Brahmamudi Serial Today April 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : పూజలోకి రాజ్ వస్తాడన్న కావ్య – కావ్యకు పిచ్చి ముదిరింది అన్న రుద్రాణి
Brahmamudi Today Episode: గుడిలో జరిగే పూజలో తన పక్కన కూర్చోవడానికి రాజ్ వస్తాడని కావ్య చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: శ్రీరామ నవమి సందర్భంగా అందరం కలిసి గుడికి వెళ్లి సీతారాముల కళ్యాణం జరిపించాలని కావ్య చెప్తుంది. కావ్య మాటలకు రుద్రాణి నవ్వుతుంది. ఇంద్రాదేవి మాత్రం ఇప్పుడు గుడికి ఎందుకు అని అడుగుతుంది.
కావ్య: ఎందుకు ఏంటి అమ్మమ్మ గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కళ్యాణం జరిపిద్దాం.
రుద్రాణి: ప్రతి సంవత్సరం వెళ్లి పూజలు చేయించేవాళ్లం. కానీ రాజ్ చేతుల మీదుగానే చేయించేవాళ్లం. కానీ లాస్ట్ ఇయర్ మా వదిన గొప్పలకు పోయి నా కొడుకు కోడలు అని మీ ఇద్దరి చేతులు మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి చాలా గ్రాండ్‌గా సీతారాముల కళ్యాణం జరిపించారు. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళితే నీ కొడుకు ఎక్కడ..? కళ్యాణానికి ఎందుకు రాలేదని అడిగితే సమాధానం ఏమని చెప్తారు.?
కావ్య: ఆ సమాధానాలే నేను చెప్పుకుంటాను. మామయ్య గుడిలో పూజారికి నేను ఫోన్ చేసి చెప్పాను. మనందరం వెళ్లాలి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రుద్రాణి: ఇప్పుడెందుకు ఇవన్నీ ఇంటి పరువు తీయడం కాకుంటే
ధాన్యలక్ష్మీ: కావ్య రుద్రాణిని సమర్థిస్తున్నాను అనుకోకుంటే నిజంగానే ఇప్పుడు పూజ చేయడం అవసరమా..?
ప్రకాష్: అవును కావ్య… రాజ్‌కు ఏమయింది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాము.
కావ్య: చిన్న మామయ్య అందరికీ సమాధానం నేను చెప్తాను అంటున్నాను కదా..?
రాహుల్: ఏం చెప్తావు రాజ్ బతికే ఉన్నాడని కానీ ఎక్కడున్నాడో తెలియదని చెప్తావా..?
ఇంద్రాదేవి: కావ్య మంచి కోసమే చెప్తుంది కదా..? అందరం వెళ్లి ఆ దేవుడి కళ్యాణం చేయిద్దాం
కావ్య: ఇంటి పరువు విషయంలో ఎవ్వరూ కంగారు పడవద్దు అసలు ఈ కళ్యాణం జరిపిస్తుందే ఆయన తిరిగి ఇంటికి రావాలని మీరంతా ముందు రెడీ అవ్వండి
అని చెప్పగానే సీతారామయ్య కూడా అందరినీ రెడీ కమ్మని చెప్తాడు. మరోవైపు యామిని వాళ్లు గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంటారు.
వైదేహి: ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ యామిని
యామిని: బావకు నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పలేదు. ఇప్పుడు చెప్పి తీసుకెళ్తాను
యామిని ఫాథర్: చెప్పుండాల్సింది బేబీ. ఇప్పుడు చెబితే రాకపోతే ఎలా
యామిని: ఇప్పుడు ఎలాగైనా వస్తాడులే డాడీ
ఇంతలో రాజ్ వస్తాడు.
రాజ్: ఏంటి యామిని ఇంత ట్రెడిషన్‌గా రెడీ అయ్యావు.. ఎక్కడికి వెళ్తున్నారు..?
యామిని: పోనీలే బావ ఇన్ని రోజులకు అయినా నేను వేసుకున్న డ్రెస్‌ను గుర్తు పట్టావు. ఇన్ని రోజులుగా నీ నుంచి ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదు
రాజ్: సరే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ ట్రెడిషనల్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు.
యామిని: థాంక్యూ బావ..
రాజ్: సరే ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు
అంటూ రాజ్ అడగ్గానే గుడికి వెళ్తున్నామని సీతారాముల కళ్యాణానికి అని నువ్వు కూడా రావాలని చెప్తుంది. రాజ్ రానని చెప్తాడు. దీంతో యామిని, వైదేహి సెంటిమెంట్ మాటలు చెప్పి రాజ్‌ను ఒప్పించి గుడికి తీసుకెళ్తారు. మరోవైపు గుడిలో కళ్యాణంలో పీటల మీద జంటలు కూర్చోమని పంతులు చెప్పగానే.. సీతారామయ్య, ఇంద్రాదేవి, సుభాష్, అపర్ణ, ధాన్యలక్ష్మీ, ప్రకాష్ కూర్చుంటారు. కావ్య కూర్చోబోతే రుద్రాణి ఆపుతుంది. అక్కడ జంటలు మాత్రమే కూర్చోవాలి అని చెప్తుంది. దీంతో కావ్య బయటకు వెళ్లి రాజ్ ఫోటో తీసుకుని వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















