Brahmamudi Serial Today April 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : యామినికి కావ్య వార్నింగ్ - కావ్యతో పార్టీ ప్లాన్ చేసిన రాజ్
Brahmamudi Today Episode: కావ్య కోసం రాజ్ ఇంటి నుంచి రావడంతో యామిని వెనకాలే ఫాలో అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్యకు ఫోన్ చేసి తనకు నిద్ర రావడం లేదని నేను తప్పు చేశానని అంటాడు. ఏం తప్పు చేశారని కావ్య అడిగితే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంటే ఇంటికి రావడం అంత సేపు అక్కడ ఉండటం నాకు కరెక్టు కాదనిపించింది అంటాడు రాజ్.
కావ్య: అలాంటిదేం లేదండి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
రాజ్: నేను తిరిగి వస్తుంటే మీ మామయ్యగారు చూశారు కదా ఆయనేమీ అనలేదా…
కావ్య: ఏమీ అనలేదు.. పైగా మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యారు
రాజ్: నేను వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఫీల్ కావడం ఏంటండి..?
కావ్య: అదే మిమ్మల్ని చూడగానే మంచి అభిప్రాయం ఏర్పడిందట. అందుకే ఆయన హ్యాపీగా ఉన్నారు
రాజ్: మంచితనం మన బ్లడ్ లోనే ఉంది లేండి.. మనల్ని చూస్తే ఎవరైనా ఇట్టే ఇంప్రెస్ అవుతారు
కావ్య: అందుకే యామిని ఇంత దారుణానికి ఒడిగట్టింది
అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇద్దరూ చాలా సేపు ఫోన్ లో మాట్లాడుకుంటారు. తర్వాతి రోజు ఉదయం కావ్య కిచెన్‌లో కాఫీ చేస్తుంది. అపర్ణ వస్తుంది.
అపర్ణ: కావ్య వెంటనే నా కొడుకును చూడాలనిపిస్తుంది నాకు మాట్లాడాలి అనిపిస్తుంది.
కావ్య: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అత్తయ్య..
అపర్ణ: అంతా నా కర్మనే అత్తను అయ్యుండి నా కొడుక్కి సైట్ కొట్టమని నీకు సలహాలు ఇవ్వాల్సి వస్తుంది.
కావ్య: అత్తయ్యా కొడుక్కి సైటు కొట్టమని మీరు పరాయి వాళ్లకు చెప్పట్లేదు కదా..? మీ కొడలికే కదా చెప్తున్నారు. పర్వాలేదు నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి
అపర్ణ: చెప్తాను విను నిన్న వాడు నీకో చీర ఇచ్చాడు కదా..? అది నీకు నచ్చింది కదా..?
కావ్య: చాలా బాగా నచ్చింది అత్తయ్యా.. నాకు ఏది ఇష్టమో అదే కచ్చితంగా తెచ్చారు
అపర్ణ: మరి ఆ విషయం వాడికి చెప్పావా..?
కావ్య: రాత్రే ఫోనులో చెప్పాను అత్తయ్యా..
అపర్ణ: ఫోనులో కాదు వెంటనే నువ్వు వాడి దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని మరీ నచ్చిందని చెప్పు
అంటూ అపర్ణ సలహా ఇవ్వగానే సరేనంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని, వైదేహి హాల్లో రాజ్ కోసం వెయిట్ చేస్తుంటారు.
వైదేహి: ఉదయాన్నే రామ్‌ను బయటకు తీసుకెళ్లాలని నువ్వు రెడీ అయ్యావు కానీ రామ్ ఇంకా రాలేదు కదా
యామిని: పర్వాలేదు మమ్మీ బావ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. కానీ ఇవాళ బావను వదలను
రాజ్ వస్తాడు.
యామిని: వచ్చావా బావ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను.. వెళ్దామా బావ
రాజ్: ఎక్కడికి యామిని
యామిని: బయటకు బావ
రాజ్: బయటకు అంటే ఎక్కడికి
యామిని: అదేంటి బావ ఒక ఇంపార్టెంట్ పని మీద మనం బయటకు వెళ్లాలి అని చెప్పాను కదా..? మర్చిపోయావా
రాజ్: ఓ అవును కదా మర్చిపోయాను
అంటూ కావ్య కూడా ఫోన్ చేయలేదు. ఓ రెండు గంటలు యామినితో వెళితే తర్వత నన్ను ప్రీగా వదిలేస్తుంది అని మనసులో అనుకుని వెళ్లబోతుంటే కావ్య ఫోన్ చేస్తుంది. అర్జెంట్‌గా కలవాలని చెప్తుంది. రాజ్ తనకు అర్జెంట్ పని ఉందని యామినికి చెప్పి వెళ్లిపోతాడు. యామిని రాజ్‌ను ఫాలో అవుతుంది. కాఫీ షాపులో కావ్య, రాజ్ కలిసి మాట్లాడుకోవడం దూరం నుంచి చూసి ఇరిటేట్ అవుతుంది. తర్వాత రాజ్ తనకు పెద్ద పార్టీ ఇవ్వాలని కావ్యను అడుగుతాడు. కావ్య సరే అంటుంది. రాజ్ వెళ్లిపోతాడు. యామిని కావ్య దగ్గరకు వచ్చి గొడవ చేస్తుంది. కావ్య యామినికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















