్నట్టు అంతా కావ్య కలగనడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రాజ్‌ను చూసిన అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. చిన్నప్పటి నుంచి రాజ్‌ను ఎలా పెంచింది ఏడుస్తూ చెప్తుంది. రాజ్‌ అయోమయలో పడిపోతాడు.   

యామిని:  ఎవరండి మీరు తను రాజ్‌ కాదు రామ్‌. నా బావ. తన చిన్నతనంలోనే వాళ్ల అమ్మా నాన్నా చనిపోతే మా దగ్గరే పెరిగాడు. చిన్నప్పటి నుంచి కలిపి పెరిగాం. కలిపి బతికాం. ఇప్పడు కలిసి జీవితాన్ని కూడా పంచుకోబోతున్నాం. మధ్యలో మీరంతా వచ్చి రాజ్‌ అంటూ ఏంటి గొడవ. ఏంటి మమ్మీ మీరు మౌనంగా చూస్తున్నారు. డాడీ వాళ్ల చెల్లెలు కొడుకే కదా బావ

అపర్ణ:  ఓరేయ్‌ రాజ్‌ ఎవర్రా అమ్మాయి..

 రాజ్‌:  తను నాకు కాబోయే భార్య యామిని

 అపర్ణ: నీకు మళ్లీ పెళ్లేంటి..? నీకు ఆల్‌రెడీ పెళ్లి అయింది కదా..? నీ పెళ్లాంతో సంవత్సరంన్నర కాపురం కూడా చేశావు. ఇది కూడా నీకు గుర్తు లేదా

 కావ్య దగ్గరకు వెళ్లి రా కావ్య ముందుకు రమ్మని అపరణ పిలుస్తుంది. కావ్యను చూసిన రాజ్‌ కళావతి గారు అని మనసులో అనుకుంటాడు.

అపర్ణ: కావ్య అక్కడ అంతా జరుగుతుంటే ఇక్కడ నిలబడి చూస్తావేంటి..? నీ మొగుడు బతికే ఉన్నాడని మాకు చెప్పింది నువ్వే కదా ఇప్పుడు కళ్ల ముందుకు వస్తే కనిపించకుండా ఇలా దూరంగా నిలబడ్డావేంటి.. రా.. ఇదేరా నీ భార్య.

రాజ్: తను నాకు తెలుసు తన పేరు కళావతి తను నాకు ఫ్రెండ్‌. మా ఇద్దరి మధ్య ఈ మధ్యనే పరిచయం అయింది.  తను నా భార్యే అయితే ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు.

 అందరూ కావ్య ఎందుకు ఇన్ని రోజులు నిజం చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తారు.  

 కావ్య:  ఆయన చెప్పేది నిజమే.. ఆయనకు మనం ఎవరమో తెలియదు.

రుద్రాణి:  ఓహో సూపర్‌ ట్విస్టు అదిరిపోయింది. అంటే తను మన రాజ్‌ కాదన్నమాట. తన పేరు యామిని చెప్తున్నట్టు రామ్‌ అన్నమాట. రాజ్‌లా ఉన్నాడని తనతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నావా..? ఇప్పుడు డబుల్‌ యాక్షన్‌ ఉన్నాడని చెప్తున్నావా..?

 కావ్య:  ఆయన రామ్‌ కాదు రాజ్‌

 రుద్రాణి: నీ కంటికి మేము జోకర్స్‌ లా కనిపిస్తున్నామా..? ఎవరో తెలియకపోతే రాజ్‌ ఎందుకు ఇలా బిహేవ్‌ చేస్తున్నాడు.

కావ్య: ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు. ఆ రోజు మేము శ్రీశైలంకు వెళ్లినప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన గతం మర్చిపోయారు. ఏదో ఒక రోజు ఆయన్ని మామూలు మనిషిని చేసి మీ అందరికీ చూపించాలనుకున్నా.. అందుకే ఈ విషయాలు మీ దగ్గర దాచాలనుకన్నా

సుభాష్‌:  ఏంటమ్మా కావ్య ఇదంతా వాడికి గతం గుర్తు లేకపోతే మన ఇంటికి తీసుకొచ్చి వాడికి గతం గుర్తుకు వచ్చేలా ప్రయత్నం చేయాలి కానీ వాళ్లెవరో తెలియని ఇంట్లో పెట్టి మాకు అందరికీ ఎందుకు దూంర చేశావు

కావ్య:  ఎలా తీసుకురమ్మంటారు మామయ్య.. ఆ యామిని ఆడే నాటకంలో ఆయన ఒక పావులా మారిపోయారు. ఇప్పుడు ఆయనకి ఇలాంటి విషయాలు చెప్పి ఆయనకు ప్రెషర్‌ ఇస్తే డాక్టర్‌ గారు ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నారు.

యామిని:  మీ అందరికీ మళ్లీ చెప్తున్నాను తను రాజ్‌ కాదు రామ్‌ నా బావ. సిక్స్‌ మంత్స్‌ బ్యాక్‌ ఆయనకు యాక్సిండెంట్ అయి కోమాలోకి వెళ్లాడు. బావ నువ్వు వీళ్ల మాటలు నమ్మకు వాళ్లు కట్టు కథలు చెప్తున్నారు.

అపర్ణ: ఎవరు కట్టుకథలు చెప్తున్నారో ఇప్పుడే నిరూపిస్తాను.

అనగానే అందరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ వల్ల రాజ్ స్పృహ కోల్పోతుంటాడు. కావ్య ఏడుస్తూ రాజ్‌ను చూస్తుంది. ఇంతలో అపర్ణ గట్టిగా కావ్య అక్షింతలు తీసుకో అంటూ చెప్పడం విన్న కావ్య స్పృహలోకి వచ్చి ఇదంతా కలా అని మనసులో అనుకుని వెంటనే రాజ్‌ను యామిని ఇక్కడి  నుంచి తీసుకెళ్లేలా చేయాలని అక్షింతలు తీసుకుని రాజ్‌ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. కావ్యను చూసిన రాజ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. యామిని మాత్రం అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress : తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress : తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ ఘరం ఘరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Embed widget